E-Paper
Advertisement

ప్రయాణీకులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఆ ప్రాంతానికి 3 వీక్లీ రైళ్లు!

ప్రయాణీకులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఆ ప్రాంతానికి 3 వీక్లీ రైళ్లు!
Advertisement

Secunderabad–Belagavi Weekly Express Trains: తెలంగాణ, కర్ణాటయ మధ్య రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్- బెళగావి మధ్య వీక్లీ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న మూడు సర్వీసులను, ఇప్పుడు వారానికి ఒకసారి నడిచే రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు సౌకర్యం పెరగడంతో పాటు, రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లకు కొత్త నెంబర్లు కేటాయింపు

సికింద్రాబాద్–బెళగావి మధ్య నడిచే ప్రత్యేక రైలు (07335/07336)కి ఇప్పుడు కొత్త నంబర్లు కేటాయించారు. ఈ రైలు ఇకపై 17073/17074గా నడుస్తుంది. ప్రతి సోమవారం సాయంత్రం 4:30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మంగళవారం ఉదయం 10:30 గంటలకు బెళగావి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, మంగళవారం మధ్యాహ్నం 1:00 గంటలకు బెళగావి నుంచి బయలుదేరి, బుధవారం ఉదయం సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ సర్వీస్ ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారం, వ్యక్తిగత పనుల కోసం తరచుగా ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

Advertisement

అటు హైదరాబాద్–బెళగావి మధ్య నడిచే మరో సర్వీస్ కూడా రెగ్యులర్ వీక్లీ రైలుగా మారింది. ఈ రైలు 17071/17072 నంబర్లతో ప్రతి గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరి, శుక్రవారం ఉదయం బెళగావి చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ సర్వీస్ కూడా ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమయాన్ని సర్దుబాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇక మూడవ సర్వీస్ చర్లపల్లి–బెళగావి మధ్య నడుస్తుంది. 17075/17076 నంబర్లతో ఈ రైలు ప్రతి శనివారం చర్లపల్లి నుంచి బయలుదేరి, ఆదివారం బెళగావి నుంచి తిరిగి వస్తుంది. నగర పరిసర ప్రాంతాల నుంచి ప్రయాణించే వారికి ఈ రైలు అదనపు సౌకర్యాన్ని కల్పిస్తుంది.

Advertisement

Read Also: విమానంలా రైల్లో సీటు సెలెక్షన్ ఉండదు, కారణం ఏంటంటే?

ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?

ఈ మూడు రైళ్లు వారానికి ఒక్కసారి నడిచే విధంగా ప్రణాళిక చేశారు. మార్గమధ్యంలో బళ్లారి, హుబ్బళ్లి, గడగ్, ధార్వాడ్, లోండా లాంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఈ స్టాప్స్ వల్ల ఉత్తర కర్ణాటక ప్రాంత ప్రజలకు కూడా హైదరాబాద్ వైపు ప్రయాణం చేయడం సులభమవుతుంది. రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం మాత్రమే కాదు, వాణిజ్య, విద్య, పర్యాటక రంగాలకు కూడా మేలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా బెళగావి, హుబ్బళ్లి లాంటి నగరాలకు హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ రైళ్లకు సంబంధించిన  ప్రారంభ తేదీలను రైల్వే శాఖ త్వరలో ప్రకటించనుంది.

Read Also: రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. అరగంట ముందు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు!

Related News

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

Big Stories

Advertisement
×