E-Paper
Advertisement

IRCTC Tour Package: మాతా వైష్ణోదేవిని దర్శించుకోవాలనుందా? అయితే, మీకో గుడ్ న్యూస్!

IRCTC Tour Package: మాతా వైష్ణోదేవిని దర్శించుకోవాలనుందా? అయితే, మీకో గుడ్ న్యూస్!
Advertisement

IRCTC Mata Vaishnodevi Tour Package:

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాతా వైష్ణోదేవిని దర్శించుకోవాలనుకునే పర్యాటకుల కోసం  ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ఖర్యులో సౌకర్యవంతంగా వెళ్లే అవకాశం కల్పిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలను IRCTC సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ప్రయాణం ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. పర్యాటకులు వారి అవసరాలకు అనుగుణంగా వివిధ ఎంపికలను అందిస్తుంది.

టూర్ ప్యాకేజీ ఆప్షన్స్, ఛార్జీ వివరాలు

ప్రయాణికులకు రెండు ప్రధాన ఎంపికలు అందబాటులో ఉంచినట్లు IRCTC వెల్లడించింది.

Advertisement

⦿ 4 పగళ్లు/3 రాత్రుల ప్లాన్: ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి రూ.6,990 నుంచి రూ. 8,420 వరకు ఉంటాయి.

⦿ వందే భారత్ ప్రత్యేక ప్యాకేజీ (2 పగళ్ళు/1 రాత్రి): ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి ఛార్జ్ రూ. 7,360 నుంచి ప్రారంభం అవుతుంది. ప్రయాణికులు వారి సౌలభ్యం ప్రకారం వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చు.

MATA VAISHNODEVI EX DELHI ప్యాకేజీ వివరాలు

Advertisement

ఆదివారం నుంచి గురువారం వరకు ప్రయాణానికి వర్తించే 4-రోజులు, 3-రాత్రి ప్యాకేజీ (MATA VAISHNODEVI EX DELHI – WEEKDAY) IRCTC ఛార్జీల వివరాలను కూడా ప్రకటించింది.

⦿ క్లాస్ ఆక్యుపెన్సీ ఛార్జీ (ఒక్కొక్కరికి)

కంఫర్ట్ క్లాస్ (3AC)

ట్రిపుల్ ఆక్యుపెన్సీ-  6,990

డబుల్ ఆక్యుపెన్సీ- రూ.8,100

సింగిల్ ఆక్యుపెన్సీ- రూ.10,770

పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్‌తో)- రూ.6,320

పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్ లేకుండా)- రూ.5,255

⦿ సుపీరియర్ క్లాస్ (2AC)

ట్రిపుల్ ఆక్యుపెన్సీ- రూ.8,220

డబుల్ ఆక్యుపెన్సీ- 9,330

సింగిల్ ఆక్యుపెన్సీ- రూ.11,995

పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్‌తో)- రూ.7,550

పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్‌ లేకుండా)- రూ.6,485

టూర్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?

పర్యాటకులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని బుక్ చేసుకోవడానికి IRCTC అధికారిక వెబ్ సైట్ ను చూడాలని కోరింది.  ప్రయాణికులు తమ సౌలభ్యం ప్రకారం యాత్రను ప్లాన్ చేసుకోవడానికి, బుక్ చేసుకోవడానికి మరింత సమాచారం కోసం IRCTC అధికారిక వెబ్‌ సైట్‌ ను చూడాలని చెప్పింది. మాతా వైష్ణోదేవి యాత్రకు సంబంధించిన ఇతర టూర్ ప్యాకేజీల గురించి పూర్తి వివరాలను రైల్వే టికెట్ బుకింగ్ కేంద్రాల దగ్గర తెలుసుకోవచ్చన్నారు రైల్వే అధికారులు.

Read Also:  నల్ల రంగులో వందే భారత్.. బీజేపీ మంత్రి ట్వీట్ చూసి అంతా షాక్, అసలు విషయం ఏమిటంటే?

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×