Preethi: ప్రీతిది ఆత్మహత్యే.. విషం తీసుకుని చనిపోయింది.. పోలీసుల లేటెస్ట్ స్టేట్‌మెంట్

Preethi: ప్రీతిది ఆత్మహత్యే.. విషం తీసుకుని చనిపోయింది.. పోలీసుల లేటెస్ట్ స్టేట్‌మెంట్

preethi
Share this post with your friends

preethi

Preethi: వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ పీజీ స్టూడెంట్‌ ప్రీతిది ఆత్మహత్యే అని పోలీసులు స్పష్టంచేశారు. ఆమె ఇంజెక్షన్‌ ద్వారా పాయిజన్‌ తీసుకున్నట్టు భావిస్తున్నామని వరంగల్‌ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రీతి శవపరీక్ష నివేదికను పరిశీలించి, వివరాలు వెల్లడించారు. ప్రీతి ఆత్మహత్యకు సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ ప్రధాన కారణమని అన్నారు. మరో పది రోజుల్లో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని చెప్పారు.

మరోవైపు, సీపీ ప్రకటనపై ప్రీతి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ప్రీతి పాయిజన్ తీసుకుందంటూ కొత్త నాటకం ఆడుతున్నారని తప్పుబట్టారు. మరి, ఏ విషం తీసుకుందో.. ఎలా తీసుకుందో చెప్పలేకపోతున్నారని విమర్శించారు. ప్రీతి పోస్టుమార్టం రిపోర్ట్ బయట పెట్టడానికి ఇంతకాలం ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు. పోలీసుల విచారణపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రీతి కేసులో ప్రధాన నిందితుడు కండిషనల్ బెయిల్‌పై బయటకు రావడంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Dell: నష్టాల్లో డెల్.. 6వేల మందికి ఉద్వాసన

Bigtv Digital

Corona: మాస్క్ మస్ట్.. న్యూ ఇయర్, పండగ సీజన్లో జాగ్రత్త..

BigTv Desk

CPI Narayana : దమ్ముంటే ఓయూకి వెళ్లి ఓట్లు అడగు! కేసీఆర్‌కు నారాయణ సవాల్..

Bigtv Digital

Gopichand New Movie : 14 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆ ప‌ని చేస్తున్న గోపీచంద్‌

Bigtv Digital

Vande Bharat Express: మోదీ రాక.. తిరుపతికి త్వరగా.. ఖరీదెంత? ప్రత్యేకతలేంటి?

Bigtv Digital

Prabhas RGV : ప్రభాస్ క్రేజీ ప్రాజెక్టులో ఆర్జీవీ..!

BigTv Desk

Leave a Comment