E-Paper
Advertisement

చెన్నై-తిరుపతి మార్గంలో 8 రైళ్లు రద్దు.. ఎన్ని రోజులు అంటే?

చెన్నై-తిరుపతి మార్గంలో 8 రైళ్లు రద్దు.. ఎన్ని రోజులు అంటే?
Advertisement

Chennai-Tirupati Trains Cancelled: ప్రయాణికులకు  దక్షిణ రైల్వే కీలక ప్రకటన చేసింది. అరకోణం రైల్వే యార్డ్‌ విస్తరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో చెన్నై-తిరుపతి మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిదంఇ. ఈ నెల 26, 28 తేదీల్లో రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా రైల్వే అధికారులు ఈ రైళ్ల రద్దుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించింది. అరకోణం యార్డ్‌ లో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా కొన్ని రైళ్ల రాకపోకలపై తాత్కాలిక ప్రభావం పడుతున్నట్లు తెలిపింది. ఈ పనుల కారణంగా మొత్తం ఎనిమిది రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

ఏ రైళ్లు రద్దు అవుతున్నాయంటే?

ఈ నెల 26, 28 తేదీల్లో చెన్నై సెంట్రల్‌ నుంచి ఉదయం 6.30 గంటలకు బయలుదేరే తిరుపతి ప్యాసింజర్‌ రైలు సేవలు అందుబాటులో ఉండవు. అటు, మధ్యాహ్నం 2.24 గంటలకు చెన్నై సెంట్రల్‌ నుంచి బయలుదేరే సప్తగిరి ఎక్స్‌ ప్రెస్‌ ను కూడా రెండు రోజుల్లో రద్దు చేశారు. అటు చెన్నై సెంట్రల్‌ నుంచి సాయంత్రం 4.35 గంటలకు తిరుపతికి వెళ్లే రైలును ఈ నెల 26న రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్‌కు ఉదయం 10.10 గంటలకు బయలుదేరే రైలు కూడా ఈ నెల 26, 28 తేదీల్లో నడవదు.తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్‌కు సాయంత్రం 6.05 గంటలకు బయలుదేరే మరో రైలును కూడా ఈ నెల 26వ తేదీన రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

ప్రయాణికులకు రైల్వే కీలక సూచనలు

Advertisement

రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున, ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణికులు రైలు బయలుదేరే ముందు అధికారిక రైల్వే వెబ్‌ సైట్‌, రైల్వే ఎంక్వయిరీ కేంద్రాలు లేదంటే సంబంధిత యాప్‌ ల ద్వారా తాజా వివరాలను తెలుసుకోవాలని కోరారు. అరకోణం యార్డ్‌ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత రైళ్ల రాకపోకలు మరింత మెరుగుపడతాయని, భవిష్యత్తులో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.  ఈ నెల 26, 28 తేదీల్లో చెన్నై-తిరుపతి మార్గంలో ప్రయాణించాలనుకునే వారు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని అధికారులు సూచించారు.

Read Also: బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొత్త టెక్నాలజీ.. తొలిసారిగా టన్నెల్ హుడ్స్ ఏర్పాటు!

Tags

Related News

ఖైరతాబాద్ తరహాలో.. దేశంలోనే పాపులర్ గణేశ్ మందిరాలు.. ఈ 6 పక్కా చూడాల్సిందే!

భూమిని కాపాడుతున్న సూపర్ పవర్స్.. మనుషులు కాదండోయ్.. ఈ 6 జీవులే రియల్ హీరోస్!

రైలు మీద తెగిపడ్డ ఓవర్‌ హెడ్ వైర్లు.. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు!

మహిళా బైకర్‌ను రోడ్డుపై వెంటాడి.. ఘోరంగా ఢీకొట్టిన ఆకతాయిలు.. వైలర్ అవుతున్న వీడియో!

24 క్యారెట్ల బంగారం.. 3,83,800 డైమండ్స్.. భాగ్యనగరంలో మెరిసిపోతున్న గోల్డెన్ గణపయ్య!

యమలోకం దాటి వెళ్తే.. కోటి గాజుల గణపతి దర్శనం.. గాజువాకలో అదిరిపోయే వినాయక మండపం!

ట్రావెల్ చేసేటప్పుడు ఇల్లు గుర్తుకొస్తోందా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి

ఇండోనేషియా To జపాన్.. భారత్ కంటే ముందే ఇతర దేశాల్లో గణపతి పూజ జరిగిందా?

Big Stories

Advertisement
×