E-Paper
Advertisement

దీపావళికి రైల్వే గుడ్ న్యూస్.. 100కు పైగా స్పెషల్ ట్రైన్లు!

దీపావళికి రైల్వే గుడ్ న్యూస్.. 100కు పైగా స్పెషల్ ట్రైన్లు!
Advertisement

Diwali Special Trains 2026: దసరా, దీపావళి, ఛత్ పూజ పండుగలు దగ్గర పడుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగల సమయంలో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరగడంతో, రద్దీని తగ్గించేందుకు 100కు పైగా ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.

పండుగల వేళ పెరగనున్న రద్దీ!

ప్రతి ఏడాది దుర్గా పూజ, దీపావళి, ఛత్ పూజ సమయంలో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి. ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు పండుగలకు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో రైళ్లను ఆశ్రయిస్తారు. దీంతో సాధారణ రైళ్లలో సీట్ల కోసం డిమాండ్ పెరగడంతో పాటు, వెయిటింగ్ లిస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ప్రధాన నగరాలకు ప్రత్యేక కనెక్టివిటీ!

Advertisement

ఈ ప్రత్యేక రైళ్లు దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను పండుగల సమయంలో ఎక్కువ డిమాండ్ ఉండే ప్రాంతాలను లింక్ చేయనున్నాయి. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సర్వీసులను రూపొందిస్తున్నారు. దీంతో సాధారణ రైళ్లపై ఒత్తిడి కొంత తగ్గడంతో పాటు, ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యం ఈజీ కానుంది.

సాధారణ రైళ్లలోనూ అదనపు కోచ్‌లు!

ప్రత్యేక రైళ్లతో పాటు ఇప్పటికే నడుస్తున్న కొన్ని సాధారణ రైళ్లకు అదనపు కోచ్‌లను కూడా జోడించనున్నారు. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులకు టికెట్లు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. పండుగ సమయంలో రైల్వే సేవలపై భారీగా పెరిగే డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు ఇది మరో ముఖ్యమైన చర్యగా చెప్పవచ్చు.

IRCTCలో కీలక మార్పులు!

Advertisement

అటు టికెట్ల బుకింగ్ విషయంలోనూ ప్రయాణికులకు మెరుగైన ఎక్స్ పీరియెన్స్ అందించేందుకు IRCTC తన నెక్స్ట్ జనరేషన్ ఇ టికెటింగ్ (NGeT) ప్లాట్‌ ఫారమ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. పండుగ సీజన్‌లో తక్కువ సమయంలో భారీ సంఖ్యలో ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో వెబ్‌ సైట్, యాప్‌ పై ఒక్కసారిగా ఎక్కువ ట్రాఫిక్ భారం పడుతోంది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని సర్వర్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, ఆటోమేటెడ్ బాట్స్‌ ను నియంత్రించే చర్యలను కూడా మెరుగుపరిచారు.

నిజమైన ప్రయాణికులకు ఉపయోగం!

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో బాట్స్ కారణంగా సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాంటీ బాట్ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా నిజమైన ప్రయాణికులకు మరింత సమర్థవంతమైన బుకింగ్ అవకాశం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది భారతీయ రైల్వే. దీపావళి పండుగ సీజన్‌లో ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్‌లు, మెరుగైన ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థతో ప్రయాణికుల రద్దీని మెయింటెయిన్ చేసేందుకు రైల్వే సిద్ధమవుతోంది.

Read Also: భారత్‌కు రష్యా హైస్పీడ్ గిఫ్ట్.. వందే భారత్‌ ను తలదన్నే కొత్త రైలు వచ్చేస్తోంది!

Tags

Related News

భారత్‌కు రష్యా హైస్పీడ్ గిఫ్ట్.. వందే భారత్‌ ను తలదన్నే కొత్త రైలు వచ్చేస్తోంది!

ఖైరతాబాద్ తరహాలో.. దేశంలోనే పాపులర్ గణేశ్ మందిరాలు.. ఈ 6 పక్కా చూడాల్సిందే!

భూమిని కాపాడుతున్న సూపర్ పవర్స్.. మనుషులు కాదండోయ్.. ఈ 6 జీవులే రియల్ హీరోస్!

రైలు మీద తెగిపడ్డ ఓవర్‌ హెడ్ వైర్లు.. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు!

మహిళా బైకర్‌ను రోడ్డుపై వెంటాడి.. ఘోరంగా ఢీకొట్టిన ఆకతాయిలు.. వైలర్ అవుతున్న వీడియో!

24 క్యారెట్ల బంగారం.. 3,83,800 డైమండ్స్.. భాగ్యనగరంలో మెరిసిపోతున్న గోల్డెన్ గణపయ్య!

యమలోకం దాటి వెళ్తే.. కోటి గాజుల గణపతి దర్శనం.. గాజువాకలో అదిరిపోయే వినాయక మండపం!

Big Stories

Advertisement
×