E-Paper
Advertisement

చిమ్మచీకట్లోనూ గబ్బిలాలకు దారి ఎలా కనిపిస్తుంది? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

చిమ్మచీకట్లోనూ గబ్బిలాలకు దారి ఎలా కనిపిస్తుంది? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Advertisement

Bat Facts: రాత్రి వేళల్లో ఆకాశంలో గబ్బిలాలు వేగంగా ఎగురుతూ కనిపిస్తుంటాయి. చుట్టూ చీకటి ఉన్నా చెట్లను, గోడలను ఢీకొనకుండా అవి ఎలా ప్రయాణిస్తాయి? చిన్న చిన్న కీటకాలను సైతం ఎలా గుర్తించి పట్టుకుంటాయి? అనే డౌట్ వస్తుంది. కానీ, గబ్బిలాలకు రాత్రిపూట కూడా దారి చూపించే అద్భుతమైన సహజ వ్యవస్థ ఉంది. అదే ఎకోలొకేషన్ (Echolocation). మనుషులు వినలేని శబ్ద తరంగాల సాయంతో అవి తమ చుట్టూ ఉన్న పరిసరాలను గుర్తిస్తాయి. ఎలాగో ఇప్పుడు చూద్దాం..

శబ్దాలే గబ్బిలాలకు కళ్లు!

గబ్బిలాలు రాత్రిపూట ప్రయాణించడానికి ప్రధానంగా ఎకోలొకేషన్ పద్ధతిని ఉపయోగిస్తాయి. ఇందులో భాగంగా అవి నోటి ద్వారా లేదంటే ముక్కు ద్వారా శబ్దాలను విడుదల చేస్తాయి. వీటినే అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటారు. సాధారణంగా ఈ శబ్దాలు మనుషుల చెవులకు వినిపించవు. ఈ శబ్ద తరంగాలు గాలిలో ప్రయాణిస్తూ ఎదురుగా ఉన్న వస్తువులను తాకుతాయి. చెట్లు, గోడలు, భవనాలు, చిన్న చిన్న కీటకాలను తాకిన తర్వాత తిరిగి గబ్బిలాల వైపు చేరుకుంటాయి. ఈ విధానాన్ని ప్రతిధ్వని (Echo) అంటారు.

ప్రతిధ్వనితో దూరాన్ని ఎలా గుర్తిస్తాయి?

Advertisement

గబ్బిలాలు విడుదల చేసిన శబ్దం తిరిగి రావడానికి ఎంత సమయం పట్టిందో వాటి మెదడు వేగంగా విశ్లేషిస్తుంది. దీని ఆధారంగా ఎదురుగా ఉన్న వస్తువు ఎంత దూరంలో ఉందో గుర్తిస్తాయి. అంతేకాదు, తిరిగి వచ్చిన శబ్దంలోని మార్పులను బట్టి వస్తువు ఆకారం, పరిమాణం, దిశ లాంటి వివరాలను కూడా అంచనా వేస్తాయి. ఒక కీటకం కదులుతున్నప్పుడు దాని నుంచి వచ్చే ప్రతిధ్వనిలో మార్పులను గుర్తించి, అది ఎటువైపు వెళ్తుందో కూడా తెలుసుకుంటాయి. క్షణాల్లో సమాచారాన్ని అనలైజ్ చేసుకుంటూ ఎలాంటి అడ్డంకులు లేకుండా చీకట్లో ప్రయాణిస్తాయి.

గబ్బిలాలకు కళ్లు కనిపించవా?

గబ్బిలాలకు కళ్లు కనిపించవనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ, ఇది నిజం కాదు. గబ్బిలాలకు కూడా కళ్లు ఉంటాయి. అయితే, రాత్రిపూట ఎగరడం, ఆహారం వెతుక్కోవడం లాంటి పనుల కోసం చాలా గబ్బిలాలు ఎకోలొకేషన్‌ను ఉపయోగిస్తాయి.

ప్రకృతిలో అద్భుతమైన వేటగాళ్లు!

Advertisement

గబ్బిలాలు కేవలం దారి తెలుసుకోవడానికే ఈ ప్రత్యేక వ్యవస్థను ఉపయోగించవు. ఆహారాన్ని గుర్తించి వేటాడటంలోనూ    ఉపయోగించుకుంటాయి. ముఖ్యంగా దోమలు, చిమ్మటలు, ఇతర చిన్న కీటకాలను చీకట్లోనే గుర్తించి పట్టుకుంటాయి. కొన్ని గబ్బిలాలు పండ్లు, పూల మకరందం కూడా ఆహారంగా తీసుకుంటాయి. ఇవి మొక్కల పరాగసంపర్కానికి, విత్తనాల వ్యాప్తికి సాయపడుతాయి. మనుషులు కళ్లతో చూసి పరిసరాలను గుర్తిస్తే, గబ్బిలాలు శబ్దాల ప్రతిధ్వనితో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాయి.

Read Also: క్యూబ్ ఆకారంలో మల విసర్జన.. ప్రపంచంలో ఈ ఒక్క జంతువుకే సాధ్యం!

Tags

Related News

కొండల కింద 5.3 కి.మీ టన్నెల్.. హిమాలయాల్లో ఇండియన్ రైల్వే అద్భుతం!

Railway Alert: ఫిబ్రవరి 2027 వరకు 20 రైళ్లు రద్దు.. అసలేం జరిగిందంటే?

తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. జల్నా నుంచి మరో 4 ప్రత్యేక రైళ్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. బెంగళూరు–అనంతపురం రైళ్ల దారి మళ్లింపు!

విమానాలు ల్యాండ్ అవుతుండగా ‘గో అరౌండ్’ ఆర్డర్స్.. ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది?

వందే భారత్ రైలులో షాకింగ్ ఘటన.. వడలో బోల్ట్ ఏంటి భయ్యా?

బ్రహ్మంగారి గుట్టకు బ్రహ్మాండమైన ఘాట్ రోడ్.. నల్లగొండలో సరికొత్త టూరిజం డెస్టినేషన్!

Big Stories

Advertisement
×