E-Paper
Advertisement

ఏపీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్.. 20 డిపార్ట్‌మెంట్లలో ఖాళీలు, ప్రస్తుతం ఆ శాఖలకు సంబంధించి

ఏపీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్.. 20 డిపార్ట్‌మెంట్లలో ఖాళీలు, ప్రస్తుతం ఆ శాఖలకు సంబంధించి
Advertisement

APPSC Jobs Notifications-2026 : ఎట్టకేలకు నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 20 శాఖలకు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇచ్చింది. బుధవారం అంటే ఈనెల 16న మరో ఐదు శాఖలకు సంబంధించి పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఈనెల 24న మరో 10 శాఖల ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన విడుదల చేయనుంది. ఆయా ఉద్యోగాల నోటిఫికేషన్ల వివరాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఏపీలో ప్రభుత్వ  ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త వచ్చేసింది. అంతేకాదు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. అందులో గ్రూప్-1 పోస్టులతోపాటు అటవీ, గిరిజన సంక్షేమ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఐదు శాఖలకు చెందిన నోటిఫికేషన్లు ఇచ్చింది ప్రభుత్వం. ఈనెల 16న అంటే బుధవారం మరో ఐదు శాఖలు, ఈనెల 24న మరో 10 శాఖల ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన విడుదల చేయనుంది. మంగళవారం విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మరో 15 డిపార్టుమెంట్లకు సంబంధించి బుధవారం రిలీజ్

Advertisement

కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. మరో విషయం ఏంటంటే.. గ్రూప్-1 కు సంబంధించి 163 పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 6 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. అక్టోబర్ 27 వరకు గడువు ఉంది. గ్రూప్-1లో 163 పోస్టులతో పాటు వివిధ శాఖలలో 729 పోస్టులు ఉన్నాయి. అంతా కలిపితే దాదాపు 892 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

ALSO READ: పులివెందులలో అర్ధరాత్రి ఏం జరిగింది? గణేషుడి మండపం వద్ద కాల్పులు, పరుగో పరుగు

Advertisement

వివిధ విభాగాల పోస్టుల విషయానికి వద్దాం. అందులో డిప్యూటీ కలెక్టర్లు-11, ట్యాక్స్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ కమిషనర్లు- 14, డీఎస్పీ సివిల్‌- 36, డీఎస్పీ కమ్యూనికేషన్స్‌-3, డీఈవోలు-14, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు-1, ఆర్టీవోలు-3, డిప్యూటీ రిజిస్టర్‌ కోఆపరేటివ్‌ సర్వీసెస్‌- 15 పోస్టులు ఉన్నాయి. ఇక మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ 2 పోస్టులు-12, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌- 2, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌-3, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌-14, డివిజినల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌- 35 ఉద్యోగాలు ఉన్నాయి.

Related News

పులివెందులలో అర్ధరాత్రి ఏం జరిగింది? గణేషుడి మండపం వద్ద కాల్పులు, పరుగో పరుగు

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

Big Stories

Advertisement
×