BigTV English

Winter Effect: తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు.. తెలంగాణలో పెరిగిన చలితీవ్రత

Winter Effect: తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు.. తెలంగాణలో పెరిగిన చలితీవ్రత
Today's news in telugu

Winter Effect in Telugu States(Today’s news in telugu):

తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగింది. రాష్ట్రమంతటా ఉష్టోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో..మంచు దుప్పిటి అలముకుంది. దీంతో జనం చలికి గజగజలాడుతున్నారు. వణికిస్తున్న చలికి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రహదారులన్నీ మంచుతో కప్పేయడంతో వాహనదారులు ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు.ఎదురుగా వస్తున్న వాహనాలు కనపించలేనంతంగా మంచు పొగమంచు కమ్మేయడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు.


మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, గూడూరు, కేసముద్రం, గార్ల మండలంలో చలి తీవ్రత పెరిగింది. అధికంగా కురుస్తున్న మంచుతో రోడ్లన్నీ మంచు వలయంలో మారాయి. చలి తీవ్రతకు బయటకు రావాలంటేనే జనం భయంతో హడలిపోతున్నారు. మరికొందరు ఈ చలి తీవ్రతకు తమ ప్రయాణాలను సైతం.. సూర్యుడు కనిపించే వరకు వాయిదా వేసుకుంటున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సేమ్ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటల వరకు ఇదే పరిస్థితి కంటిన్యూ అవడంతో.. వాహనదారులు ప్రయాణానికి ఇబ్బందికరంగా మారింది. వాహనాదారులు హెడ్ లైట్లు వేసుకొని ప్రయాణం చేస్తున్నారు.


అలాగే శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు గోదావరి తీరం పూర్తిగా పొగ మంచుతో కమ్మేడయంతో అవస్థలు తప్పడంలేదు. శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంతో పాటు పరిసరాలు పూర్తిగా పొగమంచుతో కప్పబడ్డాయి.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×