E-Paper
Advertisement

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!
Advertisement

ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశాల్లో ఒకటి బ్రూనై. అక్కడ జనాభా 5 లక్షల లోపే ఉంటుంది. 75 శాతానికి పైగా అడవులే ఉంటాయి. ఈ దేశంలోని పెద్ద నగరాల్లోనూ హడావిడి, ట్రాఫిక్ రద్దీ, ఉరుకుల పరుగుల జీవితం, ఒత్తిడితో కూడిన జీవనశైలి ఇక్కడ పెద్దగా కనిపించవు. అందుకే బ్రూనైకి వెళ్లిన వారు అక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు.

అందమైన ప్రశాంత దేశం

సాధారణంగా పర్యాటకులు ఏ దేశానికైనా వెళ్లినప్పుడు చూడాల్సిన ప్రదేశాలు, చేయాల్సిన పనులు, సందర్శించాల్సిన పాపులర్ ప్లేసేస్ అంటూ లిస్టు చాలా పెద్దదిగానే ఉంటుంది. కానీ, బ్రూనై విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ సందర్శకులను ఆకట్టుకునేది పెద్ద పెద్ద సందర్శన కేంద్రాలు, రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశాలు కాదు. ప్రశాంతమైన జీవన విధానం, పరిశుభ్రమైన వాతావరణం, క్రమశిక్షణతో కూడిన సమాజం. అవే ఈ దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి కూడా.

బోర్నియో ద్వీపంలోని చిన్న దేశం

Advertisement

బోర్నియో ద్వీపంలో ఉన్న ఈ చిన్న దేశం సహజ సౌందర్యంతో నిండి ఉంటుంది. పచ్చని అడవులు, పరిశుభ్రమైన రహదారులు, అందమైన మసీదులు, నిశ్శబ్దంగా కనిపించే పట్టణాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. నగరాల్లో కూడా పెద్దగా రద్దీ కనిపించదు. ప్రజలు తమ పనులను ప్రశాంతంగా చేసుకుంటూ జీవిస్తుంటారు.

బ్రూనైలో జీవనశైలి చాలా నెమ్మదిగా, ఒత్తిడి లేకుండా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు జీవితాన్ని ఆస్వాదించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అవసరమైనంత పని చేసి, మిగిలిన సమయాన్ని కుటుంబంతో, స్నేహితులతో గడపడం సాధారణంగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ తొందరపాటు, పోటీ భావన తక్కువగా కనిపిస్తుంది.

పుష్కలంగా చమురు, సహజ వనరులు

Advertisement

ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చమురు, సహజ వాయువు వనరులపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం పౌరులకు అనేక సంక్షేమ సౌకర్యాలు అందిస్తుంది. బ్రూనై చమురు సంపద కలిగిన దేశం కావడంతో ప్రభుత్వం ఇంధనంపై భారీ సబ్సిడీలు ఇస్తుంది. అందుకే అక్కడ పెట్రోల్ ధరలు ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరల్లో ఒకటిగా ఉంటాయి. సాధారణంగా ఒక లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.30–35 మధ్య ఉంటుంది. అదే సమయంలో 1.5 లీటర్ల మినరల్ వాటర్ బాటిల్ సాధారణంగా రూ. 45 నుంచి రూ. 75 మధ్య ఉంటుంది. కొన్ని బ్రాండ్లకు ధర ఇంకా ఎక్కువగా ఉంటుంది.

విద్య, వైద్యం ఉచితం   

బ్రూనైలో విద్యా వ్యవస్థకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యం ఇస్తుంది. దేశ పౌరులకు పాఠశాల విద్య నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అనేక సౌకర్యాలు ఉచితంగా, కొన్నింట భారీ సబ్సిడీలతో అందిస్తారు. కొంతమంది విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ లు, నెలవారీ సపోర్టు కూడా అందిస్తుంది. అక్కడ అక్షరాస్యత శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్, మలయ్ భాషల్లో విద్య అందుబాటులో ఉంటుంది.  బ్రూనైలో ప్రభుత్వ వైద్య సేవలు మంచి స్థాయిలో ఉంటాయి. స్థానిక పౌరులకు చికిత్స దాదాపు ఉచితం. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం చిన్న రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఇక బ్రూనైలో ప్రజా రవాణా వ్యవస్థ పెద్దగా అభివృద్ధి చెందలేదు. బస్సులు ఉన్నప్పటికీ వాటి సంఖ్య తక్కువ. రైలు వ్యవస్థ అసలు లేదు. అందుకే ఎక్కువ మంది ప్రజలు వ్యక్తిగత కార్లనే ఉపయోగిస్తారు. పెట్రోల్ చాలా చౌకగా ఉండటంతో కారు వాడటం అక్కడ సాధారణ విషయంగా మారింది.

బ్రూనైని కేవలం ఒక పర్యాటక దేశంగా కాకుండా, ప్రశాంత జీవనానికి ప్రతీకగా కూడా చాలా మంది భావిస్తారు. హడావిడి ప్రపంచం మధ్యలో నిశ్శబ్దంగా నిలిచిన ఈ చిన్న దేశం, అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది.

Read Also: టైంపాస్ కోసం ఏకంగా విమానాన్ని తయారు చేసిన యూట్యూబర్, నిజంగా వండర్ భయ్యా!

Related News

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

జూలైలో పర్యటించడానికి 6 అందమైన ప్రదేశాలు.. చల్లని, స్వచ్ఛమైన గాలితో మైమరిపించే వాతావరణం

Big Stories

Advertisement
×