Kothagudem: పెద్దలు పెళ్లి చేసుకున్నవారే కాదు.. ప్రేమ పెళ్లిళ్లు సైతం విఫలమవుతున్నాయి. వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కాకపోతే అబ్బాయి తల్లిదండ్రులు నో చెప్పారు. దీంతో దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకోవడాన్ని యువకుడి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు. ఈ క్రమంలో భార్య చిన్న కోరిక కోరింది. ఉగ్రరూపంతో భార్యని అత్యంత దారుణంగా చంపిన ఘటన కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది. అసలు ఏం జరిగింది?
కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గోళియాతండాకు చెందిన నరేందర్ ఏఆర్ కానిస్టేబుల్. ప్రస్తుతం గతేడాది కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏటూరు నాగారానికి చెందిన 29 ఏళ్ల భవానితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అంతకుముందే పెళ్లైన భవాని, భర్త నుంచి విడాకులు తీసుకుంది. కుటుంబ సభ్యుల జోక్యం లేకుండా గతేడాది ఏప్రిల్‌లో భద్రాచలం గుడిలో పెళ్లి చేసుకున్నారు.
కొత్తగూడెం ప్రగతినగర్‌లో నరేందర్-భవానీ దంపతులు ఉంటున్నాడు. సీన్ కట్ చేస్తే.. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని నరేందర్‌ను ఇంటికి రానివ్వడం లేదు తల్లింద్రులు. ఈ విషయంలో చీటికీ మాటికీ నరేందర్ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈనెల మూడున అత్తారింటికి తీసుకెళ్లమని భార్య కోరింది. అప్పటికే తల్లిదండ్రులు రానివ్వకపోవడంతో ఆగ్రహంతో ఉన్నాడు నరేందర్. భార్య కోరిన నేపథ్యంలో మళ్లీ దంపతలు మధ్య గొడవ మొదలైంది. భార్యని వదిలించుకోవాలని డిసైడ్ అయ్యాడు కానిస్టేబుల్.
చున్నీతో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి పోయిన మంగళవారం రాత్రి ఏడు గంటలకు హత్య చేశాడు. మృతదేహాన్ని రెండు సంచుల్లో మూటగట్టి ఇంట్లోనే ఉంచి మరుసటి రోజు పొలంలో శవం ఉన్న మూటను దాచిపెట్టాడు. తండ్రితో కలిసి శవాన్ని మాయం చేయడానికి ప్లాన్ చేశాడు. 5న రాత్రి తండ్రీకొడుకులిద్దరు శవాన్ని భద్రాచలం వద్ద గోదావరిలో పడేశారు. భవాని కనిపించకపోవడంతో సోదరి స్వరూపకు అనుమానం వచ్చింది. తన చెల్లెలి ఆచూకీ లేదని, భర్త ఏదైనా చేసి ఉంటాడనే అనుమానంతో నవంబర్ ఆరున పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు, తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాలతో పోలీసులు మృతదేహాన్ని గోదావరి నుంచి బయటకు తీశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించారు. ఈ కేసులో ప్రమేయమున్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని ఆ జిల్లా ఎస్పీ వెల్లడించారు.