E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మినిస్టర్ ధర్మేంద్రను ప్రశ్నించిన అప్పు 

Brahmamudi Serial Today February 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మినిస్టర్ ధర్మేంద్రను ప్రశ్నించిన అప్పు 
Advertisement

Brahmamudi serial today Episode:

మినిస్టర్‌ ధర్మేంద్ర దగ్గరకు వెళ్లిన రుద్రాణి బిడ్డల్ని మార్చడంలో నేను మీకు సాయం చేసినట్లు రాజ్, కావ్యలకు తెలిస్తే నన్ను బత్రకనివ్వరని ధర్మేంద్రకు చెబుతుంది. నాకొక్క అవకాశం ఇవ్వాలని బతిమలాడుతుంది. ఇంతలో కళ్యాణ్, అప్పు అక్కడికి రావడంతో వారిని చూసిన రుద్రాణి షాక్ అవుతుంది.  వాళ్లెందుకు వస్తున్నారు మీ దగ్గరకు.. అని అడుగుతుంది రుద్రాణి. దీంతో దర్మేంద్ర వాళ్లు ఎందుకు వస్తున్నారో నాకు తెలియదు.. అని చెప్పగానే..  కానీ మీరు మాత్రం నా గురించి వాళ్లకు చెప్పకండి ఫ్లీజ్‌.. అంటూ చాటుకు వెళ్లిపోతుంది రుద్రాణి. బయట సెక్యూరిటీ వాళ్లు కళ్యాణ్, అప్పులను ఆపడంతో ధర్మేంద్ర సెక్యూరిటీ వాళ్లకు వాళ్లను లోపలికి పంపించమని చెప్తాడు. దీంతో కళ్యాణ్‌ అప్పులు లోపలికి వెళ్తారు. వాళ్లను ధర్మేంద్ర ఎందుకొచ్చారు? ఏం కావాలి.. అని అడగ్గానే..

బిడ్డల మార్పు విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.. మీరొక మినిస్టర్ అయ్యుండి, బాధ్యత గల పదవిలో ఉండి ఇలా చేయొచ్చా..? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ధర్మేంద్ర చూడండి అపూర్వ గారు.. నా వైపు తప్పు జరిగిందని మీ అక్కా బావకి క్షమాపణలు చెప్పాను.. ఇప్పుడు నా బిడ్డతో ఆనందంగా ఉన్నాను.. అని చెప్పగానే.. కళ్యాణ్‌ సీరియస్‌ గా కానీ మాకు తెలియాల్సిన కొన్ని నిజాలు అలాగే ఉండిపోయాయి అంటాడు.. అప్పు కూడా ఆపరేషన్ జరుగుతున్న మీ కూతురిని చంపితే మీ దగ్గరున్న మా ఇంటి పాప.. మీ దగ్గరే ఉండిపోతుందన్న ఆలోచనతో మీ పాపని చంపాలనుకున్న మీరు.. మళ్లీ అంతలోనే పాపని కాపాడుకోవాలని ఎందుకు అనుకున్నారు అంటూ  ప్రశ్నిస్తుంది.. దీంతో ధర్మేంద్ర నా తప్పు తెలుసుకున్నాను.. బిడ్డను చంపుకోవడానికి నా మనసు ఒప్పుకోలేదు అందుకే సేవ్‌ చేయడానికి మళ్లీ హాస్పిటల్‌కు వచ్చాను అని చెప్తాడు ధర్మేంద్ర. దీంతో అప్పు.. మరి పరాయివాళ్ల బిడ్డను మార్చడానికి మీ మనసు ఎలా ఒప్పుకుంది? అని ప్రశ్నించగానే..

Advertisement

ధర్మేంద్ర మాత్రం తాను క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం..తర్వాత ఆలోచించాను.. నేరం అనిపించింది మనసు మార్చుకున్నాను. నా వల్ల తప్పు జరిగింది.. రాజ్, కావ్యల మంచితనం వల్ల అంతా మంచి జరిగిందని చెబుతాడు.  దీంతో అప్పు ఇప్పటికే మా ఫ్యామిలీలో ఎన్నో అనర్ధాలు జరిగాయి.. మా అక్క ఎన్నో కష్టాలు పడింది, పసిబిడ్డ కళ్లు తెరిచాక కూడా ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడాలని అనుకుంటున్నాము అని చెప్పగానే.. ధర్మేంద్ర గిల్టీగా.. ఫీలవుతూ.. నేను మనిషిని నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు.. అని చెప్పగానే.. అప్పు అనుమానంగా మీ వల్ల రాదు అంటే.. ఇంకెవరి వల్ల అయినా వస్తుందా..? అనగానే.. ధర్మేంద్ర, చాటుగా వింటున్న రుద్రాణి షాక్‌ అవుతారు.

మీకు డబ్బుంది పలుకుబడి ఉంది. మీరు అనుకుంటే పాపకి ఆపరేషన్ చేయించగలరు.. ఇంత అవకాశం ఉండి కూడా పరాయి వాళ్ల బిడ్డను మార్చాలన్నది మీ ఆలోచనేనా? మీకు ఎవరైనా సలహా ఇచ్చారా అంటూ అప్పు ప్రశ్నించగానే.. ధర్మేంద్ర నాకు ఎవ్వరూ సలహా ఇవ్వలేదు.. ఇంతటి దుర్మార్గమైన ఆలోచన నాకే వచ్చింది అంటూ చెప్పగానే.. అప్పు మరింత అనుమానంగా భార్యను ఇంత ప్రేమించే మీరు.. బిడ్డను కూడా అంతే ప్రేమిస్తారు.. అలాంటిది కడుపున పుట్టిన బిడ్డను చంపేంత ఆలోచన చేస్తారా.. అని ప్రశ్నించగానే.. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తప్పవని అలాగే నేను ఆ తప్పుడు నిర్ణయం తీసుకున్నాను.. అని చెప్పగానే.. అయితే పాపని చంపాలనుకున్నది, మళ్లీ మనసు మార్చుకుని కాపాడాలనుకున్నది మీరేనా.. అని అడగ్గానే.. నేనే అని చెప్తూనే ఉన్నాను కదా.. ఎన్నిసార్లు అడుగుతారు అదే ప్రశ్న అంటూ ధర్మేంద్ర చెప్పగానే.. సరే ఓకే అంటూ అప్పు, కళ్యాణ్‌ వెళ్లిపోతారు.

Advertisement

చాటుగా ఉన్న రుద్రాణి, ధర్మేంద్ర దగ్గరకు వస్తుంది. నా పేరు చెప్పకుండా నన్ను కాపాడినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మినిస్టర్‌ గారు అంటుంది. దీంతో ధర్మేంద్ర చిరు కోపంగా రుద్రాణిని తిడుతూ.. ఇప్పటికైనా మనిషిలా బతకు వెళ్లు అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో రుద్రాణి బయటకు వెళ్లిపోతుంది. మినిస్టర్‌ తో మాట్లాడిన తర్వాత బయట కారు దగ్గర వెయిట్‌ చేస్తున్న కళ్యాణ్‌, అప్పులు రుద్రాణిని గమనిస్తారు. అసలు మినిస్టర్‌ ఇంట్లోంచి రుద్రాణి రావడం ఏంటని షాక్‌ అవుతారు. ఇద్దరూ కలిసి రుద్రాణి కారును ఫాలో అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×