E-Paper
Advertisement

భారత్ గౌరవ్ రైల్లో నేపాల్ టూర్.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ!

భారత్ గౌరవ్ రైల్లో నేపాల్ టూర్.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ!
Advertisement

IRCTC Pashupatinath Nepal Darshan Yatra: విదేశీ పర్యటన చేయాలనుకునే వారికి, ముఖ్యంగా ఆధ్యాత్మిక యాత్రతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి IRCTC మరో అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. “పశుపతినాథ్ నేపాల్ దర్శన్ యాత్ర” పేరుతో ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రారంభించింది. ఈ ప్యాకేజీ ద్వారా నేపాల్‌ లోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం లభిస్తుంది.

జూన్ 24న యాత్ర ప్రారంభం

భారత్-నేపాల్ మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక యాత్రను రూపొందించింది. జూన్ 24న  మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్ నుంచి ఈ ప్రత్యేక రైలు బయలుదేరనుంది. సుమారు 38 నుంచి 42 గంటల ప్రయాణం అనంతరం రైలు బీహార్‌ లోని రక్సౌల్ చేరుకుంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేపాల్‌ లోని ప్రధాన పర్యాటక ప్రాంతాలకు ప్రయాణం కొనసాగుతుంది.

నేపాల్ లో ఏ ప్రాంతాలు కవర్ అవుతాయంటే?

Advertisement

ఈ యాత్రలో పర్యాటకులు నేపాల్ రాజధాని కాఠ్మండు, ప్రకృతి సోయగాలకు ప్రసిద్ధి చెందిన పోఖారా, ప్రసిద్ధ మనకామన ఆలయం, చిత్వాన్ నేషనల్ పార్క్ లాంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించనున్నారు. ముఖ్యంగా హిందువులకు అత్యంత పవిత్రమైన పశుపతినాథ్ ఆలయం ఈ టూర్‌లో ప్రధాన ఆకర్షణ కానుంది. ప్రతి ఏడాది వేలాది మంది భారతీయ భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

అటు మనకామన ఆలయానికి వెళ్లేందుకు రోప్‌ వే ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేశారు. కొండపై ఉన్న ఈ ఆలయం నేపాల్‌ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మరోవైపు ప్రకృతి, వన్యప్రాణులను ఇష్టపడే వారికి చిత్వాన్ నేషనల్ పార్క్ ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. అక్కడ జీప్ సఫారీ ద్వారా ఖడ్గమృగాలు, ఏనుగులు, బెంగాల్ పులులు సహా అరుదైన జంతువులను చూడొచ్చు.

జూలై 1న తిరుగు ప్రయాణం

Advertisement

జూలై 1న కాఠ్మండు నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. రోడ్డు మార్గంలో రక్సౌల్ చేరుకుని, అక్కడి నుంచి భారత్ గౌరవ్ రైలు ఇండోర్‌ కు బయలుదేరుతుంది. జూలై 3న ఇండోర్ చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ వివరాలు

ఈ టూర్ ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్ వసతి, రోజువారీ భోజనం, స్థానిక రవాణా, గైడెడ్ సైట్‌ సీయింగ్, ఎంట్రీ ఫీజులు అన్నీ కలిపి ఉంటాయి.ప్రయాణికులు అదనపు ఏర్పాట్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మొత్తం 150 సీట్లతో ఈ ప్రత్యేక రైలు నడవనుంది. ఏసీ-1, ఏసీ-2, ఏసీ-3 తరగతుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అత్యంత తక్కువ ధర ఏసీ-3 ట్రిపుల్ షేరింగ్ కేటగిరీలో ఒక్కో వ్యక్తికి రూ.61,340గా నిర్ణయించారు.  ప్రయాణ సౌకర్యాలు, వసతి, భోజనం అన్నీ కలిపి చూస్తే ఇది చీప్ అండ్ బెస్ట్  ప్యాకేజీ కానుంది. ఆధ్యాత్మికత, ప్రకృతి, సాహసయాత్ర అన్నీ ఒకే టూర్‌ లో ఎక్స్ పీరియెన్స్ చేయాలనుకునే వారికి ఈ నేపాల్ దర్శన్ యాత్ర మంచి అవకాశం కానుంది.

Read Also: గోల్డెన్ చారియట్‌ కు సరికొత్త కొత్త హంగులు.. 2026-27 సీజన్ రెడీ!

Related News

ఒక రైల్ ఇంజిన్ ఎన్ని బోగీలను లాగగలదు.. రైల్వే బోగీల సంఖ్య ఎందుకు పెంచదు?

పండగకు ఊరెళ్లేవారికి సూపర్ న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ రైళ్లు!

సికింద్రాబాద్–వరంగల్ మార్గంలో నాలుగు రైళ్లు రద్దు, ఎప్పుడంటే?

రైలు 9 గంటలు లేట్.. ప్రయాణికుడికి రూ.35 వేల పరిహారం.. అసలు ఏం జరిగిందంటే?

20 గంటల ప్రయాణం ఇక 7 గంటలే.. మరో బుల్లెట్ రైలు కారిడార్ కు గ్రీన్ సిగ్నల్!

రూ.50,000 బడ్జెట్‌లో ఫారిన్ టూర్.. ఫ్రెండ్స్‌తో కలిసి మలేషియా ట్రిప్ ఇలా ఎంజాయ్ చేయండి

తెలంగాణకు గుడ్ న్యూస్.. కొత్త రైల్వే లైన్ వచ్చేస్తోంది!

దీపావళికి ముందే రెండో వందే భారత్ స్లీపర్ ఎంట్రీ.. ఏ రూట్ లో పరుగులు తీస్తుందంటే?

Big Stories

Advertisement
×