Illu Illalu Pillalu Today Episode September 18th: భద్రావతి ఎలాగైనా సరే ధీరజ్ ప్రేమని విడగొట్టాలి అని అనుకుంటుంది. ధీరజ్ని ప్రేమని విడగొడితే ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్లు నా మేనకోడానికి పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటుంది. విశ్వం పెళ్లిచూపులు కోసం బంధువులు వస్తున్నారని ప్రేమతో చెప్పి అంత సిద్ధం చేస్తారు. ధీరజ్ దగ్గరికి వెళ్ళగానే అది ప్రేమ కోసం వచ్చిన పెళ్లిచూపులు అని చెప్పేలా చేయాలని భద్ర ప్లాన్ చేస్తుంది.. ధీరజ్ ప్రేమను విడగొట్టడానికి ఇదే ఆఖరి రోజు అని భద్ర పక్క ప్లాన్ చేస్తుంది ఎలాగైనా సరే ధీరజ్ నేను రెచ్చగొట్టి ప్రేమ మనసులో కోపాన్ని పెంచాలి అని అనుకుంటుంది. ఇంటికి వచ్చిన బంధువులందరితో ప్రేమ భర్త గురించి గొప్పగా చెప్తుంది భద్రావతి. కానీ ప్రేమ వాళ్లు మాత్రం వాళ్ళ దగ్గర పరువు పోకూడదు అని మౌనంగా ఉండిపోతారు.
ధీరజ్ బయట వెళ్తుండగా అక్కడ ఉన్న భద్రావతి బంధువులు అమ్మాయి చాలా అందంగా ఉంది కదూ.. అమ్మాయి నిజంగా బాగుంది కుందనపు బొమ్మలాగా ఉంది మన అబ్బాయికి ఈడు జోడు అని వాళ్ళు అనగానే ధీరజ్ ఆ మాటలు వింటాడు.. ఎవరికి పెళ్లి చూపులు అని అడగగానే ప్రేమకు పెళ్లిచూపులు అని వాళ్ళు చెప్తారు. భద్ర ప్లాన్ ప్రకారం అంత జరుగుతుండడంతో చాలా ఆవేశంగా లోపలికి వస్తారు. అయితే ధీరజ్ అంత కోపంగా రావడం చూసిన భద్ర ఈరోజు ప్రేమ ధీరజులు కచ్చితంగా గొడవపడతారు అని అనుకుంటుంది.. ప్రేమకు నిజంగానే పెళ్లి చూపులేము అని చాలా ఆవేశంగా ఇంట్లో అంత రచ్చ చేస్తాడు అయితే ఎవరు ఎంత చెప్తున్నారు సరే.. ధీరజ్మా త్రం అసలు వినకుండా అక్కడ మొత్తం గొడవ చేయడంతో ప్రేమ షాక్ అవుతుంది..
ప్రేమ ఎంత చెబుతున్న కూడా వినకుండా ధీరజ్ బద్రావతి ఇంట్లో రచ్చ రచ్చ చేస్తాడు. నా భార్యకు పెళ్లిచూపులు చూస్తారా మీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యకు పెళ్లి చూపులు అని ధీరపు మాట ఎవరు చెప్పిన వినకుండా ఇంట్లోనే వస్తువులన్నీ పడేసి అందరి దగ్గర అవమానించడం మాట్లాడుతాడు. అసలు నా భార్యకి పెళ్లి చూపులు అరేంజ్ చేసింది ఎవరు అంటూ చాలా కోపంగా ఉంటాడు అయితే.. అడ్డుగా వచ్చిన వస్తే ఏమని కొడతాడు బద్రకు వార్నింగ్ కూడా ఇస్తాడు ధీరజ్.. ఆడదానివి పోయి బతికి పోయావు లేదంటే మాత్రం నిన్ను కూడా కొట్టేవాణ్ణి అని ధీరజ్ అనగానే భద్రావతి కొత్త డ్రామా ని మొదలు పెడుతుంది. తన డ్రామాని అర్థం చేసుకోలేని ధీరజ్ పెళ్లిచూపులు నిజమే అనుకొని అక్కడ ఉన్న వాళ్ళ అందరితో అసభ్యంగా మాట్లాడతాడు ఇక ప్రేమ ఆవేశంగా తనని నువ్వు ముందు బయటికి వెళ్ళు అని మెడ పట్టుకొని తీసుకొని వస్తుంది.
ధీరజ్ ని కాలర్ పట్టుకుని ప్రేమ బయటకు తీసుకురావడం చూసిన శ్రీవల్లి ఇది చాలా అద్భుతమైన సీను ఇది నేను ఒక్కదాన్నే చూస్తే బాగోదు అస్సలు తట్టుకోలేకపోతున్నాను. తన ఆత్రుతతో ఇంట్లోని వాళ్ళందరిని పిలుస్తుంది అయితే ధీరజ్ని మెడ పట్టుకొని రావడం చూసిన రామరాజు వాళ్ళందరూ బయటకి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అసలు ఏం జరిగింది? ఎందుకు ధీరజ్ని ఇలా కాలర్ పట్టుకుని బయటకు తీసుకుని వచ్చావు అని రామరాజు కూడా అడుగుతాడు. ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరగడం చూసిన శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఇలా గొడవలు జరగడం నేను అస్సలు ఊహించలేదు నిజంగా ఇది నాకు పట్టరాని సంతోషాన్ని ఇస్తుంది అంటూ శ్రీవల్లి పొంగిపోతూ ఉంటుంది.
నేను వెళ్లి కొట్టిన విషయమే చెప్తుంది కానీ అక్కడ జరిగిన విషయం ఏంటో చెప్పట్లేదు అనే ధీరజ్ అంటాడు అసలు ఏం జరిగింది రామరాజు అడుగుతాడు. అయితే ప్రేమకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు నాన్న అందుకే నేను వెళ్లి కొట్టాను అని అనగానే రామరాజు ఇంకాస్త ఆవేశంతో ఊగిపోతాడు. నా కోడలికి పెళ్లి సంబంధం ఏర్పాటుచేసింది ఎవర్రా ఊరుకున్నాను కదా అని నోరు మూసుకొని ఉంటాను అని అనుకోవద్దు అసలు నా కోడల్ని మీ ఇంట్లో ఉంచడం తప్పు. కానీ ఇప్పుడు పెళ్లి కూడా చేయాలని చూస్తారా అని రామరాజు కూడా రెచ్చిపోయి సేనని కొడతాడు మొత్తానికి ఇరు కుటుంబాల మధ్య ఒక పెద్ద రచ్చ జరుగుతుంది.. పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాలి అని రామరాజు అంటాడు ఇక వాళ్ళ పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళుతుంది.
పోలీస్ స్టేషన్ కి వెళ్లిన రెండు కుటుంబాలు పాతికేళ్ల నుంచి జరిగిన గొడవల గురించి అన్ని కలిపి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు వీళ్ళ గొడవని విన్న ఎస్ఐ కూడా చాలా భయపడిపోతూ షాక్ లో ఉండిపోతాడు. అంత పెద్ద కంప్లైంట్ నా జీవితంలోని చూడలేదు అని ఎస్ఐ కూడా వాటిని చూసి భయపడిపోతాడు. అసలు ఏం జరిగింది మీరు ఎందుకు ఇలాంటి కంప్లైంట్ రాస్తున్నారు అని ఎంతగా అడుగుతున్నా సరే ఎవరు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అయితే పోలీస్ స్టేషన్కు వెళ్లిన విషయాన్ని నర్మదకు చెప్పగానే నర్మదా పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళుతుంది. నర్మదా అక్కడ ఉన్న వాళ్ళని అడిగి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..