E-Paper
Advertisement

పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు… మైండ్ బెండయ్యే ట్విస్టులు

పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు… మైండ్ బెండయ్యే ట్విస్టులు
Advertisement

Female Led Crime Thrillers : క్రైమ్ థ్రిల్లర్లు ఇష్టపడే ఓటీటీ మూవీ లవర్స్ కు మహిళా పాత్రలు బలంగా ఉన్న సిరీస్‌ లు ఒక్కసారి చూస్తే మరచిపోలేని అనుభవం ఇస్తాయి. సస్పెన్స్, హత్యలు, సైకలాజికల్ గేమ్స్‌తో ఆకట్టుకునే ఈ సిరీస్‌ లు చివరి నిమిషం వరకు ఆడియన్స్ ను ఉత్కంఠలో ఉంచుతాయి. “బ్రౌన్” నుంచి “ఢిల్లీ క్రైమ్” వరకు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న టాప్ 6 లేడీ లీడింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ లు ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి ? అనే వివరాల్లోకి వెళ్తే…

1. బ్రౌన్ (Brown)

కరిష్మా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కోల్‌కతా నేపథ్యంలో సాగుతుంది. మద్యపాన వ్యసనంతో పోరాడుతున్న ధైర్యవంతురాలైన పోలీస్ అధికారి రీటా బ్రౌన్ పాత్రలో కరిష్మా మెప్పించింది. ఒక ధనిక కుటుంబ యువతి హత్య కేసును ఆమె ఎలా ఛేదిస్తుంది ? అనేది స్టోరీ. ఈ సిరీస్ సైకలాజికల్ డెప్త్‌ తో సాగుతుంది. ZEE5లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

2. కిల్లర్ సూప్ (Killer Soup)

Advertisement

ఇదొక ఉత్కంఠభరితమైన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. సొంత రెస్టారెంట్ ప్రారంభించాలని కలలు కంటున్న నర్స్ స్వాతి శెట్టి (కొంకణా సేన్ శర్మ) తన భర్తను చంపడానికి ఒక ప్రమాదకర పథకం పన్నుతుంది. మనోజ్ బాజ్‌పేయ్ ఇందులో మరో మెయిన్ లీడ్ గా నటించాడు. కామెడీ, సస్పెన్స్ రెండూ బ్యాలెన్స్‌గా ఉండటం ఈ సిరీస్ ప్రత్యేకత. Netflixలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

3. బ్లాక్ విడోస్ (Black Widows)

ఈ సిరీస్ ముగ్గురు స్నేహితుల కథ. అసంతృప్తికరమైన వివాహ బంధాల్లో చిక్కుకున్న వారు తమ భర్తల నుంచి విముక్తి కోసం కలలు కంటారు. ఒక పడవ ప్రయాణం ఘోర ప్రమాదంగా మారినప్పుడు వారి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. మహిళల బాధలు, ప్రతీకారం అన్నీ బలంగా చూపించిన సిరీస్ ఇది. ZEE5లో ఈ సిరీస్ ను చూడవచ్చు.

4. సాస్, బహు ఔర్ ఫ్లెమింగో (Saas, Bahu Aur Flamingo)

Advertisement

హోమీ అడజానియా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ లో మహిళలు ఇంటి నాలుగు గోడలకు పరిమితం కాకుండా భారీ డ్రగ్ కార్టెల్‌ ను నడుపుతారు. డింపుల్ కపాడియా, రాధికా మదన్ అద్భుత నటనతో మెప్పించారు. క్రైమ్, ఫ్యామిలీ డ్రామా, పవర్ స్ట్రగుల్ కలిసిన బలమైన సిరీస్ ఇది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలి అన్పించేలా ఉంటుంది. JioHotstarలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

5. దహాద్ (Dahaad)

రాజస్థాన్‌ లోని చిన్న పట్టణంలో మహిళా పోలీస్ అధికారిణి (సోనాక్షి సిన్హా), సీరియల్ కిల్లర్ (విజయ్ వర్మ) మధ్య జరిగే మైండ్ గేమ్ ఇది. అంజలి భాటి పాత్రలో సోనాక్షి ధైర్యవంతురాలైన పోలీస్ అవతారంలో ఆకట్టుకుంది. ఉత్కంఠ, సస్పెన్స్ ఉన్న ఈ సిరీస్ ను Prime Videoలో చూడవచ్చు.

6. ఢిల్లీ క్రైమ్ (Delhi Crime)

వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సిరీస్ లో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు పనితీరును కళ్ళకు కట్టినట్టు చూపించారు. డీసీపీ వర్తిక చతుర్వేది (షెఫాలీ షా) తన బృందంతో కలిసి కేసులను ఎలా ఛేదిస్తుందో హార్ట్ టచింగ్ గా చూపించారు. మూడు సీజన్లుగా వచ్చిన ఈ సిరీస్ క్వాలిటీపరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.

Read Also : నిండు గర్భిణిని సొంత భర్తే చంపే స్పైన్ చిల్లింగ్ మలయాళం థ్రిల్లర్

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×