E-Paper
Advertisement

రాయిలా నటిస్తూ.. ప్రపంచాన్నే బురిడి కొట్టిస్తున్న అరుదైన మెుక్క.. ఏమన్నా తెలివా?

రాయిలా నటిస్తూ.. ప్రపంచాన్నే బురిడి కొట్టిస్తున్న అరుదైన మెుక్క.. ఏమన్నా తెలివా?
Advertisement

Living Stones: ప్రకృతిలో ఎన్నో వింతలు, విచిత్రాలు దాగి ఉన్నాయి. అయితే ఇన్నాళ్లు శత్రువుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి జంతువులు, పక్షులు రంగులు మార్చడం చూస్తూనే వచ్చాం. కానీ ఒక మొక్క ఏకంగా రాతి రూపంలోకి మారిపోయి, తన నటనతో ప్రపంచాన్నే బురిడి కొట్టిస్తుందంటే నమ్మగలరా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ విచిత్ర నటనకు గానూ ఆ మొక్కకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. అయితే తనను తాను కాపాడుకునేందుకు ఇంత గొప్పగా నటిస్తున్న ఈ వింత మొక్క ప్రస్తుతం కనుమరుగైపోయే ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో ఆ మెుక్కకు సంబంధించిన విశేషాలను ఈ కథనంలో చూద్దాం.

జీవించే రాళ్లు.. ‘లిథాప్స్’!

ఆఫ్రికా ఖండంలోని నమీబియా, దక్షణాఫ్రికా, బోట్స్‌వానా ప్రాంతాల్లో కనిపించే ఈ మొక్కల సైంటిఫిక్ నేమ్ ‘లిథాప్స్’ (Lithops). వీటిని స్థానికులు ‘లివింగ్ స్టోన్స్’ లేదా ‘పెబుల్ ప్లాంట్స్’ అని పిలుస్తారు. చిన్నపాటి వేళ్ళు, నీటిని దాచుకునే రెండు మందపాటి ఆకులతో ఇవి హాయిగా రాళ్ల మధ్య పెరిగిపోతాయి. చూసేందుకు, తాకేందుకు అచ్చం చిన్న చిన్న రాళ్లలాగే ఉండటం వీటి ప్రత్యేకత. దీంతో వీటి మీదుగా వెళ్లే జంతువులు గానీ, మనుషులు గానీ ఇవి మొక్కలనే విషయాన్ని అస్సలు గుర్తుపట్టలేరు.

అతి అరుదైన జాతి..

Advertisement

లిథాప్స్ జాతిలోనే అతి అరుదైనది ‘లిథాప్స్ వెర్నెరి’ (Lithops werneri). నమీబియాలోని ఎరోంగో పర్వత శ్రేణుల్లో కేవలం 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఇవి పెరుగుతాయి. అక్కడి గ్రానైట్ రాతి పొరలపై 2 సెంటీమీటర్ల విస్తీర్ణంలో ఇవి అమరిపోతాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) సమాచారం ప్రకారం.. 1981 నాటితో పోలిస్తే వీటి సంఖ్య ఏకంగా 80 శాతానికి పైగా తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రపంచమంతా కలిపి ఇవి 200 కంటే తక్కువ సంఖ్యలోనే మిగిలి ఉన్నాయి.

మాయమై.. మళ్ళీ వెలుగులోకి..

1950లలో శాస్త్రవేత్తలు ఈ మొక్కను మొదటిసారిగా గుర్తించారు. ఆ తర్వాతి కాలంలో ఆసియా, యూరప్ దేశాల మొక్కల ప్రేమికులు వీటి రూపానికి ముచ్చటపడి విచ్చలవిడిగా తమ వెంట తీసుకుపోవడంతో ఇక అవి అంతరించిపోయాయని అంతా భావించారు. అయితే సుదీర్ఘ అన్వేషణ తర్వాత 2012లో పరిశోధకులు మళ్లీ వీటిని పాత స్థానంలోనే కనుగొన్నారు. 2012లో జరిపిన గణనలో 659 మొక్కలు ఉండగా 2019 నాటికి ఆ సంఖ్య 118కి పడిపోయింది. 2020లో సేకరించిన లెక్కల ప్రకారం ప్రస్తుతం ఇవి 163 మాత్రమే ఉన్నట్లు తేలింది.

Advertisement

Also Read: అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేస్తోన్న Samsung Galaxy Tab S12.. లాంచ్ డేట్ లీక్!

వాతావరణ మార్పులే అతిపెద్ద ముప్పు

వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పులు ఈ అరుదైన రాతి మెుక్కలను దెబ్బతీస్తున్నాయి. కరువులు వచ్చినప్పుడు నీళ్లు దొరక్క వేళ్లు ఎండిపోవడం, జంతువులు ఆకలితో వీటిని తినడానికి ప్రయత్నించినప్పుడు నేల నుండి ఊడిపోయి చనిపోవడం జరుగుతోంది. అలాగని వర్షాలు పడితే తట్టుకుంటాయా అంటే అదీ లేదు. భారీ వర్షాలు పడినప్పుడు ఆ చిన్న రాతి గులకలతో పాటు ఇవి కొట్టుకుపోతున్నాయి. దీనికి తోడు అక్రమ రవాణా దారుల కన్ను వీటిపై పడటంతో ఈ అరుదైన ‘రాతి మెుక్క’ శాశ్వతంగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.

Also Read: డేంజర్‌లో మెట్రో.. పిల్లర్లను తవ్వేస్తున్న బడాబాబులు, కళ్లు మూసుకున్న అధికారులు!

Tags

Related News

ఖైరతాబాద్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఆ దానమే.. మూలమా?

హైదరాబాద్‌లోనే ఫారిన్ ఫీలింగ్.. ఇక్కడ అడుగు పెడితే 85 దేశాల అందాలు చూసేయొచ్చు!

కైలాస పర్వతంపై అంతుచిక్కని 8 రహస్యాలు.. సైన్స్‌కే సవాల్ విసురుతున్న శివుని ఆవాసం!

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు‌లో తగ్గిన ప్రయాణికుల తాకిడి.. ఏకంగా 11 శాతం డౌన్, అవే కారణాలు

హైదరాబాద్ నుంచి అండమాన్ IRCTC ఫ్లైట్ టూర్.. ధర కూడా తక్కువేనండోయ్!

బడ్జెట్‌ లో ఊటీ ట్రిప్.. హైదరాబాద్ నుంచి IRCTC 6 రోజుల టూర్ ప్యాకేజీ!

జస్ట్ రూ. 95 వేలకే బాలి ట్రిప్.. హైదరాబాద్ నుంచి IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ!

Big Stories

Advertisement
×