E-Paper
Advertisement

దేశాన్ని వణికించిన భయంకరమైన కరువులు.. కోట్లాది మందిని బలిగొన్న ఆకలి చావులు!

దేశాన్ని వణికించిన భయంకరమైన కరువులు.. కోట్లాది మందిని బలిగొన్న ఆకలి చావులు!
Advertisement

India Drought Risk: దేశ చరిత్రలో యుద్ధాలు, ప్రకృతి విపత్తులే కాదు.. కరువులు కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వర్షాలు లేక పంటలు పండకపోవడం, ఆహార కొరత, పాలకుల నిర్లక్ష్యం కారణంగా లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ముఖ్యంగా బ్రిటిష్ పాలనలో సంభవించిన కొన్ని కరువులు దేశ జనాభాను తీవ్రంగా ప్రభావితం చేశాయి. తినడానికి తిండి లేక ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయ్యాయి. 2027లో ఎల్‌నినో ముప్పు హెచ్చరికల నేపథ్యంలో.. దేశ చరిత్రలో అత్యంత భయంకరమైన కరువుల గురించి తెలుసుకుందాం.

లక్షలాది మందిని బలిగొన్న భారీ కరువులు

⦿ దక్కన్ కరువు (1630–1632): గుజరాత్, దక్కన్ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాభావం కారణంగా ఈ కరువు ఏర్పడింది. పంటలు పూర్తిగా దెబ్బతినడంతో ఆహారం దొరకక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల సంఖ్య 74 లక్షలకు పైగా ఉంది.

Advertisement

⦿ బెంగాల్ మహా కరువు (1769–1770): ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో సంభవించిన అతిపెద్ద విషాదాల్లో ఇది ఒకటి. బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో ఆకలి చావులు తీవ్రంగా పెరిగాయి. అధిక పన్నులు, వ్యవసాయ విధానాలు, వర్షాభావం పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఈ కరువులో సుమారు కోటి మంది మరణించినట్లు అంచనా.

⦿ చాలీసా కరువు (1783–1784): ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, పంజాబ్, అవధ్ ప్రాంతాలు ఈ కరువు ప్రభావానికి గురయ్యాయి. ఆహారం దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

⦿ దోజి బారా కరువు (1791–1792): దేశ చరిత్రలో అత్యంత భయంకరమైన కరువుల్లో ఇదీ ఒకటి. హైదరాబాద్, మద్రాస్ ప్రెసిడెన్సీ, గుజరాత్ ప్రాంతాల్లో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఆకలితో చనిపోయిన వారి సంఖ్య భారీగా పెరిగింది. శవాలను పూడ్చడానికి కూడా మనుషులు లేకపోవడంతో ఎక్కడ చూసినా పుర్రెలు, ఎముకలు కనిపించేవని చెబుతారు. అందుకే దీనిని ‘పుర్రెల కరువు’ (Skull Famine) అని పిలుస్తారు.

దక్షిణ భారతాన్ని కుదిపేసిన మహా మద్రాస్ కరువు

1876–1878 వరకు అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీతో పాటు మైసూర్, హైదరాబాద్, బొంబాయి ప్రాంతాలను ఈ కరువు అతలాకుతలం చేసింది. వర్షాలు లేక పంటలు పండక కోట్లాది మంది ఆహారం కోసం అల్లాడారు. బ్రిటిష్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, ఈ కరువులో సుమారు 55 లక్షల నుంచి కోటి మంది వరకు మరణించినట్లు సమాచారం.

1896–1900 కరువులు: మధ్య, పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు వరుస కరువులతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. సుమారు 60 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెక్కలు చెప్తున్నాయి.

1943 బెంగాల్ కరువు.. మానవ నిర్మిత విషాదం!

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సంభవించిన బెంగాల్ కరువు భారత చరిత్రలో మరో చీకటి అధ్యాయం. ఆహార సరఫరా సమస్యలు, యుద్ధకాల విధానాలు, పాలనా వైఫల్యాలు పరిస్థితిని తీవ్రతరం చేశాయి. ఈ దుర్భర పరిస్థితుల్లో సుమారు 30 లక్షల మంది మరణించారు.

స్వతంత్రం తర్వాత మారిన పరిస్థితులు

1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బీహార్ (1966–67), మహారాష్ట్ర (1972) వంటి ప్రాంతాలు తీవ్ర కరువులను ఎదుర్కొన్నాయి. అయితే, హరిత విప్లవం, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS), మెరుగైన రవాణా సౌకర్యాలు, ఆహార ధాన్యాల నిల్వల కారణంగా పరిస్థితులు క్రమంగా మెరుగుపడ్డాయి. ఇప్పుడు మళ్లీ ఎల్‌నినో ప్రభావంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: అండమాన్ కాలాపాని జైలును తలపించే మరో జైలు.. తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?

Tags

Related News

చిమ్మచీకట్లోనూ గబ్బిలాలకు దారి ఎలా కనిపిస్తుంది? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

కొండల కింద 5.3 కి.మీ టన్నెల్.. హిమాలయాల్లో ఇండియన్ రైల్వే అద్భుతం!

Railway Alert: ఫిబ్రవరి 2027 వరకు 20 రైళ్లు రద్దు.. అసలేం జరిగిందంటే?

తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. జల్నా నుంచి మరో 4 ప్రత్యేక రైళ్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. బెంగళూరు–అనంతపురం రైళ్ల దారి మళ్లింపు!

విమానాలు ల్యాండ్ అవుతుండగా ‘గో అరౌండ్’ ఆర్డర్స్.. ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది?

వందే భారత్ రైలులో షాకింగ్ ఘటన.. వడలో బోల్ట్ ఏంటి భయ్యా?

Big Stories

Advertisement
×