Train Cancellation 2027: చలికాలంలో రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి ఇండియన్ రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లను రద్దు చేసింది. ముఖ్యంగా డిసెంబర్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 వరకు ఈ రద్దు అమల్లోకి ఉండనుంది. రైల్వేతాజా నిర్ణయంతో మొత్తం 20 రైళ్లు పూర్తిగా రద్దు కానుండగా, మరో 26 రైళ్లు వారంలో కొన్ని రోజులు మాత్రమే నడవనున్నాయి. మార్చి 2027 వరకు కూడా కొన్ని రైళ్ల రద్దు కొనసాగనుంది.
చలికాలంలో ఉత్తర, తూర్పు భారతంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతుంది. ముఖ్యంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున రైల్వే ట్రాక్‌ల మీద విజుబులిటీ తగ్గుతుంది. దీంతో లోకో పైలట్లు సిగ్నళ్లను గుర్తించడం, రైళ్లను నడపడం కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రమాదాల ముప్పును తగ్గించేందుకు రైల్వే అధికారులు ప్రతి సంవత్సరం వింటర్ టైమ్ టేబుల్‌లో మార్పులు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఈసారి కూడా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి సర్వీసులను తగ్గించారు.
1.ప్రయాగ్‌రాజ్ – ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్
2.ఝాన్సీ – కోల్‌కతా ఎక్స్‌ప్రెస్
3.సంత్రాగాచి – ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్
4.మాల్దా టౌన్ – న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్
5.బరౌని – అంబాలా హరిహర్ ఎక్స్‌ప్రెస్
6.పూర్నియా కోర్ట్ – అమృత్‌సర్ జనసేవ ఎక్స్‌ప్రెస్
7.దిబ్రూగఢ్ – చండీగఢ్ ఎక్స్‌ప్రెస్
8.కామాఖ్య – గయా ఎక్స్‌ప్రెస్
9.కామాఖ్య – ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్
10.హౌరా – డెహ్రాడూన్ ఉపాసన ఎక్స్ ప్రెస్
ఈ రైళ్లలో కొన్ని డిసెంబర్ 2026 నుంచి ఫిబ్రవరి చివరి వరకు రద్దు కానుండగా, మరికొన్ని మార్చి 2027 ప్రారంభం వరకు అందుబాటులో ఉండవు.
శీతాకాలంలో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకునే ముందు రైలు సర్వీసు అందుబాటులో ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. ఇందుకోసం ప్రయాణికులు భారతీయ అధికారిక వెబ్ సైట్ తో పాటు RailOne మొబైల్ యాప్ లో లేటెస్ట్ అప్ డేట్స్ తెలుసుకోవచ్చు. లేదంటే రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139ను సంప్రదించాల్సి ఉంటుంది. పూర్తిగా రద్దయిన రైళ్లే కాకుండా, వారంలో కొన్ని రోజులు మాత్రమే నడిచే రైళ్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ తేదీ, రైలు నంబర్, సర్వీసు స్టేటస్ ముందుగానే చెక్ చేసుకుంటే చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవచ్చు.
Read Also: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. జల్నా నుంచి మరో 4 ప్రత్యేక రైళ్లు!