E-Paper
Advertisement

Redmi Turbo 6 Series లీక్.. ఏకంగా 10,000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో రాబోతున్న కొత్త ఫోన్లు!

Redmi Turbo 6 Series లీక్.. ఏకంగా 10,000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో రాబోతున్న కొత్త ఫోన్లు!
Advertisement

Redmi Turbo 6 Series: స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో రెడ్‌మీ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే ఫోన్లను ఈ సంస్థ పరిచయం చేస్తుంటుంది. అయితే, తాజాగా రెడ్‌మీ నుంచి రాబోతున్న కొత్త సిరీస్ గురించి నెట్టింట్లో కొన్ని ఆసక్తికరమైన లీకులు వైరల్ అవుతున్నాయి. కంపెనీ తమ నెక్ట్స్ జనరేషన్ ‘రెడ్‌మీ టర్బో 6’ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సిరీస్‌లో భాగంగా రెండు మోడళ్లు రానున్నాయని సమాచారం.

భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే:

ఈ కొత్త సిరీస్‌లో రానున్న ఫోన్లు మునుపటి మోడళ్ల కంటే చాలా పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో రాబోతున్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్న టాక్. తాజా లీకుల ప్రకారం.. రెడ్‌మీ టర్బో 6 సిరీస్ ఫోన్లు ఏకంగా 10,000mAh బ్యాటరీతో రానున్నాయట. దీంతో పాటు 7 అంగుళాల భారీ డిస్‌ప్లేను కూడా అందించే అవకాశం ఉంది. ఈ రెండు ఫీచర్లు ఫోన్ వాడకాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లనున్నాయి.

Advertisement

Also Read: ఆఫ్‌లైన్ AI అసిస్టెంట్‌తో ప్రపంచంలోనే తొలి ఏజెంటిక్ స్మార్ట్‌ఫోన్ ‘StepX Neo’ను లాంచ్ చేసిన స్టెప్‌ఫన్!

పవర్‌ఫుల్ ప్రాసెసర్లు:

ఈ సిరీస్‌లో రానున్న రెడ్‌మీ టర్బో 6, రెడ్‌మీ టర్బో 6 మ్యాక్స్ మోడళ్లలో వేర్వేరు మీడియాటెక్ చిప్‌సెట్లను వాడబోతున్నట్లు తెలుస్తోంది. బేస్ మోడల్ అయిన టర్బో 6లో సరికొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 8600 ప్రాసెసర్‌ను ఉపయోగించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇది చాలా వేగంగా పనిచేయడమే కాకుండా తక్కువ బ్యాటరీని వినియోగించుకుంటుంది.

Turbo 6 Max ప్రత్యేకతలు:

Advertisement

ఇక ఈ సిరీస్‌లో ప్రీమియం మోడల్‌గా రాబోతున్న టర్బో 6 మ్యాక్స్‌లో మరింత శక్తివంతమైన డైమెన్సిటీ 9600s చిప్‌సెట్ ఉండనుంది. పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో పాటు.. ఈ ఫోన్‌లో అల్ట్రాసోనిక్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బలమైన మెటల్ మిడిల్ ఫ్రేమ్, నీరు, ధూళి నుంచి రక్షణ ఇచ్చే ఐపీ68 లేదా ఐపీ69 రేటింగ్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఉండబోతున్నట్లు సమాచారం.

విడుదల ఎప్పుడంటే?

ఈ ఫోన్ల లాంచ్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. టెక్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ రెడ్‌మీ టర్బో 6 మ్యాక్స్ ఫోన్‌ వచ్చే ఏడాది అంటే.. 2027 జనవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బేస్ మోడల్ కూడా అదే సమయంలో లేదా కాస్త ముందుగానే మార్కెట్లోకి వచ్చే వీలుంది. ఏదేమైనా ఈ లీకులు నిజమైతే మాత్రం మొబైల్ మార్కెట్లో ఇదొక సంచలనంగా మారడం ఖాయం.

Also Read: ఎయిర్ కండీషనర్ కెపాసిటీని టన్నుల్లో ఎందుకు కొలుస్తారో తెలుసా?

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×