E-Paper
Advertisement

నెట్‌ఫ్లిక్స్ లో తుక్కురేగ్గొడుతున్న యానిమేటెడ్ చిత్రాలు… ఇందులో మీరెన్ని చూశారు ?

నెట్‌ఫ్లిక్స్ లో తుక్కురేగ్గొడుతున్న యానిమేటెడ్ చిత్రాలు… ఇందులో మీరెన్ని చూశారు ?
Advertisement

Best Netflix Animated Movies : పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా యానిమేటెడ్ సినిమాలను ఇప్పుడు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కథలోని ఆకర్షణ, అద్భుతమైన విజువల్స్, హాస్యం, భావోద్వేగాలు అన్నీ కలిసి యానిమేషన్‌ను అన్ని వయసుల వారికీ ఇష్టమైన జానర్‌ గా మార్చేశాయి. మీకు కూడా ఇలాంటి సినిమాలంటే ఇష్టమా ? అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని అద్భుతమైన యానిమేటెడ్ చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. స్వాప్డ్ (Swapped)

మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై 6 వారాలుగా టాప్ 10లో 3వ స్థానంలో నిలిచిన హార్ట్‌వార్మింగ్ యానిమేటెడ్ చిత్రం ‘స్వాప్డ్’. పుట్టుకతోనే బద్ధ శత్రువులైన ఓలీ, ఐవీల శరీరాలు ఒక ప్రమాదం వల్ల పరస్పరం మారిపోతాయి. తమ పాత జీవితాలకు తిరిగి వెళ్లాలంటే ఇద్దరూ కలిసి ఒక సవాల్‌తో కూడిన ప్రయాణం చేయాల్సి వస్తుంది. హాస్యం, స్నేహం, కుటుంబ బంధాలు అన్నీ అద్భుతంగా మేళవించిన ఈ చిత్రం ఇప్పటికే 7.5 మిలియన్ల వ్యూస్ సాధించింది. పిల్లలతో కలిసి కుటుంబం మొత్తం ఆనందించడానికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్.

2. డేవిడ్ (David)

Advertisement

2025లో విడుదలై జూన్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చిన ఇతిహాస సంగీత యానిమేటెడ్ చిత్రం ‘డేవిడ్’. బైబిల్‌ లోని సమూయేలు గ్రంథం నుంచి స్ఫూర్తి పొందిన ఈ చిత్రం గొర్రెల కాపరి బాలుడు డేవిడ్ ఎలా ధైర్యవంతుడైన యోధుడిగా, ఇజ్రాయేలుకు గొప్ప రాజుగా మారాడో అద్భుతంగా చెబుతుంది. సంగీతం, విజువల్స్, ధైర్య సందేశం కలిసిన ఈ చిత్రం ఒక వారం పాటు టాప్ 10లో నిలిచి 6.2 మిలియన్ల వీక్షణలు సాధించింది. పిల్లలకు మంచి సందేశం ఇచ్చే చిత్రం కావాలంటే ఇది బెస్ట్.

3. గోట్ (Goat)

ఇదొక స్పోర్ట్స్ కామెడీ-డ్రామా యానిమేషన్ మూవీ. చురుకైన చిన్న మేక విల్ జంతు రాజ్యంలో ఆడే ప్రమాదకరమైన రోర్‌బాల్ (బాస్కెట్‌బాల్ లాంటి ఆట) ద్వారా తన సాహసాలను చూపిస్తుంది. నాలుగు వారాలుగా టాప్ 10లో ఉన్న ఈ చిత్రం ఇప్పటికే 5.2 మిలియన్ల వీక్షణలు అందుకుంది. హాస్యం, స్నేహం, ధైర్యం నిండిన ఈ చిత్రం పిల్లలతో పాటు పెద్దలకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.

4. కె-పాప్ డెమన్ హంటర్స్ (K-Pop Demon Hunters)

Advertisement

నెట్‌ఫ్లిక్స్‌లో బాగా ట్రెండ్ అవుతున్న యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ చిత్రం ఇది. “హంట్రిక్స్” రూమి, మీరా, జోయీ అనే కె-పాప్ బృందం ప్రపంచానికి పాప్ తారలుగా కనిపిస్తూ, రహస్యంగా రాక్షసులను వేటాడుతుంది. సంగీతం, యాక్షన్, ఫాంటసీ అన్నీ కలిసిన ఈ చిత్రం 51 వారాలుగా టాప్ 10లో నిలిచి 3.2 మిలియన్ల వీక్షణలు సాధించింది. కె-పాప్ ఫ్యాన్స్‌ కు ఇది సూపర్ ట్రీట్. ఈ యానిమేటెడ్ చిత్రాలు కథ, విజువల్స్, సందేశం అన్నీ సరైన బ్యాలెన్స్‌తో ఉండటం వల్ల అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటునున్నాయి.

Read Also : మర్డర్ కేసు కాదు మాస్టర్ గేమ్…. నిమిషానికో ట్విస్ట్ ఉన్న మెంటల్ మాస్ మిస్టరీ థ్రిల్లర్

Tags

Related News

18 ఏళ్లుగా ఒక్క బిడ్డా పుట్టలేదు… 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించిన కల్ట్ క్లాసిక్

స్కూల్లోనే పిల్లల్ని చంపి తినే టీచర్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

టీవీని పక్కన పెట్టేసిన జెన్‌జీ.. అంతా ఓటీటీ మాయే!

రూపాయి ఖర్చు లేకుండా చూడొచ్చు… ఓటీటీ ఫ్రీ క్యాటగిరీలో దుమ్మురేపుతున్న 7 వెబ్ సిరీస్‌లు

10 కోట్ల బ్యాగ్‌ దొరకడంతో మొదలయ్యే గందరగోళం… కితకితలు పెట్టే ఇమ్మిగ్రెంట్స్ కష్టాలు

స్కూల్ టీచర్ నుంచి డిటెక్టివ్‌గా… ట్రిపుల్ మర్డర్, ట్రెజర్ హంట్, లవ్ ట్రయాంగిల్ తో అదిరిపోయే డార్క్ కామెడీ సిరీస్

కిడ్నాప్ వెనుక క్రిమినల్ నెట్‌వర్క్… కూతురి కోసం బ్లడీ బ్లడ్ బాత్

ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

Big Stories

Advertisement
×