BigTV English

Chopta: హిమాలయాల్లో దాగిన స్వర్గదామం..! ఆ టైంలో వెళ్తే వచ్చే కిక్కే వేరు..

Chopta: హిమాలయాల్లో దాగిన స్వర్గదామం..! ఆ టైంలో వెళ్తే వచ్చే కిక్కే వేరు..

Chopta: ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో దాగిన ఓ చిన్న స్వర్గం చోప్తా. దీన్ని ‘ఇండియాలోని మినీ స్విట్జర్లాండ్’ అని ఎందుకంటే, ఇక్కడి పచ్చటి పొలాలు, మంచుతో కప్పిన కొండలు, చల్లటి వాతావరణం చూస్తే స్విట్జర్లాండ్ గుర్తొస్తుంది. త్రిశూల్, నందాదేవి లాంటి హిమాలయ కొండల అందమైన దృశ్యాలు, సముద్ర మట్టానికి 2,680 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ చోటు ప్రకృతి ప్రేమికులకు, ట్రెక్కింగ్ ఇష్టపడేవాళ్లకు ఓ అద్భుతమైన గమ్యం. మస్సూరీ, నైనీతాల్ లాంటి రద్దీ ప్లేసులకు దూరంగా, చోప్తా తన శాంతమైన వైబ్‌తో, సహజ అందాలతో జనాల్ని ఆకర్షిస్తుంది.


ఎందుకు వెళ్లాలి?
చోప్తా జస్ట్ ఓ ఊరు కాదు, అది ప్రకృతితో కనెక్ట్ అయ్యే ఓ అద్భుతమైన అనుభవం. ఇక్కడి పచ్చని మైదానాలు, చల్లటి గాలి, రాత్రిళ్లు నక్షత్రాలతో నిండిన ఆకాశం మనసును ఆనందంతో నింపేస్తాయి. చోప్తా నుంచి తుంగనాథ్ ఆలయానికి, చంద్రశిలా కొండకు ట్రెక్కింగ్ చేయడం ఇక్కడి స్పెషల్ హైలైట్. తుంగనాథ్ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం. దీనికి చేరడానికి 3.5 కిలోమీటర్లు ట్రెక్ చేయాలి, దారిలో హిమాలయ దృశ్యాలు, అరుదైన పక్షులు మీకు కంపెనీ ఇస్తాయి. చంద్రశిలా కొండ మీద నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటం జీవితంలో మర్చిపోలేని మూమెంట్.

ఇక్కడి అందం కేవలం కొండలు, మైదానాలతో ఆగదు. హిమాలయన్ మోనాల్ లాంటి అరుదైన పక్షులను చూడటానికి ఇది బెస్ట్ స్పాట్. రాత్రి టెంట్‌లో ఉంటూ నక్షత్రాలు చూడటం మరో సుఖం. ఇక్కడ వాణిజ్యీకరణ తక్కువ కాబట్టి, చోప్తా తన నేచురల్ బ్యూటీని ఇప్పటికీ కాపాడుకుంది. పెద్ద హోటళ్లు, రిసార్ట్‌ల హడావిడి లేదు. చిన్న చిన్న గెస్ట్ హౌస్‌లు, హోమ్‌స్టేలు, టెంట్ క్యాంపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి.


మస్సూరీ, నైనీతాల్ లాంటి ప్లేసులు దేశమంతా ఫేమస్ అయిపోయాయి, కానీ చోప్తా ఇంకా చాలా మంది రాడార్‌లోకి రాలేదు. ఎందుకంటే, ఇక్కడ వాణిజ్యీకరణ తక్కువ, పెద్ద టూరిజం కంపెనీల ప్రమోషన్ లేదు. అంతేకాదు, ఇక్కడకు రీచ్ అవ్వడం కాస్త ఛాలెంజ్. ఈ ఏరియా ఎక్కువగా ట్రెక్కింగ్ లవర్స్, అడ్వెంచర్ సీకర్స్, నేచర్ లవర్స్ మధ్య పాపులర్. కానీ, ఈ నిశ్శబ్దం, శాంతి చోప్తాను మరింత స్పెషల్‌గా చేస్తాయి.

ఎప్పుడు వెళ్లాలి?
చోప్తాకు ఏప్రిల్ నుంచి జూన్, సెప్టెంబర్ నుంచి నవంబర్ బెస్ట్ టైమ్. ఈ టైంలో వాతావరణం కూల్‌గా, ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. వింటర్‌లో (డిసెంబర్-ఫిబ్రవరి) చోప్తా మంచుతో సూపర్ అందంగా కనిపిస్తుంది, కానీ ట్రెక్కింగ్ కాస్త టఫ్ అవుతుంది.

ఎలా వెళ్లాలి?
చోప్తాకు రిషికేశ్ నుంచి 170 కిలోమీటర్ల రోడ్ ట్రిప్ చేయాలి. రిషికేశ్ నుంచి ఉఖిమఠ్ వరకు బస్సులు ఉన్నాయి. ఉఖిమఠ్ నుంచి చోప్తాకు టాక్సీ లేదా షేర్ జీప్‌లలో వెళ్లొచ్చు. రైల్లో వెళ్లాలనుకుంటే, హరిద్వార్ రైల్వే స్టేషన్ (200 కిమీ) దగ్గరలో ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చోప్తా చేరొచ్చు. సొంత వెహికల్‌లో వెళ్తే, రిషికేశ్ నుంచి కుండ్, ఉఖిమఠ్ మీదుగా వెళ్లే రోడ్ అద్భుతమైన దృశ్యాలతో మీ ట్రిప్‌ను సూపర్ ఫన్‌గా మారుస్తుంది.

Related News

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

Big Stories

×