E-Paper
Advertisement

రైల్వే ఫుడ్‌ పై AI కన్ను.. ఇక అపరిశుభ్రతకు నో ఛాన్స్!

రైల్వే ఫుడ్‌ పై AI కన్ను.. ఇక అపరిశుభ్రతకు నో ఛాన్స్!
Advertisement

Train Food Surveillance With AI System: భారతీయ రైల్వేలో ప్రయాణికులకు అందించే ఆహారం నాణ్యత, పరిశుభ్రతను మరింత మెరుగుపరచేందుకు ఐఆర్‌సిటిసి (IRCTC) కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. రైళ్లలో సరఫరా చేసే భోజనం తయారీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఆధారిత వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వంటగదులను 24 గంటలూ నిశితంగా గమనిస్తూ పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయిస్తోంది.

బేస్ కిచెన్లలో ఏఐ సీసీ కెమెరాలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైళ్లకు ఆహారం సరఫరా చేసే 800కు పైగా బేస్ కిచెన్‌లలో సుమారు 2,400 ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు ఢిల్లీలోని ఐఆర్‌సిటిసి ప్రధాన కార్యాలయంలో ఉన్న కేంద్ర పర్యవేక్షణ సెంటర్ కు అనుసంధానించబడ్డాయి. అక్కడి నుంచి అధికారులు వంటగదుల్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని పర్యవేక్షిస్తున్నారు.

అపరిశుభ్రతను ఇట్టే పసిగట్టేస్తున్న ఏఐ కెమెరాలు

Advertisement

ఈ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణంగా కంటికి కనిపించని చిన్నపాటి పరిశుభ్రత లోపాలను కూడా గుర్తిస్తుంది. ఆహార తయారీ సమయంలో హెయిర్‌ నెట్ ధరించకపోవడం, గ్లౌజులు ఉపయోగించకపోవడం, పరిశుభ్రత నిబంధనలు పాటించకపోవడం లాంటి అంశాలను ఏఐ వెంటనే గుర్తిస్తుంది. అంతేకాకుండా ఎలుకలు, ఈగలు, బొద్దింకలు లాంటి కీటకాలను ఇట్టే గుర్తించి అలర్ట్ చేస్తుంది.

9 రకాల పరిశుభ్రతా లోపాల గుర్తింపు

IRCTC స్మార్ట్ వ్యవస్థ మొత్తం తొమ్మిది రకాల పరిశుభ్రత లోపాలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వంటగదిలో నేల శుభ్రత, ఫుడ్ మెయింటెనెన్స్ విధానం, సిబ్బంది భద్రతా పరికరాల వినియోగం లాంటి అంశాలపై నిరంతరం నిఘా ఉంచుతుంది. 7 నుంచి 8 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న చిన్న కీటకాన్ని కూడా గుర్తించే స్థాయిలో ఈ కెమెరాలు పని చేస్తున్నాయి.

Advertisement

ఆహార నాణ్యతలో ఏదైనా లోపం గుర్తించిన వెంటనే సంబంధిత కిచెన్ మేనేజర్‌ కు ఆటోమేటిక్ అలర్ట్ పంపబడుతుంది. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే అది పైస్థాయి అధికారుల దృష్టికి వెళ్తుంది. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యానికి అవకాశం లేకుండా వ్యవస్థ పనిచేస్తోంది.  దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ఏఐ పర్యవేక్షణ వ్యవస్థను ఐఆర్‌సిటిసి క్రమంగా విస్తరిస్తోంది. మరిన్ని వంటగదులను ఈ నెట్‌ వర్క్‌ లోకి తీసుకురావడంతో పాటు  పరిశుభ్రత తనిఖీలను కూడా అమలు చేయాలని భావిస్తోంది. ప్రయాణికులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఐఆర్‌సిటిసి చేపట్టిన ఈ విధానం అందరి ప్రశంసలు పొందుతోంది.

Read Also: తత్కాల్ టికెట్ వెంటనే కన్ఫర్మ్ కావాలా? IRCTCలో సింపుల్ గా ఈ సెట్టింగ్స్ చేయండి!

Related News

కాచిగూడ స్టేషన్‌ కు మెగా మేకోవర్.. రూపు మారుతుంది.. కానీ, వారసత్వం చెక్కుచెదరదు!

12 స్టేషన్లు.. 320 కి.మీ స్పీడ్.. బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు!

టికెట్ ఉంటే స్టేషన్‌ లో ఎంతసేపు ఉండొచ్చు? చాలామందికి తెలియని రైల్వే రూల్!

స్పీడందుకుంటున్నాయ్ లగ్జరీ ప్రయాణాలు.. విజయవాడ ప్రయాణికులకు వందే భారత్ స్లీపర్ ధమాకా!

వీధులను ముంచెత్తిన బీరు వరద.. ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఘటన గురించి మీకు తెలుసా?

పక్షులతో యుద్ధం చేసి ఓడిపోయిన దేశం.. ఈ ఆసక్తికర చరిత్ర మీకు తెలుసా?

విమానాలతో పోటీపడి దూసుకెళ్తున్న రైళ్లు.. వీటి స్పీడ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

గోవా కంటే బెటర్.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న 5 కొత్త టూరిస్ట్ డెస్టినేషన్స్

Big Stories

Advertisement
×