E-Paper
Advertisement

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!
Advertisement

Uttam Kumar Reddy: రాష్ట్రంలో సన్న వడ్ల కొనుగోళ్లపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇందులో ఎలాంటి కుంభకోణం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియా , సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. కొందరు రాజకీయ లబ్ధి కోసమే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో ప్రతీ వ్యవహారం పారదర్శకంగా జరుగుతోందని ఆయన తెలిపారు.

సన్న వడ్ల కొనుగోళ్లపై క్లారిటీ

Advertisement

సన్న వడ్ల టెండర్ల విషయంలో కొందరు చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. మొదట టెండర్ పిలిచినప్పుడు ధరలు పెంచి కోట్ చేయడంతో ఎవరూ ముందుకు రాలేదని, అందుకే నిబంధనల ప్రకారమే మళ్లీ కొత్తగా టెండర్లు పిలవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనేక కుంభకోణాలు జరిగాయని, తమ ప్రభుత్వంలో ప్రతీ పైసా ప్రజాధనాన్ని ఎంతో జాగ్రత్తగా పారదర్శకంగా ఉపయోగిస్తున్నామని అన్నారు.

హరీష్ రావు వ్యాఖ్యలపై తీవ్ర ధ్వజం

Advertisement

మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. హరీష్ రావు నిజంగానే నీటిపారుదల శాఖలో అంతటి గొప్ప ఎక్స్‌పర్ట్ అయితే, గతంలో కేసీఆర్ ఆయనను ఆ పదవి నుంచి ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ముందుగా కవిత అడుగుతున్న ప్రశ్నలకు హరీష్ రావు జవాబు చెప్పాలని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, రూ. 1400 కోట్ల వ్యవహారంలో హరీష్ రావు అసలు నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

సాగునీటి ప్రాజెక్టుల పురోగతి

మరోవైపు దేవాదుల ప్రాజెక్టు పనులపై స్పందిస్తూ.. ప్రస్తుతం అక్కడ 7 పంపులు నిరంతరాయంగా నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ఈ రోజే మరో రెండు పంపులను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. విపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తుందని పునరుద్ఘాటించారు.

Also Read: ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

Related News

సాహిల్ ఫుడ్స్‌పై TG SAFE దాడులు.. 55 టన్నుల ఫుడ్ సీజ్!

తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పుల వేళ.. సరిదిద్దుకోకపోతే దెబ్బే?

తెలంగాణ విద్యారంగంలో అతిపెద్ద స్కామ్.. టెన్త్ కూడా పాస్ అవ్వకుండానే జూనియర్ లెక్చరర్లా?

9 ఏళ్ల హైదరాబాద్ మెట్రో.. వెయ్యి కోట్ల నష్టాలు! అసలు కారణం ఇదే!

సిద్దిపేట ప్రజలకు హరీశ్ రావు బిగ్ అప్‌డేట్.. త్వరలోనే మరో భారీ ప్రాజెక్ట్!

కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సందడి.. డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం

మలక్‌పేటలో జింక మాంసం కలకలం.. రైఫిల్, బుల్లెట్లతో ముగ్గురు అరెస్ట్!

తెల్లవారుజామున కారు బీభత్సం.. పైపులైన్ పగిలి గాల్లోకి ఎగిసిన నీరు, ఉప్పల్‌లో ఘటన

Big Stories

Advertisement
×