Big Stories

Vivek Venkataswamy : మాజీ ఎంపీ వద్ద రూ.కోటి అప్పుతీసుకున్న కేసీఆర్!

Vivek Venkataswamy : మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకట స్వామి వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అప్పు తీసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంకటస్వామి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోనే ఈ విషయం బయటపడింది.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి ఆస్తుల విలువ రూ.606.67 కోట్లుకాగా, చరాస్తులు రూ.380.76 కోట్లు, స్థిరాస్తులు రూ.225.91 కోట్లు, దంపతులిద్దరి పేరిట ఉన్న అప్పు రూ.45.44 కోట్లు ఉన్నాయని వివేక్ తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.

- Advertisement -

అఫిడవిట్ ప్రకారం.. సీఎం కేసీఆర్ రూ.1.06 కోట్ల అప్పు వివేక్ వద్ద తీసుకున్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి వివేక్ రూ.కోటిన్నర అప్పు ఇచ్చారు. ఈ ఎన్నికల అఫిడవిట్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.

ఈ అఫిడవిట్ ప్రకటనతో వెంకట స్వామి రూ.680 కోట్లతో తెలంగాణలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుడిగా ఉన్నారు. వివేక్ వెంటకస్వామి ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. వివేక్‌కు హస్తం పార్టీ చివరి నిమిషంలో చెన్నూరు సీటు కేటాయించింది. ఇక్కడ చెన్నూరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో వివేక్ పోటీపడబోతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News