E-Paper
Advertisement

మూడు వారాల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు టెండర్లు.. సీఎం రేవంత్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి ప్రకటన

మూడు వారాల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు టెండర్లు.. సీఎం రేవంత్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి ప్రకటన
Advertisement

Warangal airport: వరంగల్ ఎయిర్ పోర్టుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది కేంద్రం. మూడు లేదా నాలుగు వారాల్లో టెండర్‌ ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు. 2028 జూన్‌ రెండునాటికి ఎయిర్‌పోర్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమైన తర్వాత మంత్రి ఈ ప్రకటన చేశారు.

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీ-తెలంగాణలో రెండు ఎయిర్‌పోర్టులు  2028 జూన్ 2 నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విమానాశ్రయాలు అవసరమన్నారు.  రెండు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కేంద్ర మంత్రి సహకరిస్తున్నారని చెప్పారు.

Advertisement

మూడు వారాల్లో వరంగల్ ఎయిర్ పోర్టు టెండర్లు-మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయిడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఒక ఎయిర్ పోర్టు  నిర్మించాలంటే నాలుగు అంశాలు ఉంటాయన్నారు. భూసేకరణ, అనుమతులు, నిర్మాణం, ఆ తర్వాత ప్రారంభం ఉంటుందన్నారు. వీటిపై స్పష్టత తీసుకుని అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.

2028 జూన్ రెండు నాటికి ప్రారంభిస్తాం-సీఎం- ఈ సందర్భంగా భూముల సేకరణ వంటి విషయాలను కేంద్రమంత్రితో పంచుకున్నారు  వరంగల్ విమానాశ్రయం ఆకృతిలో కాకతీయ సంస్కృతికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారానికి అవసరమైన చర్చలు చేపడుతున్నామని, అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార స్ఫూర్తి కొనసాగుతుందన్నారు.

Advertisement

పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీ వచ్చి మళ్లీ కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో 5 శాతం జీడీపీని తెలంగాణ సమకూరుస్తోందన్నారు. కొన్ని సమస్యలు జఠిలంగా ఉన్నప్పుడు కేంద్రంతో చర్చిస్తామన్నారు. మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో పదే పదే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఎక్కడైనా సమాచారం లోపం జరిగినా, చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్నారు. అందుకే పదే పదే ఢిల్లీకి వచ్చిన కేంద్రమంత్రులను కలుస్తున్నట్లు తెలిపారు. గిట్టనివాళ్లు పదే పదే సీఎం ఢిల్లీ పర్యటన చేస్తున్నారని చెబుతున్నారని, తాము కేవలం ప్రజల కోసం పని చేస్తున్నామని అన్నారు.

ALSO READ: హైదరాబాద్ లులు మాల్‌లో గన్‌తో హల్‌చల్.. పార్కింగ్‌ గొడవతో అసలు గుట్టు రట్టు!

సీఎం రేవంత్ మాట్లాడిన తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పై ప్రకటన చేశారు. అత్యుత్తమ ఎయిర్ పోర్టుగా మామునూరును తీర్చిదిద్దుతామని, తన హయాంలో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బౌండరీ వాల్, రన్‌వే టెండర్లు సిద్ధం చేశామన్నారు.

దేశంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌గా వరంగల్‌ను తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూమిని రికార్డు సమయంలో అప్పగించిందన్నారు. వరంగల్ ప్రాజెక్టులో ఎలాంటి జాప్యం లేదన్న కేంద్ర మంత్రి, ఆదిలాబాద్‌లో డిఫెన్స్-సివిలియన్ ఎయిర్‌పోర్ట్‌ ను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ ప్రాజెక్టుకు సుమారు 1500 ఎకరాల భూసేకరణ చేయాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వేగంగా భూమి ఇవ్వడంతో ప్రాజెక్టు వేగం పెరిగిందన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలను ఒకలా.. ఎన్డీఏలో లేని రాష్ట్రాలను మరొకలా చూడలేదన్నారు. దేశ అభివృద్ధి కోణంలో పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరమని తేల్చేశారు. భూసేకరణ అనేది రాష్ట్రాల పరిధిలోని అంశమని, తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో భూసేకరణ చేసిందని,  అందుకే అభినందిస్తున్నామన్నారు.

Related News

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×