E-Paper
Advertisement

ఇండియాకు తిరిగి రావద్దు.. నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు, నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం..

ఇండియాకు తిరిగి రావద్దు.. నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు, నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం..
Advertisement

Kasthuri Shankar : టాలీవుడ్ సినీనటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలు, సీరియల్స్ లతో బాగా పాపులర్ అయ్యింది.. ఒకప్పుడు కేవలం సినిమాలు మాత్రమే చేసే ఈమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బుల్లితెర సీరియల్స్లలో తన సత్తాని చాటుతూ వస్తుంది.. ఈమె నటించిన సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఇదిలా ఉండగా.. ఈమె ఈమధ్య వరుస వివాదాలలో తలదురుస్తూ వార్తల్లో నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. ఇటీవల కాలంలో ఆమె ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటూ వస్తుంది. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది..? కస్తూరి ఏం చేసింది అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జోహో శ్రీధర్ వెంబు ట్వీట్..

ప్రముఖ పారిశ్రామిక వేత్త జోహో వ్యవస్థాపకుడు సీఈఓ శ్రీధర్ వెంబు అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో ఆయన ఇండియాకు తిరిగి వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు..దీనికి సంబంధించి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. అందులో తన 37 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. అమెరికాలో భారతీయులు పడుతున్న అవస్థలు కూడా చాలా ఉన్నాయి. రాజకీయంగా జరుగుతున్న అనేక వివాదాల్లో ప్రవాస భారతీయులు నలిగిపోతున్నారు.. మనం సత్తాని చాటాలంటే విదేశాల్లో మాత్రమే కాదు మన దేశంలో మనం ఏంటో నిరూపించుకోవాలి. ప్రపంచంలో గౌరవం, భద్రత, అభివృద్ధి అన్నీ టెక్నాలజీపైనే ఆధారపడి ఉన్నాయని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు… మీరందరూ దయచేసి ఇండియాకు రండి అంటూ ఆయన ఆ పోస్టులో రాసుకొచ్చారు.. ఆ పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఆయన పోస్ట్ పై నటి కస్తూరి రియాక్ట్ అయ్యారు. ఆమె ఆయన ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం అది చర్చనీయాంశంగా మారింది..

భారత్ లో నిజాయితీగా ఉంటే శిక్షలు వేస్తారు..

Advertisement

జోహో సీఈఓ ట్వీట్ పై నటి కస్తూరి రిప్లై ఇచ్చింది.. ఆమె తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో.. నేను అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చాను. ఇక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించలేదు. అయిన మాది అని ఇక్కడే ఉంటున్నాం. కొంతమంది మాత్రం తిరిగి మళ్ళీ అమెరికాకు వెళ్లారు. ఇక్కడ మాకు ఏదో అవకాశాలు ఉంటాయి అని నిత్యం పోరాడుతూనే ఉన్నాం. ఈ దేశంలో వ్యాపారాలు చెయ్యడం అంత సులువు కాదు. ఇక్కడ నిజాయితీగా ఉండటం కష్టం.. భాద్యత అన్నది ఉండదు. కోటీశ్వరుడు తనకు నచ్చినట్లు చేస్తాడు. ప్రభుత్వ పథకాల పేరుతో ఏదో చేస్తాడు. అది చూస్తే ఒక్కోసారి నాకు బాధ కలుగుతుంది.

ప్రభుత్వ అధికారులు ధనిక, పేద అనే తేడా లేకుండా దోచుకోవడం, దోపిడీ చేస్తారు అది చూస్తే నా రక్తం మరిగిపోతుంది. తల్లితండ్రులు తమ కుల పత్రాలను తారుమారు చేయడాన్ని చూసినప్పుడల్లా నా సంకల్పం సన్నగిల్లుతుంది.. నిజానికి భారతదేశం సామాజిక అన్యాయానికి గురైంది.. ఇక్కడ యోగ్యత ఓటు రాజకీయాల ద్వారా తొలగించబడుతుంది.. ఇక్కడ న్యాయం జరగదు. నా పై ఫేక్ క్రిమినల్ కేసులు పెట్టారు.. ఇక్కడ నిస్వార్థ సామాజిక యోధుల కోసం ఈ దేశం ఏమి చేసింది దుర్మార్గపు మరణాలు తప్ప ఇంకేం లేదు.. ఇక్కడ ఎవరికి న్యాయం జరుగుతుంది? అంటూ కస్తూరి ట్వీట్ లో రాసుకొచ్చింది.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మరి కస్తూరి ట్వీట్ పై జనాలు ఎలా స్పందిస్తారో చూడాలి..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలుకు క్లాస్ పీకిన సత్యం.. బాలు మాటతో మీనా షాక్.. అడ్డంగా బుక్కయిన మనోజ్..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×