Big Stories

AP: యువగళం.. వారాహి.. బహుదూరపు బాటసారులు.. లక్ష్యాన్ని చేరేనా?

AP: యువగళం అంటూ నారా లోకేశ్ కాలి నడకన బయలు దేరారు. కుప్పం టు ఇచ్చాపురం. 400 రోజులు.. 4 వేల కిలోమీటర్లు. సుదీర్ఘ పాదయాత్రతో టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనేది లోకేశ్ లక్ష్యం.

- Advertisement -

నేను సైతం అంటూ వారాహిపై యాత్రకు రెడీ అవుతున్నారు జనసేనాని. ఇంకా షెడ్యూల్, రూట్ మ్యాప్ ప్రకటించకున్నా.. త్వరలోనే స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. గతంలో ఓసారి వాయిదా పడగా.. ఈసారిమాత్రం కమింగ్ సూన్ అంటున్నారు. యాత్ర దిగ్విజయంగా సాగేలా.. వారాహికి పూజలు చేయిస్తున్నారు. పవన్ టార్గెట్ కూడా పవర్ లోకి రావడమే.

- Advertisement -

నిస్సందేహంగా ఇద్దరి యాత్రలు సక్సెస్ అవుతాయి. అందులో డౌటే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు లోకేశ్ యాత్రను విజయవంతం చేస్తారు. ఇక, పవన్ కల్యాణ్ గురించి చెప్పేదేముంది. ఆయన కనిపిస్తే చాలు అన్నట్టు జనాలు ఎగబడతారు. సో.. యాత్రలపై పబ్లిక్ ఇంట్రెస్ట్ బాగానే ఉంటుంది.

లోకేశ్ తన యువగళంలో జనగ్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తారు. అక్రమాలు, అరాచకాలు, మూడు రాజధానులు, అప్పులు అంటూ ఏకదరువు ఉపన్యాసాలు ఇస్తారు. సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలంటూ పిలుపిస్తారు.

పవన్ స్పీచ్ మాత్రం ఇంకాస్త స్పైసీగా ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చెప్పుతో కొడతా.. సన్నాసుల్లారా.. చవటల్లారా.. డైమండ్ రాణి.. సంబరాల రాంబాబు.. ఇలా హాట్ హాట్ పంచ్ డైలాగులతో తనదైన వీరావేశంతో వారాహి యాత్రను రక్తి కట్టిస్తారు. అందులో డౌటేముంది.

అంతా బాగానే ఉందికానీ.. ఈ యాత్రలు ఏ మేరకు ఆ పార్టీలను అధికార పీఠానికి చేరువ చేస్తాయనేది ఆసక్తికరం. అప్పట్లో వైఎస్సార్ పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నడిచారు. సీఎం అయ్యారు. ఈసారి మాత్రం ఒకేసారి ఇద్దరు హీరోలు యాత్రలకు సై అన్నారు. మరి, ఆ ఇద్దరూ ఒకేసారి సీఎంలు కాలేరుగా? యాత్రలతో టీడీపీ, జనసేనలు ఒకేసారి అధికారంలోకి రాలేరుగా?

ఒక్క అవకాశం ఉంది. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకంటే.. పాదయాత్ర చేసిన రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. పదవీ కాలాన్ని చెరిసగం పంచుకుంటే.. ఇలు చంద్రబాబు/లోకేశ్.. అటు పవన్ కల్యాణ్ ఒకే టర్మ్ లో ముఖ్యమంత్రులు కావొచ్చు. పొత్తులపై ఇప్పటి వరకైతే క్లారిటీ రాలేదు. యాత్రలు మాత్రం ఎవరికి వారే చేస్తున్నారు. ఇది ఎవరికి లాభం చేస్తుందో.. ఇంకెవరికి నష్టం చేస్తుందో..?

ఇక, యాత్రలనైతే ప్రకటించేశారు కానీ.. గమ్యం చేరుతారా? చేరనిస్తారా? చంద్రబాబు ర్యాలీపైనే రాళ్లు వేసిన ఘటనలు జరిగియి. యువగళం అనుమతికే ముప్పుతిప్పులు పెట్టారు. మరి, లోకేశ్ ను అంతదూరం నడవనిస్తారా? వారాహిని ముందుకు సాగనిస్తారా? అడ్డుకుంటే పసుపుదళం, జనసైన్యం ఊరుకుంటుందా? అందుకే ఇది యాత్రా టైమ్ కాదు.. టెన్షన్ టైమ్ అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News