E-Paper
Advertisement

ప్రయాణికులకు ఝలక్ ఇచ్చిన ఇండిగో.. ధరల పెంపుతో షాకైన ట్రావెలర్స్

ప్రయాణికులకు ఝలక్ ఇచ్చిన ఇండిగో.. ధరల పెంపుతో షాకైన ట్రావెలర్స్
Advertisement

IndiGo Airlines: ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. చిన్నారుల నుంచి లగేజీల వరకు అన్ని తారీఫ్‌లను పెంచినట్టు తెలుస్తోంది. అదనపు సామాను, శిశువులు, తోడులేని మైనర్లు, ఫాస్ట్ ఫార్వర్డ్ కోసం ప్రయాణికులపై వడ్డన మొదలు పెట్టింది. ఇప్పుడు ఆ వివరాలు ఒక్కసారి పరిశీలిద్దాం.

ప్రయాణికులకు ఝలక్ ఇచ్చిన ఇండిగో

దేశంలో విమాన సంస్థ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఇండిగో సంస్థ. దేశీయ మార్కెట్‌లో దాదాపు 66 శాతానికి పైగా వాటా కలిగివుంది. దేశీయంగా కాకుండా అంతర్జాతీయంగా విస్తరించింది. అందుకు అనుగుణంగా కొత్త కొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. 2028 నుండి తన విమాన సముదాయానికి వైడ్-బాడీ A350-900 విమానాలను చేర్చబోతోంది. ఇప్పటికే 900కు పైగా విమానాల తయారీ కోసం ఆర్డర్లు ఇచ్చింది. ప్రస్తుతం ఇండిగో వద్ద 430కి పైగా విమానాలు ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 2,200 విమాన సర్వీసులను నడుపుతోంది.

ధరల పెంపుతో షాకైన ట్రావెలర్స్

Advertisement

తాజాగా దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్.. శిశువుల ప్రయాణ రుసుముతోపాటు ప్రయారిటీ చెక్-ఇన్, అదనపు సామాను, ప్రయాణ ధృవపత్రాలతో సహా పలు సేవలపై ఛార్జీలను అమాంతంగా పెంచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విమానయాన సంస్థ నిర్వహణ ఖర్చుల ఆధారంగా తన ఛార్జీలను ఎప్పటికప్పుడు సవరిస్తుందని సమాచారం. శిశువులు, తోడులేని పిల్లలు, ప్రాధాన్యత చెక్-ఇన్, బోర్డింగ్, అదనపు సామాను, ప్రయాణ ధృవపత్రాలు వంటి సేవల కోసం ఇండిగో ఛార్జీలను పెంచింది. పసి పిల్లలతో టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు ఇదొక ఎదురుదెబ్బ.

వీటి ద్వారా ఏడాదికి రూ.90 కోట్లు వస్తుందని అంచనా

పసి పిల్లల ప్రయాణ రుసుమును రూ. 2,000 నుండి రూ.3,000 లకు పెంచేసింది. ఈ రుసుము రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వర్తిస్తుంది.అయితే శిశువులకు ప్రత్యేక సీట్లు ఉండవు. వాటిని తప్పని సరిగా బుక్ చేసుకోవాలి. ఈ మార్పు వల్ల సుమారు 10 లక్షల మందిపై ప్రభావం చూపవచ్చని ఓ అంచనా. ప్రయాణికులు అదనపు సామాను తీసుకెళ్తే వాటికి అదనపు రుసుము విధించబడుతుంది. గతంలో కిలోగ్రాముకు రూ. 700 ఉండేది. ఇప్పుడది రూ. 800 లకు పెరిగింది. ప్రతి అదనపు కిలోగ్రాముకు రూ. 100 ఎక్కువ భరించాల్సి వుటుంది.

Advertisement

ALSO READ: సముద్రం నుంచి చారిత్రక కట్టడాల వరకు.. హైదరాబాద్ నుంచి ట్రైన్‌లో వెళ్లగలిగే ప్రదేశాలు!

ప్రయాణికుడి వద్ద పరిమితి మించి అదనపు సామాను ఉంటే రుసుము పడుతుంది. అదనపు సామాను కోసం గతంలో రూ. 3,500 ఉండగా, ఇప్పుడు రౌండ్ ఫిగర్ రూ. 4,000 చెల్లించాల్సి ఉంటుంది. తోడు లేకుండా ప్రయాణించే మైనర్ల కోసం రూ.5,000 నుండి రూ. 5,999కి పెంచింది. ఇండిగో ప్రయారిటీ చెక్-ఇన్, బోర్డింగ్ రుసుమును రూ.450 నుండి రూ.650కి పెంచింది. ఈ సౌకర్యం కోసం ప్రయాణికులు అదనంగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ట్రావెల్ సర్టిఫికేట్ రుసుము కూడా రూ.200 నుండి రూ. 300కి పెంచేసింది సదరు విమాన సంస్థ. పెంచిన రుసుము ద్వారా విమానయాన సంస్థకు ఏడాదికి సుమారు రూ.90 కోట్ల అదనపు ఆదాయం సమకూరవచ్చని ఓ అంచనా.

పెరిగిన జెట్ ఇంధన ధరలు, యుద్ధం కారణంగా గగనతల మూసివేతలు, బలహీనపడుతున్న రూపాయి, నిర్వహణ ఖర్చులు పెరగడంతో అదనపు సేవల ఛార్జీలను సవరించాయి. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్, 2026 జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి క్వార్టర్ వన్ రూ. 382 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. గతేడాది ఇదే కాలంలో రూ. 2,161 కోట్ల నికర లాభం నమోదు చేసింది.

Related News

సముద్రం నుంచి చారిత్రక కట్టడాల వరకు.. హైదరాబాద్ నుంచి ట్రైన్‌లో వెళ్లగలిగే ప్రదేశాలు!

విదేశీ ప్రయాణమా? ఈ ఒక్క పాలసీ ఉంటే ఎన్నో సమస్యల నుంచి రక్షణ పొందొచ్చు!

మామూలు హాలీడేస్‌కు, మనసుకు ప్రశాంతతనిచ్చే వెల్నెస్ ట్రిప్స్‌కు తేడా ఏమిటి?

హైదరాబాద్ నుంచి వీకెండ్ ట్రిప్.. రూ.5,000లోపే వెళ్లొచ్చే 5 అద్భుతమైన ప్రదేశాలు!

రాయిలా నటిస్తూ.. ప్రపంచాన్నే బురిడి కొట్టిస్తున్న అరుదైన మెుక్క.. ఏమన్నా తెలివా?

ఖైరతాబాద్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఆ దానమే.. మూలమా?

హైదరాబాద్‌లోనే ఫారిన్ ఫీలింగ్.. ఇక్కడ అడుగు పెడితే 85 దేశాల అందాలు చూసేయొచ్చు!

Big Stories

Advertisement
×