E-Paper
Advertisement

విశాఖ–నరసాపురం రూట్‌ లో రైళ్లు నడపండి, కేంద్రానికి DRUA డిమాండ్!

విశాఖ–నరసాపురం రూట్‌ లో రైళ్లు నడపండి, కేంద్రానికి DRUA డిమాండ్!
Advertisement

Visakhapatnam–Narasapuram Train Services: కోవిడ్-19 తర్వాత నిలిచిపోయిన రైలు సర్వీసులు ఇప్పటికీ తిరిగి ప్రారంభించడంతో విశాఖపట్నం- నరసాపురం మధ్య ప్రయాణించే ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దువ్వాడ రైల్వే వినియోగదారుల సంఘం (DRUA) ఈ కీలక రైలు సేవలను వెంటనే తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం, రైల్వే బోర్డును కోరింది. ఈ మేరకు సంఘం గౌరవ అధ్యక్షుడు కాటం ఎస్.ఎస్. చంద్రారావు వినతిపత్రాన్ని సమర్పించారు. విజయవాడ డివిజన్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యుడు జక్కంపూడి శ్రీకుమార్‌కు ఈ వినతిని అందజేశారు. ఇందులో ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, దక్షిణ కోనసీమ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రయాణ సమస్యలను వివరించారు.

కోవిడ్ తర్వాత రైలు సర్వీసుల నిలిపివేత

గతంలో విశాఖపట్నం- నరసాపురం మధ్య రైల్వే కనెక్టివిటీ ఉండేది. పగటిపూట నడిచే సింహాద్రి ఎక్స్‌ ప్రెస్, రాత్రిపూట పూరీ–తిరుపతి ఎక్స్‌ ప్రెస్ లాంటి రైళ్లు ఈ ప్రాంతాలను కలిపేవి. కానీ, కోవిడ్ తర్వాత ఈ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ రెండు ప్రాంతాల మధ్య నేరుగా ప్రయాణించే సౌకర్యం లేకపోవడం వల్ల, ప్రజలు మార్గమధ్యంలో రైళ్లు మార్చుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు, పర్యాటకులకు కష్టంగా మారింది. తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం లేకపోవడంతో, వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ఖర్చులు, సమయం రెండూ పెరుగుతున్నాయి.

ఆ రైళ్లను తిరిగి ప్రారంభించాలి!

Advertisement

దేశవ్యాప్తంగా రైల్వే అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పటికీ, ఈ ముఖ్యమైన రూట్‌ లో ఇంకా సేవలు పునరుద్ధరించకపోవడం విచారకరం అని వినియోగదారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నరసాపురం–సింహాద్రి లింక్ ఎక్స్‌ ప్రెస్, నరసాపురం–మచిలీపట్నం–విశాఖపట్నం లింక్ ఎక్స్‌ ప్రెస్ లాంటి రైళ్లు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేసింది.  అలాగే, తూర్పు తీర రైల్వే అధికారులు అధికార పరిధి సమస్యలను కారణంగా చూపుతున్నారని, కానీ, అలాంటి పరిపాలనా సమస్యలు ప్రయాణికుల సౌకర్యానికి అడ్డంకిగా మారకూడదని సంఘం అభిప్రాయపడింది.

ఈ సమస్యకు పరిష్కారంగా పగటిపూట నడిచే నరసాపురం–విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను తిరిగి ప్రారంభించాలని సూచించింది. అదనంగా, భీమవరం జంక్షన్ వద్ద విశాఖపట్నం–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు అనుసంధానం కల్పించేలా స్లీపర్, ఏసీ, జనరల్ కోచ్‌లతో కూడిన రేక్ ఏర్పాటు చేయాలని కోరింది.

ఈఎంయూ సర్వీస్‌ నరసాపురం వరకు పొడిగించండి!

Advertisement

అటు  విశాఖపట్నం–రాజమండ్రి ఈఎంయూ సర్వీస్‌ను నరసాపురం వరకు పొడిగించాలని వినియోగదారుల సంఘం సూచించింది. ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడేలా విశాఖపట్నం నుంచి పలాస లేదంటే రాయగడ వరకు కొత్త రైలు సర్వీసులను ప్రారంభించాలని కూడా డిమాండ్ చేసింది.  ప్రత్యేకంగా వృద్ధులు, గర్భిణీలు, దివ్యాంగులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని సంఘం తెలిపింది.

Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఆ ప్రాంతానికి 3 వీక్లీ రైళ్లు!

Related News

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

Big Stories

Advertisement
×