Luxury Trains: ప్రయాణం, బడ్జెట్‌కు అనుకూలంగా ఉండే జర్నీ ట్రైన్ జర్నీ. ట్రావెలింగ్ ఇష్టపడే వ్యక్తులు విలాసవంతమైన జీవితం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రయాణంలో కూడా రాజ వైభవాన్ని ఆస్వాదించాలనుకునే వారిలో మీరు కూడా ఒకరైతే.. భారతదేశంలోని ఈ విలాసవంతమైన రైళ్లు మీ కలను నెరవేర్చగలవు. దీని కోసం మీరు చాలానే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ అనుభవాన్ని మీరు మీ జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఇంతకీ ఆ రైళ్లలో ఎక్కడెక్కడికి ప్రయాణం చేయొచ్చు. టికెట్ ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డెక్కన్ ఒడిస్సీ:
ఈ ట్రైన్‌లో చాలా ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. దీని లోపల డీలక్స్ క్యాబిన్లు , సూట్ క్యాబిన్లు , 5 స్టార్ హోటల్ లాగా తయారు చేసారు. రైలులో ప్రయాణీకుల కోసం లాంజ్, కాన్ఫరెన్స్ కాల్, ఆన్‌బోర్డ్ స్పా , వివిధ రకాల వంటకాలు ఏర్పాటు చేస్తారు. ఈ రైలు ముంబై నుండి రత్నగిరి, సింధుదుర్గ్, గోవా, బెల్గాం, కొల్హాపూర్, పూణే, ఔరంగాబాద్, అజంతా-ఎల్లోరాలకు వెళ్లి ముంబైకి తిరిగి వస్తుంది. డెక్కన్ ఒడిస్సీ రైలు ఛార్జీ ₹3,71,900. ఈ రైలు ప్రయాణం మీకు రాజులు, మహారాజులను గుర్తు చేస్తుంది.
మహారాజా ఎక్స్‌ప్రెస్:
మహారాజా ఎక్స్‌ప్రెస్ అనేది IRCTC ప్రారంభించిన లగ్జరీ టైన్. ఇది జునియా సూట్ క్యాబిన్లు, డీలక్స్ క్యాబిన్లు, సూట్లు, ప్రెసిడెన్షియల్ సూట్లు వంటి సౌకర్యాలతో కూడిన 23 బోగీల పొడవైన రైలు. ఈ ట్రైన్‌లో ప్రయాణీకుల కోసం రంగ్ మహల్, మయూర్ మహల్ అనే రెండు విలాసవంతమైన రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఈ ట్రైన్‌లో రాజుల తినే మాదిరిగానే ఆహారం, డ్రింక్స్ ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ విలాసవంతమైన సౌకర్యాలను ఆస్వాదించడానికి.. మీరు 7 రోజుల్లో దాదాపు రూ. 21 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రైలు ముంబై నుండి ప్రారంభమై ఉత్తర భారతదేశంలోని అనేక ప్రధాన నగరాలు కవర్ చేస్తుంది.
రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్:
రాయల్ రాజస్థాన్ అనేది రాజస్థాన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ,ఇండియన్ రైల్వేల జాయింట్ వెంచర్. ఇది భారతదేశంలోని అత్యంత ఖరీదైన ,విలాసవంతమైన రైళ్లలో ఒకటి. ఈ రైలులో రాజస్థాన్ సంప్రదాయం చూడొచ్చు. రాజస్థాన్ ఆన్ వీల్స్ 7 రోజుల్లో రాజస్థాన్ లోని అన్ని ప్రధాన చారిత్రక నగరాలతో పాటు ఆగ్రా, ఖజురహో , వారణాసి వంటి ప్రదేశాలను కలవర్ చేస్తుంది. ఈ రైలులో ప్రయాణించడానికి మీరు 7 రోజుల్లో దాదాపు 7 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రాయల్ ఓరియంట్ ట్రైన్:
రాజస్థాన్ , గుజరాత్‌లోని ప్రత్యేక ప్రాంతాలను కవర్ చేసే ఈ రైలులో రాజభవనాల లాంటి సౌకర్యవంతమైన క్యాబిన్‌లు, వాటర్‌క్రాఫ్ట్ హోల్, లైబ్రరీ , రెస్టారెంట్ ఉన్నాయి. ఈ రైలును 5 స్టార్ నక్షత్రాల హోటల్ లాగా నిర్మించారు. ఈ రైలు ఢిల్లీ, చిత్తోర్‌గఢ్, ఉదయపూర్, జునాగఢ్, భిల్వారా, సర్ఖేజ్, అహ్మదాబాద్, జైపూర్ మీదుగా తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ లగ్జరీ రైలు ఛార్జీ దాదాపు రూ. 7 లక్షలు.
Also Read: లడఖ్.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్, ఎందుకంత స్పెషల్ అంటే ?
ప్యాలెస్ ఆన్ వీల్స్:
ఇది ఇండియాలోని అత్యుత్తమ లగ్జరీ రైళ్లలో ఒకటి. ఈ రాయల్ రైలులో రాజస్థాన్ సంస్కృతి , సంప్రదాయాల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనం కనిపిస్తుంది. ఈ రైలును ఆధునిక సౌకర్యాలకు అనుగుణంగా రూపొందించారు. ఇందులో విలాసవంతమైన క్యాబిన్లు, స్టాక్ బార్, స్పా, ప్రయాణీకుల కోసం లైబ్రరీ కూడా ఉంటుంది. ప్యాలెస్ ఆన్ వీల్స్ లో సాంప్రదాయ వంటకాలతో పాటు వివిధ రకాల విదేశీ వంటకాలను అందిస్తుంది. ఈ ట్రైన్ జర్నీ కోసం మీరు దాదాపు 2 లక్షల ఖర్చు చేయాల్సి ఉంటుంది.