E-Paper
Advertisement

హైదరాబాద్‌కు గుడ్ న్యూస్.. కొత్తగా మరో 3 ఎంఎంటీఎస్ స్టేషన్లు!

హైదరాబాద్‌కు గుడ్ న్యూస్..  కొత్తగా మరో 3 ఎంఎంటీఎస్ స్టేషన్లు!
Advertisement

Hyderabad MMTS Expansion: హైదరాబాద్ నగర ప్రజలకు మరో గుడ్ న్యూస్. సిటీ రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చే దిశగా ఎంఎంటీఎస్ (MMTS) విస్తరణకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణ కష్టాలను తగ్గించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడనుంది. ఇందులో భాగంగా కొత్త స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.

కొత్తగా మరో 3 ఎంఎంటీఎస్ స్టేషన్లు

ప్రస్తుత ప్రతిపాదనలో భాగంగా హైదరాబాద్ లో మూడు కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. వాటిలో ఒకటి అల్వాల్–లయోలా కాలేజీ, రెండు ఆనంద్ బాగ్, మరొకటి మౌలాలీ ప్రాంతాల్లో నిర్మించాలని భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఈ కొత్త స్టేషన్ల వల్ల మంచి లాభం కలగనుంది. ఇప్పటి వరకు వాళ్లు బస్సులు, వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ, ఈ స్టేషన్లు అందుబాటులోకి వస్తే, రైలు ప్రయాణం ద్వారా వేగంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.

Advertisement

ఇక ఈ విస్తరణ వల్ల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఒత్తిడి కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా పీక్ అవర్స్‌ లో రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించనుంది. రైల్వే ప్రయాణం పెరగడం వల్ల కాలుష్యం కూడా కొంతమేర తగ్గే అవకాశముంది. అంతేకాదు, ప్రజలు తమ ప్రయాణ ఖర్చులను కూడా తగ్గించుకునే అవకాశం ఉంది.

రైల్వే బోర్డు ఆమోదం కోసం వెయిటింగ్

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ కు రైల్వే బోర్డు నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది. ఆమోదం లభించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.  పనులు ప్రారంభమైన తర్వాత వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటారు. సిటీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవల విస్తరణ

Advertisement

మరోవైపు భవిష్యత్తులో ఎంఎంటీఎస్ సేవలను యాదాద్రి వరకు విస్తరించే ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. అమలైతే నగర పరిధిని దాటి పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా పెద్ద ఉపశమనం లభిస్తుంది. యాదాద్రి వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లే భక్తులకు మరింత సౌకర్యంగా మారుతుంది. ఎంఎంటీఎస్ విస్తరణ ప్రాజెక్ట్ హైదరాబాద్  రవాణా రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. కొత్త స్టేషన్లు, విస్తరించిన మార్గాలు  సిటీ జీవనశైలిని సులభతరం చేస్తాయి. ట్రాఫిక్ సమస్యలకు కొంతవరకు పరిష్కారం లభించడంతో పాటు, ప్రజల రోజువారీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత నగరంలో రవాణా విధానంలో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది.

Read Also: తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఇక గోవాకు ఈజీగా వెళ్లొచ్చు!

Related News

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

Big Stories

Advertisement
×