E-Paper
Advertisement

హైదరాబాద్‌లోనే ఫారిన్ ఫీలింగ్.. ఇక్కడ అడుగు పెడితే 85 దేశాల అందాలు చూసేయొచ్చు!

హైదరాబాద్‌లోనే ఫారిన్ ఫీలింగ్.. ఇక్కడ అడుగు పెడితే  85 దేశాల అందాలు చూసేయొచ్చు!
Advertisement

Hyderabad’s Hidden Travel Gem:  హైదరాబాద్‌ లో ఉన్నా.. విదేశాల్లోని అందమైన టూరిస్ట్ స్పాట్‌ లోకి వెళ్లిన ఫీలింగ్ కావాలా? ప్రకృతి, ఆర్ట్, అడ్వెంచర్, ఫోటోగ్రఫీ.. ఇలా అన్నీ ఒకే చోట ఎక్స్ పీరియెన్స్ చేయాలనుందా? అటే, భాగ్యనగరం శివారులోని ఎక్స్‌ పీరియం పార్క్ కు వెళ్లాల్సిందే. చిల్కూర్ బాలాజీ ఆలయ రోడ్డుకు సమీపంలోని ప్రొద్దుటూరు గ్రామంలో సుమారు 150 ఎకరాల్లో ఈ పార్క్ కొలువైంది.

ఒక్క పార్కులోనే 85 దేశాల అందాలు

ఎక్స్‌ పీరియం ప్రత్యేకతల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఇక్కడి మొక్కలు. ప్రపంచంలోని 85 దేశాల నుంచి తీసుకొచ్చిన 25 వేలకు పైగా అరుదైన మొక్కలు, చెట్లు ఇక్కడ కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో నడుస్తుంటే మనం హైదరాబాద్‌లో ఉన్నామా? లేక ఏదైనా విదేశీ బొటానికల్ గార్డెన్‌లో ఉన్నామా? అనే అనుభూతి కలుగుతుంది. అర్జెంటీనా, స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ లాంటి దేశాల నుంచి సేకరించిన వృక్షాలు, సహజమైన రాళ్లు, ప్రత్యేకమైన ల్యాండ్‌ స్కేపింగ్ ఇట్టే ఆకట్టుకుంటాయి.

ప్రకృతి మధ్యలో ఆర్ట్.. అడుగు అడుగునా కొత్త ఫీల్!

Advertisement

ఇది కేవలం మొక్కలు, చెట్లు చూడటానికి మాత్రమే ఉన్న పార్క్ కాదు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ శిల్పాలు, చెక్క, లోహ కళాకృతులు, ప్రత్యేకమైన గార్డెన్ డిజైన్లు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హంపి శైలిని గుర్తు చేసే యాంఫీథియేటర్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 1,500 మంది కూర్చునేలా దీనిని రూపొందించారు.

బీచ్ నుంచి జిప్‌ లైన్ వరకు..

సాధారణ పార్కుల్లో కనిపించని అనుభూతులను కూడా ఎక్స్‌ పీరియం అందిస్తోంది. 12 ఎకరాల ఆర్టిఫీషియల్ బీచ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, జిప్‌ లైన్ లాంటి ఆకర్షణలు సందర్శకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. అందుకే కుటుంబంతో వెళ్లేవారికి మాత్రమే కాకుండా ఫ్రెండ్స్‌ తో ట్రిప్ ప్లాన్ చేసుకునేవారికి కూడా ఇది క్రేజీ స్పాట్‌గా మారింది.

ఫోటోగ్రఫీ ప్రియులకు స్పెషల్ అట్రాక్షన్

Advertisement

ఎక్స్‌ పీరియంలో ప్రత్యేకంగా ఆకట్టుకునే మరో అంశం ల్యాండ్‌ స్కేపింగ్. రంగురంగుల పూల తోటలు, భారీ చెట్లు, రాక్ గార్డెన్లు, శిల్పాలు, ప్రత్యేకమైన వాకింగ్ ప్రాంతాలు ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి మంచి బ్యాక్‌ డ్రాప్‌ ను అందిస్తాయి.  సోషల్ మీడియాలో ఫొటోలు, రీల్స్ షేర్ చేయాలనుకునేవారికి కూడా ఇక్కడ ఎన్నో స్పాట్లు కనిపిస్తాయి.

ఎంట్రీ ఫీజ్ ఎంత అంటే?

ఈ పార్క్ ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంటుంది. టికెట్ ధరలు పెద్దలకు సాధారణంగా రూ.700 నుంచి రూ.825 వరకు ఉంటుంది. పిల్లలకు రూ. 499 నుంచి రూ. 590 వరకు ఉంటుంది.

ఒకరోజు ట్రిప్‌ కు సరిపోయే డెస్టినేషన్!

హైదరాబాద్ నగరానికి దూరంగా వెళ్లకుండా ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారికి ఎక్స్‌ పీరియం ఒక ప్రత్యేకమైన ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడి విస్తీర్ణం, విదేశాల నుంచి తెచ్చిన మొక్కలు, భారీ కళాకృతులు, అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ కలిపి సాధారణ పార్క్ ఎక్స్ పీరియెన్స్ ను మించి ఉంటాయి. అందుకే  హైదరాబాద్‌లోనే ఉండి.. ఒకే చోట ఎన్నో దేశాల ప్రకృతి అందాలను చూడాలనుకునే వారికి ఎక్స్‌ పీరియం బెస్ట్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు.

Read Also: హైదరాబాద్ నుంచి అండమాన్ IRCTC ఫ్లైట్ టూర్.. ధర కూడా తక్కువేనండోయ్!

Tags

Related News

కైలాస పర్వతంపై అంతుచిక్కని 8 రహస్యాలు.. సైన్స్‌కే సవాల్ విసురుతున్న శివుని ఆవాసం!

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు‌లో తగ్గిన ప్రయాణికుల తాకిడి.. ఏకంగా 11 శాతం డౌన్, అవే కారణాలు

హైదరాబాద్ నుంచి అండమాన్ IRCTC ఫ్లైట్ టూర్.. ధర కూడా తక్కువేనండోయ్!

బడ్జెట్‌ లో ఊటీ ట్రిప్.. హైదరాబాద్ నుంచి IRCTC 6 రోజుల టూర్ ప్యాకేజీ!

జస్ట్ రూ. 95 వేలకే బాలి ట్రిప్.. హైదరాబాద్ నుంచి IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ!

సింగిల్ కమాండ్ తో టికెట్ బుక్ చేసిన ఏఐ.. ఇక IRCTCలో లాగిన్ అవసరం లేదా?

తక్కువ ధరలో IRCTC కాశ్మీర్ టూర్.. ఫ్లైట్, హోటల్, ఫుడ్ అన్నీ అందులోనే!

Big Stories

Advertisement
×