E-Paper
Advertisement

గంటకు జస్ట్ 10 కి.మీ వేగం.. దేశంలో స్లోయెస్ట్ ట్రైన్ గురించి మీకు తెలుసా?

గంటకు జస్ట్ 10 కి.మీ వేగం.. దేశంలో స్లోయెస్ట్ ట్రైన్ గురించి మీకు తెలుసా?
Advertisement

Slowest Train in India: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం సెమీ హైస్పీడ్ రైళ్లు అయిన వందేభారత్ ట్రైన్లు ప్రజలకు అత్యంత వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. త్వరలో బుల్లెట్ రైళ్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అదే సమయంలో దేశంలో అత్యతం నెమ్మదిగా ప్రయాణించే ఓ ప్రత్యేకమైన రైలు కూడా ఉంది. అది మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు నడుస్తుంది. దానిపేరు నీలగిరి మౌంటెన్ రైల్వే ప్యాసింజర్. ఈ రైలు భారతదేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది.

గంటకు జస్ట్ 10 కి.మీ వేగం..

ఈ రైలు సాధారణంగా గంటకు కేవలం 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇతర ఎక్స్‌ ప్రెస్, హైస్పీడ్ రైళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ వేగం. అయితే, ఈ నెమ్మదితనం వెనుక ఓ ముఖ్యమైన కారణం ఉంది. ఈ రైలు ప్రయాణించే మార్గం పూర్తిగా కొండ ప్రాంతాల్లో ఉంటుంది. ఎత్తైన మార్గం, మలుపులు, సన్నని ట్రాక్‌లు ఉండటం వల్ల భద్రత కోసం వేగాన్ని తగ్గించాల్సి వస్తుంది.

45 కిలో మీటర్లు.. 5 గంటల ప్రయాణం

Advertisement

మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు మొత్తం దూరం సుమారు 46 కిలోమీటర్లు. ఈ చిన్న దూరాన్ని పూర్తి చేయడానికి రైలుకు దాదాపు 5 గంటల సమయం పడుతుంది. అంటే,  చిన్న ప్రయాణం అయినప్పటికీ, సమయం ఎక్కువగా తీసుకుంటుంది. కానీ, ఈ ప్రయాణం విసుగు కలిగించదు. ఎందుకంటే మార్గమంతా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో నిండి ఉంటుంది. ఈ రైలులో ప్రయాణిస్తే, పచ్చని కొండలు, టీ తోటలు, జలపాతాలు, పొగమంచుతో కప్పబడిన లోయలు  అందమైన దృశ్యాలతో ఆకట్టుకుంటాయి. రైలు నెమ్మదిగా కదులుతుండటం వల్ల ప్రతి దృశ్యాన్ని ఆస్వాదించడానికి సమయం దొరుకుతుంది. అందుకే చాలా మంది ఈ ప్రయాణాన్ని ఓ అద్భుతమైన అనుభవంగా భావిస్తారు.

ప్రత్యేక టెక్నాలజీతో నడిచే రైలు

నీలగిరి మౌంటెన్ రైల్వే ప్రత్యేకతల్లో ఒకటి దాని ట్రాక్ వ్యవస్థ. ఇందులో  రాక్ అండ్ పినియన్ అనే ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇది ఎత్తైన ప్రాంతాల్లో రైలు సులభంగా ఎక్కేలా సాయపతుంది. ఈ విధానం వల్లే రైలు కొండలపై సురక్షితంగా ప్రయాణిస్తుంది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రైల్వే మార్గం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌ గా కూడా గుర్తింపు పొందింది. అంటే, ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, ఒక చారిత్రాత్మక,  సాంస్కృతిక వారసత్వంగా కూడా నిలుస్తోంది. ఈ రైలు వేగం తక్కువైనా, అనుభవం మాత్రం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. వేగంగా గమ్యానికి చేరుకోవడం కంటే, ప్రయాణాన్ని ఆస్వాదించడం ఇష్టపడేవారికి ఇదో అద్భుతమైన ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ నెమ్మదైన ప్రయాణం ప్రయాణికులకు ప్రకృతితో మరింత దగ్గరగా ఉండే అవకాశం కల్పిస్తుంది.

Advertisement

Read Also: అమ్మో ఇండియన్ రైల్వే.. అన్ని లక్షల మంది పని చేస్తున్నారా?

Related News

14 బోగీలు.. 400 మంది ప్రయాణికులు.. భారత తొలి రైలు ప్రయాణం ఎలా సాగిందంటే!

దీపావళికి రైల్వే గుడ్ న్యూస్.. 100కు పైగా స్పెషల్ ట్రైన్లు!

భారత్‌కు రష్యా హైస్పీడ్ గిఫ్ట్.. వందే భారత్‌ ను తలదన్నే కొత్త రైలు వచ్చేస్తోంది!

ఖైరతాబాద్ తరహాలో.. దేశంలోనే పాపులర్ గణేశ్ మందిరాలు.. ఈ 6 పక్కా చూడాల్సిందే!

భూమిని కాపాడుతున్న సూపర్ పవర్స్.. మనుషులు కాదండోయ్.. ఈ 6 జీవులే రియల్ హీరోస్!

రైలు మీద తెగిపడ్డ ఓవర్‌ హెడ్ వైర్లు.. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు!

మహిళా బైకర్‌ను రోడ్డుపై వెంటాడి.. ఘోరంగా ఢీకొట్టిన ఆకతాయిలు.. వైలర్ అవుతున్న వీడియో!

24 క్యారెట్ల బంగారం.. 3,83,800 డైమండ్స్.. భాగ్యనగరంలో మెరిసిపోతున్న గోల్డెన్ గణపయ్య!

Big Stories

Advertisement
×