Brahmamudi serial today Episode: లక్కీ, రాజును పిలిచి అసలు నువ్వేం అనుకుంటున్నావురా…? ఆ ఇందును మనమే కిడ్నాప్ చేశామని ఆ నందుకు తెలిస్తే మన బతుకు ఇక జైలే.. వామ్మో విలాసవంతంగా బతకాలనుకున్న మనం జైలు గోడల మధ్య మగ్గిపోవాల్సిందేనా..? అంటాడు. దీంతో రాజు రేయ్ నువ్వేం భయపడకురా నందుకు ఏమీ తెలియదు అని చెప్పగానే.. లక్కీ రేయ్ ఇప్పుడు తెలియకపోవచ్చు.. ఆసలు తను ఇందు ఫోటో పట్టుకుని తిరగడం మర్చిపోయావా..? నాకు డౌటేరా..? తను మనల్ని పట్టుకోవడానికే వచ్చి ఉంటుంది. మనమే కిడ్నాపర్లు అని తెలిసి కూడా తెలియనట్టు నటిస్తుందేమోనని నాకు డౌటుగా ఉందిరా అని చెప్తుండగానే..
నందు దగ్గరకు వచ్చి ఇందును మీరు కిడ్నాప్ చేశారన్న విషయం నాకు తెలుసు..? రాజు, లక్కీ షాక్ అవుతారు. ఏంటి అలా తెల్లముఖాలేసుకుని అలా చూస్తున్నారు. ఆరోజు మీరు గురకపెట్టి నిద్ర పోతుంటే నేను ఇంట్లోకి వచ్చాను అని చెప్పగానే.. లక్కీ నువ్వు అప్పుడు ఫోటో చూపించి వెళ్లిపోయావు కదా అనగానే.. ఆరోజు రాత్రి మళ్లీ తిరిగి వచ్చాను కదా అని చెప్పగానే.. ఏంటమ్మా..? మళ్లీ ఎందుకు వచ్చావు..? ఎలా తెలుసుకున్నావు అని లక్కీ అడగ్గానే.. కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని బయట ఆ అమ్మాయి బట్టలు ఆరేస్తే.. దొరక్కుండా ఎలా ఉంటుంది. అయినా కిడ్నాప్ అయిన అమ్మాయి దొరికినా నేనెందుకు తీసుకెళ్లలేదు అనేగా మీ డౌటు.. మా అక్కే మీ దగ్గర ఉంటానని చెప్పింది. అందుకే ఏమీ అనకుండా వెళ్లిపోయాను. ఇప్పుడు కూడా ఈ విషయం మనం మాట్లాడుకున్నట్టు మా అక్కకు చెప్పొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
మరోవైపు ఇందు హడావిడిగా వంట పనులు చేస్తుంది. ఇంతలో రాజుకు కంట్లో నలక పడగానే ఇందు వెళ్లి ఊదుతుంది. అది చూసిన లక్ష్మీ, చలపతి ఆశ్చర్యపోతారు. చలపతి మెల్లగా లక్ష్మీతో లక్ష్మీ వాళ్లిద్దరిని అలా చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది అని అడగ్గానే.. ఇలాంటి అమ్మాయి కోడలుగా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పగానే.. ఇలాంటి అమ్మాయే ఎందుకు ఈ అమ్మాయే వస్తే బాగుంటుంది కదా..? అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటారు.
తర్వాత వంట చేయడం అయిపోయాక అందరూ కలిసి కుర్చీలు వేస్తుంటే.. రాజు డ్రెస్ తీసుకొచ్చి ఇందుకు ఇస్తాడు. ఇందు ఫస్ట్ తీసుకోదు.. తర్వాత డ్రెస్ తీసుకుని థాంక్స్ రాజు అంటుంది. రాజు హ్యాపీగా ఫీలవుతుంటే.. ఇదే కదా నువ్వు ఎక్స్‌ఫెక్ట్ చేసింది అని అడగ్గానే.. మేం ఎందుకు ఎక్స్‌ఫెక్ట్ చేస్తాము ఏం చేయలేదు.. అనగానే.. ఇందు సరే మీరు వెళ్లి డ్రెస్ మార్చుకోండి నిన్నటి నుంచి ఇదే డ్రెస్‌లో ఉన్నారు. వెంకీ అక్కడ వంట పనులన్నీ అయిపోయాయి. అన్ని ఒకేచోట పెట్టేసెయ్ అని చెప్పగానే.. వెంకీ అలాగే సరే.. అంటూ అన్నయ్య నువ్వు వెళ్లి ఫ్రెష్ అయి రాపో అని చెప్పగానే.. సరే అంటూ రాజు వెళ్లిపోతాడు.
తర్వాత వంటలన్నీ వచ్చే అతిథులకు కోసం రెడీగా ఉంచడంతో చలపతి వచ్చి చూసి ఆశ్చర్యపోతాడు. ఇవన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్‌తోనే చేశారా..? అంటూ అడగ్గానే.. వెంకీ అవును నాన్న ఎన్ని రకాల వంటకాలు తయారు చేశామో చూశారా..? అంటాడు. రాజు మనసులో ఇన్ని రకాల వంటకాలు తయారు చేశామంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అనుకుంటాడు. చలపతి మాత్రం అద్బుతంగా ఉందమ్మా.. వచ్చే బంధువుల కన్నా ముందు నాకే తినాలనిపిస్తుంది. అనగానే.. ఆగండి ఆగండి మీరు చేసే వేరే పనులు ఉన్నాయి అంటూ రెండు కిలోల చికెన్ ఎలా సర్దుతాను అని అడిగావు కదా ఇదిగో ఈ కప్పుల్లో సర్దుతాను అంటూ చెప్తుంది. తర్వాత అందరూ గెస్టులు వస్తారు. వారికి నిమ్మరసం సర్వ్ చేస్తారు. అందరూ నిమ్మరసం తాగుతారు. ప్రూట్ ఫంచ్ చాలా బాగుందని మెచ్చుకుంటారు. ఇంకా కావాలని అడిగి మరీ తాగుతుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.