E-Paper
Advertisement

Special Trains: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!

Special Trains: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!
Advertisement

Sankranti  Special Trains: తెలుగు ప్రజలు అట్టహాసంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సొంతూళ్లకు చేరుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు గ్రామాలకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే సంక్రాంతి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈమేరకు 57 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వాటికి సంబంధించిన వివరాలను విడుదల చేసింది.

జనవరి 9 నుంచి 18 వరకు ప్రత్యేక రైళ్లు  

సౌత్ సెంట్రల్ రైల్వే జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి పండుగ కోసం వివిధ ప్రాంతాలకు 57 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవన్నీ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి. ఇంతకీ ఈ రైళ్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

Advertisement

⦿ కాకినాడ టౌన్-వికారాబాద్

⦿ వికారాబాద్-కాకినాడ టౌన్

Advertisement

⦿ కాకినాడ టౌన్-సికింద్రాబాద్

⦿ సికింద్రాబాద్-కాకినాడ టౌన్

⦿ కాకినాడ టౌన్-లింగంపల్లి/ వికారాబాద్

⦿ వికారాబాద్/ లింగంపల్లి-కాకినాడ టౌన్

⦿ తిరుపతి-వికారాబాద్

⦿ వికారాబాద్-నరసపూర్

⦿ నరసపూర్-వికారాబాద్

⦿ నరసపూర్-సికింద్రాబాద్

⦿ సికింద్రాబాద్-నరసపూర్

⦿ నరసపూర్-లింగంపల్లి/ వికారాబాద్

⦿ వికారాబాద్/ లింగంపల్లి-నరసాపూర్

⦿ సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్

⦿ శ్రీకాకుళం రోడ్ – సికింద్రాబాద్

⦿ వికారాబాద్ – శ్రీకాకుళం రోడ్డు

ప్రస్తుతానికి ఈ రైళ్లను ప్రకటించినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. రద్దీకి అనుగుణంగా అవసరం అయితే, మరిన్ని రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది.

Read Also: వందే భారత్ రైళ్లలో లోకల్ ఫుడ్స్, ఇక లొట్టలేసుకుంటూ తినేయొచ్చు!

అజ్మీర్ కు 2 ప్రత్యేక రైళ్లు

అటు అజ్మీర్ 814వ వార్షిక ఉర్సు సందర్భంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు, డిసెంబర్ 23న హైదరాబాద్ నుంచి అజ్మీర్‌కు, డిసెంబర్ 27న అజ్మీర్ నుంచి హైదరాబాద్‌ కు నడుస్తాయని తెలిపారు. ప్రయాణీకులు ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించారు.

Read Also: డ్రైవర్ లెస్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ఇక సెకెన్ కూడా లేటవదండోయ్!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×