E-Paper
Advertisement

Kerala Elections: ఇండియా కూటమిలో చిచ్చు.. కేరళ ఫలితాలు జాతీయ పొత్తులను శాసించేనా..?

Kerala Elections: ఇండియా కూటమిలో చిచ్చు.. కేరళ ఫలితాలు జాతీయ పొత్తులను శాసించేనా..?

Kerala Elections: స్వేచ్ఛ బ్యూరో: కేరళ పబ్లిక్ కు తెలంగాణ గ్యారంటీ అంటూ ఇక్కడ హామీల అమలు తీరు, ప్రభుత్వ పనితీరును వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ కేరళం ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నది. కర్ణాటక తర్వాత తెలంగాణలో పవర్ లోకి వచ్చినట్లు, ఇప్పుడు కేరళలో కూడా రాబోతున్నట్లు టీ కాంగ్రెస్ నేతలు అక్కడ ఎన్నికల ప్రచారంలో భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు తెలంగాణ మంత్రులు కేరళంలో ఇదే స్లోగన్ ఎత్తుకున్నారు.

సీఎం సవాల్..

యూడీఎఫ్​ కు సపోర్టుగా ఉండాలని, ప్రజల మద్ధతుతో ఇచ్చిన హామీలన్నీ వంద శాతం అమలు చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కేరళం ఎన్నికల ప్రచారంలో వివరించారు. అనుమానం ఉన్నవాళ్లు తెలంగాణకు వచ్చి విజిట్ చేయాలని సీఎం సవాల్ విసిరారు. దీనిపై కాంగ్రెస్ కూటమీ, ఎల్ డీఎఫ్​ కూటమీ మధ్య విమర్శలు మొదలయ్యాయి. కేరళం ఎన్నికల ప్రచారంలో యూడీఎఫ్​ తెలంగాణ లోని ప్లస్ అంశాలను వివరిస్తూ ముందుకు సాగుతుంటే, ఎల్ డీఎఫ్​ మాత్రం ఇక్కడి ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ ప్రచారన్ని విస్తృతం చేసింది. కేరళం ఎన్నికల్లోనూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సెంటర్ పాయింట్ కావడం దేశ రాజకీయాల్లో చర్చంశనీమైంది. పొలిటికల్ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.

అక్కడ శత్రువుల్లా.. ఇక్కడ దోస్తీలా..

ఢిల్లీలో ‘ఇండియా’ కూటమిలో భాగస్వాములుగా ఉంటూ, దేశం కోసం ఒకే వేదికపై కరచాలనం చేసుకునే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పొలిటికల్ గా ప్రదర్శిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. కేరళం ఎన్నికల్లో శత్రువుల్లా ఫైట్ చేస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు , తెలంగాణలో మిత్రపక్షంగా ముందుకు సాగడం గమనార్హం. కేరళ ఎన్నికల్లో బద్ధ శత్రవులుగా ఫైట్ చేస్తూ, ఇక్కడ ఈ రెండు పార్టీ మిత్రధర్నాన్ని పాటించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రూఫ్​ గా చూపిస్తూ కాంగ్రెస్ కేరళంలో విస్తృతంగా పర్యటిస్తున్నది.

Also Read: టోమోలో వసూళ్ల పర్వం.. అడ్వర్టైజింగ్ రంగంలో లీగల్ దందా..!

మేము చెప్పింది చేస్తాం..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను కేరళ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ బలంగా వాడుకుంటోంది. ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణం రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను కేరళ ప్రజల ముందు ఉంచుతూ, “మేము చెప్పింది చేస్తాం” అని నిరూపించుకోవడానికి తెలంగాణను ఒక ‘లివింగ్ ఎగ్జాంపుల్’గా చూపిస్తోంది. కర్ణాటక తర్వాత తెలంగాణలో సాధించిన విజయం కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, ఇదే ఉత్సాహంతో కేరళలోని ఎల్డీఎఫ్ కోటను బద్దలు కొట్టాలని హస్తం పార్టీ వ్యూహరచన చేస్తోందని ఏఐసీసీ నాయకులు చెప్తున్నారు. అయితే ఈ ద్వంద్వ విధానాలు ఏ పార్టీకి ప్లస్ చేస్తాయనేది త్వరలోనే తేలిపోనున్న ది.

లోపాలను టార్గెట్..?

వాస్తవానికి స్థానికంగా ఉండే సమస్యలు, పరిష్​కారాలు, హామీలు, అమలు తీరు వంటి అంశాలతో మొదట ఎల్ డీఎఫ్​,యూడీఎఫ్​ లు తమ ప్రచారాన్ని మొదలు పెట్టాయి. తెలంగాణ నాయకులు ఈ ప్రచారంలో భాగస్వామ్యం కాగానే, పొలిటికల్ లైన్లన్నీ మారిపోయాయి. అక్కడ హామీలను బలపరుస్తూనే భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రూఫ్​ గా చూపిస్తున్నారు. పైగా విజయన్ ను కేసీఆర్ తో పోల్చడంతో రెండు కూటమీలు ఇక్కడి రాష్ట్రాన్నే కార్నర్ చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణను మోడల్‌గా చూపిస్తుంటే, కేరళలోని అధికార లెఫ్ట్ ఫ్రంట్ మాత్రం ఇక్కడి వైఫల్యాలను ఎండగడుతోంది.

కాంగ్రెస్ పాలనలో..

తెలంగాణలో రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదని, కొన్ని గ్యారంటీలకు నిధుల కొరత ఉందనే అంశాలను కేరళ కమ్యూనిస్టు నాయకులు ప్రచార అస్త్రాలుగా చేసుకుంటున్నారు.అంతేగాక కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో తలెత్తుతున్న చిన్న చిన్న ఇబ్బందులను కూడా భూతద్దంలో చూపిస్తూ, కేరళ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం వెలుగు మట్ల, హైడ్రా వంటి అంశాలను ఎల్ డీఎఫ్​ లు అక్కడి ఎన్నికల ప్రచారంలో విరివిగా వాడుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వింత పోకడలు నెలకొన్నాయని తెలంగాణలోనూ, ఇటు కేరళలోనూ క్షేత్రస్థాయి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

Also Read: Palnadu: ఆత్మహత్యకు సిద్ధమైన ఫ్యామిలీ.. పోలీసులు వారిని ఎలా కాపాడారంటే?

పొత్తుల పరిస్థితి ఏమిటో..?

బీజేపీని అడ్డుకోవడానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఒక్కటే అని ఆ పార్టీ ముఖ్యలీడర్లే చెప్తుంటారు. కానీ కేరళం, తెలంగాణలో ఈ రెండు పార్టీలు విభిన్న తీరుతో ముందుకు సాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో సీపీఐ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది.కానీ కేరళలో మాత్రం ఈ రెండు కూటమీల మధ్యే ప్రధాన పోటీగా మారింది. పైగా కేరళ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమి భవిష్యత్తును శాసించే అవకాశం కూడా ఉన్నది. ఒకవేళ కేరళలో కాంగ్రెస్ పుంజుకుంటే, కూటమిలో ఆ పార్టీ ఆధిపత్యం పెరుగుతుంది.కానీ, ఈ పరస్పర విమర్శలు శ్రుతి మించితే, ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తే ఈ రెండు పార్టీల మధ్య ‘సయోధ్య’ కుదరడం సవాలుగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

దేవుడి స్వంత ఆస్తికే రక్షణ లేదు.. ఇంకా ప్రజలకా సీఎం రేవంత్ రెడ్డి

“కేరళంలో దేవుడి ఆస్తికీ రక్షణ లేదు. కేరళంలో గత ప‌దేళ్లుగా పినరాయి విజయన్ ప్రభుత్వం కొనసాగుతోంది.అలాగే 2014 నుంచి సుమారు ప‌దేళ్ల పాటు కేసీఆర్ తెలంగాణను పాలించారన్నారు. పినరాయి కుటుంబ పాలన, అవినీతి, అస‌మ‌ర్థ పాల‌న విష‌యంలో పిన‌రాయి విజ‌య‌న్‌, కేసీఆర్‌ల మ‌ధ్య అనేక పోలిక‌లు ఉన్నాయి. 2023లో తెలంగాణలో మాదిరి మార్పే ఈసారి కేరళంలో చోటు చేసుకుంటుంది. పినరాయి విజ‌య్ ప్రభుత్వాన్ని ప్ర‌జ‌లు గ‌ద్దె దింపుతారు. యూడీఎఫ్​ మేనిపెస్టో అద్భుతంగా ఉన్నది. ప్రజలను ఆకట్టుకుంటుందని భావిస్తున్నా. ”అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

విమర్శలు చేస్తారా?

తెలంగాణను ముందు అభివృద్ధి చేసుకోండి.. కేరళ ఎప్పుడో అభివృద్ధి చెందింది: కేరళ సీఎం పినరయి విజయన్
‘‘తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్‌తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా?, కేరళలో కేవలం 0.55 శాతం మాత్రమే పేదరికమే ఉంది. అది దేశంలోనే తక్కువ. కేరళలో రాజకీయ ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు, ఆ డబ్బులు తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేయండి. 2025లో తెలంగాణ అధికారులు కేరళకు వచ్చి, ఇక్కడ డిజిటల్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నారు. జీతాలు, పెన్షన్లు ఆలస్యం చేసే ప్రభుత్వం కేరళలో మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సంక్షేమం, మంచి పాలన నేర్చుకోవాలంటే కేరళకు రండి’’ అంటూ సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు.

Also Read:  Jagruti Party: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు.. తెలంగాణ జాగృతి పార్టీ పోస్టర్ ఆవిష్కరణ!

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×