E-Paper
Advertisement

Winter Train Journeys: నార్త్ టు సౌత్, శీతాకాలంలో బెస్ట్ ట్రైన్ జర్నీస్, లైఫ్ లో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!

Winter Train Journeys: నార్త్ టు సౌత్, శీతాకాలంలో బెస్ట్ ట్రైన్ జర్నీస్, లైఫ్ లో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!
Advertisement

Indian Railways: శీతాకాలం అంటేనే ప్రకృతి రమణీయతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉత్తరాదిని మంచు దుప్పటికే కప్పేస్తుండగా, సౌత్ లో పొగమంచు నృత్యం చేస్తుంటుంది. ప్రకృతి అందం అంతా వింటర్ లోనే కనువిందు చేస్తుంది. ఈ సమయంలో రైలు ప్రయాణం చేస్తుంటే చెప్పలేని అనుభూతి కలుగుతుంది. కిటికీ దగ్గర కూర్చొని చూస్తుంటే మంచుతో కప్పబడిన పర్వతాల నుంచి పొగ మంచు లోయల వరకు ఆహా అనిపిస్తాయి. దేశంలో శీతాకాలంలో చేయాల్సిన బెస్ట్ ట్రైన్ జర్నీస్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్  

Advertisement

శీతాకాలపు అందాలను అద్భుతంగా అందించే రైలు ప్రయాణం ఏదైనా ఉందంటే.. అది కల్కా-సిమ్లా టాయ్ జర్నీ మాత్రమే. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ ప్రయాణంలో 102 సొరంగాలు, 864 వంతెనలు, పైన్ అడవులు, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాల కనువిందు చేస్తాయి. శీతాకాలంలో ఈ ట్రైన్ జర్నీ చేస్తుంటే మేఘాల్లో తేలిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. సూర్యకాంతిలో మెరిసే మంచుగడ్డలు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

⦿డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే

Advertisement

శీతాకాలంలో ప్రయాణించాల్సిన మరో రైలు ప్రయాణం డార్జిలింగ్ హిమాలయన్ జర్నీ. న్యూ జల్పైగురి నుంచి డార్జిలింగ్‌ వరకు కొనసాగే ఈ ప్రయణం ప్రకృతి ప్రేమికులకు మర్చిపోలేను అనుభవాన్ని అందిస్తుంది. శీతాకాలంలో, పచ్చని తేయాకు తోటలు పొగమంచుతో కప్పబడి మరింత రమణీయంగా కనిపిస్తాయి. మంచుతో కప్పబడిన పర్వతాలు మరింత అందాన్ని కలిగిస్తాయి.

⦿కాంగ్రా వ్యాలీ రైల్వే

ఈ ట్రైన్ జర్నీ పఠాన్‌ కోట్ నుంచి  ప్రారంభమై అత్యద్భుతమైన కాంగ్రా వ్యాలీ గుండా కొనసాగుతుంది. శీతాకాలంలో  ధౌలాధర్ ప్రాంతాలు మంచు దుప్పటిని ధరించి మరింతి ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తుంది. లోయలు, నదులు, హిల్ స్టేషన్లు మరింత అందాన్ని కలిగిస్తాయి.

⦿జమ్మూ-బారాముల్లా రైలు

శీతాకాలంలో కాశ్మీర్ మంచులో మునిగిపోతుంది. జమ్మూ-బారాముల్లా రైలు ప్రయాణం మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తుంది. 356 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రయాణంలో.. మంచుతో నిండిన నదుల నుంచి మొదలుకొని, పర్వతాల వరకు కాశ్మీర్ లోయ అందాలను కళ్లకు కడుతుంది. బనిహాల్, కాజిగుండ్ పట్టణాల గురించి సాగే ఈ ప్రయాణం మరింత ఆహ్లాదాన్ని అందిస్తుంది.

⦿నీలగిరి పర్వత రైల్వే

ఇక సౌత్ లో మెట్టుపాళ్యం నుంచి ఈటీ వరకు కొనసాగే ఈ ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రయాణంగా గుర్తించిన ఈ రైల్వే జర్నీ.. పచ్చని టీ తోటలు, దట్టమైన అడవులు మరింత అందంగా కనిపిస్తాయి. ఈ రైలు వింటేజ్ స్టీమ్ ఇంజిన్, పాతకాలపు క్యారేజీలు మరింత స్పెషల్ గా అనిపిస్తాయి.

⦿మాథెరన్ హిల్ రైల్వే

ముంబైలో ఉన్నట్లైతే కచ్చితంగా మాథెరన్ హిల్ రైల్వే  జర్నీ చేయాల్సిందే. శీతాకాలంలో, మాథెరన్ పచ్చదనం ఎంతగానో ఆకట్టుకుంటుంది. మానసికంగా రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి ఇది చక్కటి మార్గం. ఈ రైలు నెమ్మదిగా ముందుకు కదులుతూ పాతకాలపు వైబ్స్ అందిస్తుంది. పశ్చిమ కనుమల్లో ఆహ్లాదకర ప్రయాణాన్ని అందిస్తుంది.

⦿డెక్కన్ ఒడిస్సీ

డెక్కన్ ఒడిస్సీ మహారాష్ట్రలో గొప్ప పర్యటన అనుభూతిని కలిగిస్తుంది. గోవా, అజంతా, ఎల్లోరాలో స్టాప్‌ లతో ఆకట్టుకుంటుంది. శీతాకాలంలో  గోవా బీచ్‌లు,  ఎల్లోరా గుహలు మరింతగా ఆకట్టుకుంటాయి.

Read Also: దేశంలో అత్యంత చౌకైన ఏసీ రైలు ప్రయాణం ఇదే.. వేగంలో వందే భారత్ కు ఏమాత్రం తీసిపోదు!

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×