E-Paper
Advertisement

Vijayashanthi: బాలకృష్ణతో నటించకపోవడానికి కారణం అదే.. విజయశాంతి వ్యాఖ్యలు వైరల్

Vijayashanthi: బాలకృష్ణతో నటించకపోవడానికి కారణం అదే.. విజయశాంతి వ్యాఖ్యలు వైరల్
Advertisement

Vijayashanthi:సీనియర్ నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ అని చాలామంది హీరోయిన్లను ఇప్పుడు పిలుస్తున్నారు. నిజం చెప్పాలంటే.. మొట్ట మొదటి లేడీ సూపర్ స్టార్ అంటే విజయశాంతినే. హీరోలుగా ధీటుగా ఆమె సినిమాలు హిట్స్ అందుకొనేవి. హీరో లేకుండా ఒక సినిమాను సూపర్ హిట్ చేయగలిగిన సత్తా ఆమెలో ఉంది.

ఒక పక్క స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేస్తూనే.. ఇంకోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి సంచలనం సృష్టించింది. ఇక కొన్నేళ్ల తరువాత సినిమాలకు దూరం అయిన విజయశాంతి రాజకీయాల్లో కొనసాగుతోంది. చాలా గ్యాప్ తరువాత ఆమె సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. కథ నచ్చితే తప్పకుండా సినిమాలు చేస్తాను అని చెప్పుకొచ్చిన విజయశాంతి.

Advertisement

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే విజయశాంతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. అప్పట్లో ఆమె.. చిరంజీవి, బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు చేసింది. అయితే నిప్పురవ్వ సినిమా తరువాత బాలకృష్ణతో సినిమాలు చేయలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయని, వారిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని చాలా రూమర్స్ వచ్చాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ రూమర్స్ కు విజయశాంతి చెక్ పెట్టింది. నిప్పురవ్వ సినిమా తరువాత బాలయ్యతో చేయకపోవడానికి కారణం.. కేవలం డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడమే అన్ని, వేరే కారణాలు ఏమి లేవని తెలిపింది. ” బాలకృష్ణతో నిప్పురవ్వ తరువాత నేను నటించలేదు. ఆయనతావు నటించకపోవడానికి వేరే కారణం అంటూ ఏమి లేదు. అప్పటికే నేను లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాను. ఆ సమయంలో ఆ సినిమాలతో బిజీగా ఉండడం వల్లనే నేను నటించలేకపోయాను. అప్పుడు నేను తీసుకున్నరెమ్యూనిరేషన్ కూడా ఎక్కువ. అలాంటి సినిమాలతో హీరో ఇమేజ్ వస్తుందనీ, నేను  యాక్షన్ సినిమాలు చేస్తాననీ.. అంతలా బిజీ అవుతానని నేనే అనుకోలేదు. అందువల్లనే ఇక వేరే హీరోలతో చేయలేకపోయాను” అంటూ చెప్పుకొచ్చింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×