E-Paper
Advertisement

గోవా కంటే బెటర్.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న 5 కొత్త టూరిస్ట్ డెస్టినేషన్స్

గోవా కంటే బెటర్.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న 5 కొత్త టూరిస్ట్ డెస్టినేషన్స్
Advertisement

భారతదేశంలో పర్యాటకుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. గతంలో ఎక్కువ మంది గోవా, జైపూర్, కేరళ వంటి ప్రసిద్ధ ప్రదేశాలకే వెళ్లేవారు. ఇప్పుడు మాత్రం కొత్త అనుభూతి కోసం తక్కువగా తెలిసిన ప్రాంతాలను కూడా ఎంచుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం, సహజ సౌందర్యం, స్థానిక సంస్కృతి వంటి ప్రత్యేకతలు ఈ ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.

మెరుగైన రహదారులు, విమాన సౌకర్యాలు, డిజిటల్ సేవలతో ట్రావెల్.. ఈ ప్రాంతాలకు చేరుకోవడం కూడా సులభమైంది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ అధ్యక్షుడు రవి గోసైన్ ప్రకారం.. ఈ ఐదు ప్రదేశాలు భారతీయ పర్యాటకుల్లో వేగంగా ఆదరణ పొందుతున్నాయి.

తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్

Advertisement

తూర్పు హిమాలయాల ఒడిలో ఉన్న తవాంగ్ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంతో పాటు బౌద్ధ సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రాచీన బౌద్ధ మఠాలు, అందమైన లోయలు, మంచుతో కప్పబడిన పర్వతాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. రద్దీకి దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

గోకర్ణ, కర్ణాటక

ఒకప్పుడు ప్రధానంగా పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన గోకర్ణ ఇప్పుడు ప్రముఖ బీచ్ గమ్యస్థానంగా మారుతోంది. గోవాతో పోలిస్తే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.
శుభ్రమైన బీచ్‌లు, సముద్ర తీర నడకలు, యోగా కేంద్రాలు, ఆరోగ్య రిట్రీట్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. స్థానిక వంటకాలు, సాంస్కృతిక వేడుకలు కూడా ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.

ధోలవీరా, గుజరాత్

Advertisement

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ధోలవీరా భారతదేశంలోని ప్రముఖ పురాతత్వ ప్రాంతాల్లో ఒకటి. ఇది కచ్ రణ్ ప్రాంతంలో ఉంది. పురాతన నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లను తెలుసుకోవాలనుకునే వారికి ఇది అద్భుతమైన ప్రదేశం. వైట్ రణ్, సమీపంలోని అందమైన అడవులు అక్కడి వన్యప్రాణులను కూడా సందర్శించవచ్చు.

మజులి, అస్సాం

ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపంగా మజులి ప్రసిద్ధి చెందింది. ఇది వైష్ణవ మఠాలు, సంప్రదాయ మాస్క్ తయారీ కళ, సాంస్కృతిక ఉత్సవాలకు పేరుగాంచింది. ఎకో టూరిజం, కమ్యూనిటీ టూరిజం ద్వారా స్థానిక జీవన విధానాన్ని దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది. ప్రతి సందర్శనలో కొత్త అనుభూతి కలుగుతుంది.

మండు, మధ్యప్రదేశ్

మండు చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన అందమైన పట్టణం. ఇక్కడి ఆఫ్ఘాన్ శైలిలో నిర్మించిన కోటలు, రాజభవనాలు, మసీదులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. చరిత్ర, ఫోటోగ్రఫీ, నిర్మాణ కళపై ఆసక్తి ఉన్నవారికి ఇది అద్భుతమైన గమ్యస్థానం.

Also Read: దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

ఈ ప్రాంతాలు ఎందుకు పాపులర్ అవుతున్నాయి?

ఈ ప్రాంతాల్లో రద్దీ తక్కువగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో సహజ అందాలను ఆస్వాదించవచ్చు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం పర్యాటకులకు కొత్త అనుభవాన్ని అందిస్తాయి.

మెరుగైన రవాణా సౌకర్యాలు, అభివృద్ధి చెందిన పర్యాటక మౌలిక వసతులు కూడా ఈ ప్రాంతాల ఆదరణను పెంచుతున్నాయి. కొత్త అనుభవాలను కోరుకునే వారికి ఈ ఐదు ప్రదేశాలు మంచి ఎంపికగా నిలుస్తాయి.

Related News

పక్షులతో యుద్ధం చేసి ఓడిపోయిన దేశం.. ఈ ఆసక్తికర చరిత్ర మీకు తెలుసా?

విమానాలతో పోటీపడి దూసుకెళ్తున్న రైళ్లు.. వీటి స్పీడ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

లోకో పైలెట్ నిద్రపోతే ఏం జరుగుతుంది? భారతీయ రైల్వేలో ఈ సీక్రెట్ సిస్టమ్ గురించి తెలుసా!

గంగమ్మ నిత్యం జలాభిషేకం చేసే అద్భుత శివలింగం.. ఈ దృశ్యం చూస్తే మైమరచిపోతారు!

సిరిసిల్ల జిల్లాలో మ‌రో పుణ్య‌క్షేత్రం..500 అడుగుల స‌ర్పం..ఏకంగా 5 త‌ల‌లు

ఆ దేశంలో గాజుతో రైలు నిర్మాణం చేసిన ఇంజినీర్లు.. దీనికి ప్రత్యేక కారణం మ్యాజిక్

ముస్లింలకు శుభవార్త.. ఒక్క ఉమ్రా వీసాతో ఎన్నిసార్లైనా మక్కా ఎంట్రీ.. కానీ చిన్న కండీషన్

Big Stories

Advertisement
×