E-Paper
Advertisement

Srikakulam Trains: హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు వందే భారత్, గరీబ్ రథ్‌లు నడపండి ప్లీజ్!

Srikakulam Trains: హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు వందే భారత్, గరీబ్ రథ్‌లు నడపండి ప్లీజ్!
Advertisement

Hyderabad- Srikakulam Trains: వందేభారత్, గరీభ్ రథ్, దురంతో, గోదావరి రైళ్లను ఎండింగ్ పాయింట్లు విజయనగరం, చీపురుపల్లి స్టాప్స్ ఇచ్చుకుంటూ శ్రీకాకుళం వరకు పెంచాలని స్థానిక ప్రజల నుంచి ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. రీసెంట్ గా నర్సాపురం వరకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు పొడిగించిన నేపథ్యంలో ప్రజలు తమ డిమాండ్ ను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నాలుగు, ఐదు మండలాల ప్రజలకు ఆధారంగా ఉండే పొందూరు రైల్వేస్టేషన్ లో హౌరా-చెన్నై మెయిల్, ప్రశాంతి ఎక్స్ ప్రెస్ హాల్టింగ్ కోసం గత రెండు దశాబ్దాలుగా MLA, MP లకు లేఖలు ఇస్తున్నా ప్రయోజనం కలగడం లేదంటున్నారు.

ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలు

శ్రీకాకుళం, విజయనగరం ఇతరాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు తమ ఊర్లకు చేరాలంటే విశాఖపట్నంలో రైలు దిగి మళ్లీ బస్సుల్లో వెళ్లాలి. రైలు దిగిన తర్వాత బస్సులు కోసం వేచి చూసేసరికే సగం రోజు అయిపోతుంది. పైగా తక్కువ రోజుల సెలవులతో ఊర్లకు వెళ్తారు. సగం సెలవులు ప్రయాణంలోనే అయిపోతాయి. నిజానికి ఈ నగరాల మీదుగా ఒడిసా, పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే రెగ్యులర్ రైళ్లు చాలా రద్దీగా ఉంటాయి. వాటిలో టికెట్లు కూడా దొరకవు. డబ్బు, సమయం వృథా అవుతుంది. ఈ ప్రాంతాలకు సంబంధించిన వలస కూలీలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

⦿ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్: సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య వందే భారత్ (ట్రైన్ నం. 20833/20834) రోజూ నడుస్తోంది. ఇది వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సమల్కోట్ వంటి స్టేషన్లలో ఆగుతుంది. కానీ శ్రీకాకుళం రోడ్ లో స్టాప్ లేదు. ఇది విశాఖపట్నం వరకు నేరుగా వెళ్తుంది.

⦿ గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్: విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య గరీబ్ రథ్ (ట్రైన్ నం. 12739/12740) నడుస్తోంది. ఇది కూడా శ్రీకాకుళం రోడ్‌లో స్టాప్ లేదు, విశాఖపట్నం వరకు వెళ్తుంది.

Advertisement

Read Also: వందే భారత్ రైళ్లలో లోకల్ ఫుడ్స్, ఇక లొట్టలేసుకుంటూ తినేయొచ్చు!

రామ్మోహన్ నాయుడు జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్

శ్రీకాకుళం వరకు నేరుగా వందే భారత్, దురంతో, గరీబ్ రథ్ లేవు. కానీ, మీరు విశాఖపట్నం వరకు వీటిలో వెళ్లి, అక్కడ నుంచి శ్రీకాకుళంకు ఇతర ట్రైన్లు.. జన్మభూమి, విశాఖ ఎక్స్‌ ప్రెస్ లాంటి వాటిలో వెళ్లాలి. లేదంటే బస్సులలో వెళ్లాల్సి ఉంటుంది.  ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు వందే భారత్ ఎక్స్‌ ప్రెస్, గరీబ్ రథ్, దురంతో, గోదావరి ఎక్స్‌ ప్రెస్ రైళ్లను నడపాలని కోరుతున్నారు.

Read Also: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×