Vennela Kishore: టాలీవుడ్ లో కమెడియన్ గా, వెన్నెల కిషోర్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తనదైన కామెడీ టైమింగ్ తో ప్రతి సినిమాలోనూ నవ్వులు పంచుతూ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆయన నటించిన సినిమా సింగిల్. శ్రీవిష్ణు హీరోగా ఈ చిత్రంలో ఫుల్ లెన్త్ పాత్రలో అరవింద్ అనే క్యారెక్టర్ లో కనిపించి నవ్వులు పూజించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెన్నెల కిషోర్ ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఓ పాస్ పోర్ట్ కోసం మెగాస్టార్ మూవీ వదులుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. అసలు ఆ మూవీ ఏంటి? ఆయన ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది. ఆ పాస్ పోర్ట్ కధ చూసేద్దాం..
ఆఫ్ట్రాల్ పాస్ పోర్ట్ కోసం ఆ రెండు మూవీ వదులుకున్న ..
ఈరోజుల్లో మన చేతిలో ఉన్న ఫోన్ లోనే రీల్స్ ఓపెన్ చేస్తే ఎన్నో కామెడీ వీడియోలు కనిపిస్తుంటాయి అలాంటి కంటెంట్ మించి ధియేటర్ కి వెళ్లి ఆడియన్స్ ఎంజాయ్ చేయగలిగే అంత కామెడీని ఇవ్వగలిగే మూవీస్ థియేటర్లోకి రావాలి అలాంటి మూవీ లో ఫుల్ లెన్త్ క్యారెక్టర్లో కామెడీని పంచగలిగే కమెడియన్స్ కొందరే వుంటారు.అలంటి వారిలో ఒకరు కమిడియన్ వెన్నెల కిషోర్. మీడియాకి, ఇంటర్వ్యూలకి దూరంగా ఉండే వెన్నెల కిషోర్ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన తన లైఫ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నో విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అలాగే మెగాస్టార్ మూవీ నీ వదులుకోవడానికి కారణాన్ని తెలిపారు. వెన్నెల కిషోర్ మాట్లాడుతూ… ‘నేను డిగ్రీ అయిపోయిన తర్వాత అమెరికాలో స్టడీస్ కంటిన్యూ చేసే టైంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో వచ్చే మూవీకి రైటర్స్ కావాలి అని యాడ్ చూసి, నా ఫ్రెండ్ తో కలిసి అక్కడికి వెళ్లాను. ఆయనతో కొంతకాలం ట్రావెల్ చేశాను. కాకపోతే నేను అమెరికా వదిలి రాను అని చెప్పాను. ఆయన అక్కడ వున్నా టైం లో కొన్ని సినిమాలు నా చేత రైటర్ గా పాయింట్స్ రాయించుకున్నారు. ఆ తర్వాత వారు తిరిగి ఇండియా వచ్చేశారు నేను అమెరికాలోనే ఉన్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకు వెన్నెల సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా బాగా సక్సెస్ అయ్యింది. అప్పుడు కూడా నేను ఇండియా రాలేదు అమెరికాలోనే ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత 50 డేస్ ఫంక్షన్ కి నన్ను రమ్మని మూవీ టీం పిలవడంతో నేను ఇండియాకి వచ్చాను అప్పుడే ఒక ఫోన్ వచ్చింది. ఓ పెద్ద డైరెక్టర్ తో మూవీ ఉంది, పెద్ద హీరో యాక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి ఆఫీస్ కి రండి అని ఫోన్ చేశారు. నేను వెళ్లాను అసిస్టెంట్ డైరెక్టర్ లాంటి ఒక పర్సన్ వచ్చి నాకు ఒక డ్రెస్ ఇచ్చి మీరు ఇది వేసుకోండి చిరంజీవి పక్కన ఫుల్ లెన్త్ క్యారెక్టర్ అని చెప్పారు. నేను ఓకే అనుకొని మెగాస్టార్ చిరంజీవి పక్కన అంటే ఎంతో అదృష్టం ఉండాలి అని అనుకున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నన్ను మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి వెళ్లిపోయారు. నేను మురుగుదాస్ గారు ఎక్కడున్నారు అని అడగగానే ఆయనే కదా మురుగదాస్ ఇప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసింది ఆయనే అని అన్నారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అనుకున్నా నేను అని అప్పుడు దాకా నాకు తెలియదు. ఇక మీరు మూడు నెలలు ఇండియాలోనే ఉండాల్సి వస్తుందని చెప్పారు నేను సరే అనుకున్నాను కానీ ప్రొడక్షన్ వాళ్ళు నా పాస్ పోర్ట్ అడిగారు. అసలు పాస్ పోర్ట్ ఎలా ఇస్తాను నేను ఇవ్వను అని చెప్పాను వారు ఇవ్వాలి మీరు మళ్లీ తిరిగి వెళ్లేటప్పుడు మేము ఇచ్చేస్తామన్నారు. కానీ పాస్పోర్ట్ అడిగారని నేను మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా వద్దు అనుకోని బయటికి వచ్చేసాను. అంటే అప్పుడు నేను ఇండియా రావాలని ఉద్దేశం నాకు లేదు పాస్ పోర్ట్ లేకపోతే నాకు అమెరికాలో ఉండడానికి ఆస్కారం ఉండదు. సో నేను పాస్ పోర్ట్ ఇంపార్టెంట్ అనుకొని తిరిగి అమెరికా వెళ్ళిపోయాను. అలానే నేను పవన్ కళ్యాణ్ సినిమా అన్నవరంలో కూడా ఒక క్యారెక్టర్ వస్తే అది కూడా నేను పాస్ పోర్ట్ అడిగారన్న కారణంతోనే వద్దనుకొని అమెరికా వెళ్ళిపోయాను. ఇలా పాస్ పోర్ట్ వల్ల రెండు మెగా హీరోల సినిమాలు మిస్ అయ్యాను అని వెన్నెల కిషోర్ తెలిపారు.
ఆయన వుంటే సినిమా హిట్ ..
ఇక తాజాగా వెన్నెల కిషోర్ నటించిన సింగిల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఈ మూవీలో వెన్నెల కిషోర్ కనిపిస్తారు. శ్రీ విష్ణు స్పాంటేనియస్ గా డైలాగ్స్ చెప్పడం ఆయనకు కౌంటర్ వేసే అరవింద్ క్యారెక్టర్ లో వెన్నెల కిషోర్ కామెడీ పండించారు.ఆయన వుంటే సినిమా హిట్ అని టాక్. ఇక 2005లో వచ్చిన వెన్నెల సినిమా, నుండి ప్రతి సినిమాలోను ఆయన కామెడీ సూపర్ గా ఉంటుంది. బిందాస్, దూకుడు, లవ్లీ, జులాయి, నాన్నకు ప్రేమతో, సర్కార్ వారి పాట వంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించి ఆయనకు పేరు తీసుకొచ్చాయి.