E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అప్పు మీద అటాక్ చేయించిన రుద్రాణి  

Brahmamudi Serial Today February 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అప్పు మీద అటాక్ చేయించిన రుద్రాణి  
Advertisement

Brahmamudi serial today Episode: 

హాస్పిటల్‌లో పాప మీద అటాక్‌ చేసిన రౌడీలను పట్టుకుంటే ఈ కుట్ర వెనక ఉన్నది మినిస్టరా..? లేక రుద్రాణియా అనేది తెలుస్తుందని అప్పు చెప్పగానే.. అవునని అయితే ఈ విషయంలో నిజానిజాలేంటో తెలిసే వరకు ఇంట్లో వాళ్లకు చెప్పొద్దని అంటాడు కళ్యాణ్‌. దీంతో సరే అంటుంది అప్పు. మరోవైపు రాహుల్‌ కోపంగా రుద్రాణిని తిడుతుంటాడు. నిన్ను ఆ ఇంట్లో నుంచి తరిమేశాక.. నువ్వు ఏ ఒక్క ప్లాన్ సక్సెస్ చేయలేకపోయావు అంటాడు. రేఖ కూడా కోపంగా కావ్యని లేకుండా చేస్తానని అన్నావు.. అది బతికి మా బతుకుల్ని శాసిస్తోంది అంటూ మండిపడుతుంది. దీంతో రుద్రాణి నేను అన్ని కరెక్ట్‌గానే ప్లాన్ చేశాను.. కానీ టైం బాలేదు, ఇలాగే బెడిసికొడుతుందని అసలు ఊహించలేదు.. అంటుంది.

దీంతో రేఖ కోపంగా నువ్వు ఇంకా ఇక్కడ ఊహల్లోనే ఉండు అక్కడ వాళ్లు ఆస్తుల వాటాల పంచుకుంటున్నారు అని చెప్పగానే.. రుద్రాణి షాక్‌ అవుతుంది. రాహుల్‌ కూడా కోపంగా ఉన్న ఆస్తిలో సగం వాళ్లు పంచుకుని, మిగతా ఆస్తితో ట్రస్ట్ పెట్టాలని అనుకుంటున్నారు అనడంతో రుద్రాణి మరింత టెన్షన్ పడుతుంది. ఇక రేఖ వెటకారంగా  పేదలకు సాయం చేస్తారట, రేపు రాబోయే తరాలు దుగ్గిరాల ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలట అనగానే.. రాహుల్‌ కూడా అంతే వెటకారంగా  కావ్య ఐడియా చెప్పడంతో అంతా ఒప్పుకున్నారు.. కానీ ధాన్యలక్ష్మీ అత్తయ్య మాత్రం ఒప్పుకోలేదు. కళ్యాణ్ కు అన్యాయం జరుగుతుందని గొడవ చేస్తుంది అని చెప్పగానే.. ఆవిడ అంటే కావ్య, రాజ్‌ ఆగే రకమా..? అంటుంది రేఖ. అదే జరిగితే మన చేతికి చిప్పే గతవుతుంది.. అసలే నా బిజినెస్‌ కూడా లాస్‌లో ఉంది. ఇక మన ముగ్గురికి గుడి మెట్లే దిక్కు అంటాడు రాహుల్‌.

Advertisement

దీంతో రుద్రాణి కోపంగా చూస్తూ.. నేను బ్రతికుండగా అలా జరగనిస్తానా? అంటుంది. దీంతో రేఖ వాళ్లకు ఒక్కసారి ఆలోచన వచ్చిందంటే దానిని ఇంప్లిమెంట్ చేసేవరకు వదిలిపెట్టరు అని చెప్తుంది. ఈ పరిస్థితుల్లో నేను ఆ ఇంట్లోనే ఉండి ఉంటే ట్రస్ట్ ఆలోచనని తుంచేసే దానిని.. నిజం బయటకు రాకుండా ఆ మినిస్టర్ నోరు మూయించగలిగాను కానీ, ఆ ఇంట్లోకి నేను అడుగుపెట్టే మార్గం తెలియడం లేదు అని చెప్తుంటే.. అప్పుడే రౌడీలు ఫోన్‌ చేసి మన మీద పోలీసులకు డౌట్ వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పడంతో రుద్రాని షాక్‌ అవుతుంది. రౌడీలను వెంటనే అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోమ్మని చెప్తుంది. పోలీసులకు దొరికినా తన పేరు చెప్పొద్దని వార్నింగ్‌ ఇస్తుంది. ఫోన్‌ కట్‌ చేసి రాహుల్‌, రేఖలకు విషయం చెప్తుంది. అప్పు నా గురించి వెతుకుతుందట.. అని చెప్పగానే.. దానికి ఏమాత్రం అనుమానం వచ్చినా నీ దాకా వచ్చేస్తుంది అంటూ రాహుల్‌ భయపడుతుంటే..

అది నా గురించి ఆలోచించే లోగా.. నేనే దాని మీద అటాక్ చేయిస్తా. దాన్ని వాడుకుని అప్పూని కిడ్నాప్ చేయించింది రాజ్‌ అని  ధాన్యలక్ష్మీని నమ్మిస్తా. ఆస్తి కోసమే రాజ్, కావ్యలు అప్పూని కిడ్నాప్ చేశారని.. అప్పూని కిడ్నాప్ చేసి ధాన్యలక్ష్మీకి వారసత్వం లేకుండా చేశారని రెచ్చగొడతా. అప్పుడు ధాన్యం చేసే గొడవకి దుగ్గిరాల కుటుంబం జుట్టు పీక్కుంటుందని అని తన ప్లాన్‌ చెప్తుంది రుద్రాణి. తర్వాత పాప మీద అటాక్‌ చేసిన రౌడీలను పట్టుకున్నామని పోలీసులు అప్పుకు చెప్తారు.. కానీ వాళ్లను ఎంత కొట్టినా మినిస్టర్‌ పేరే చెప్తున్నారని అనడంతో అప్పు అక్కడికి వెళ్లడానికి రెడీ అవుతుంది. విషయం తెలుసుకున్న రుద్రాణి అప్పు, కళ్యాణ్‌లు బయటకు వస్తున్నారు వాళ్లను కిడ్నాప్‌ చేయమని రౌడీలకు చెప్తుంది.

Advertisement

తర్వాత రాజ్‌, కావ్యలు ఆస్థిని సగం కళ్యాణ్ పేరు మీద సగం ఆస్థిని ట్రస్ట్‌ పేరు మీద రాయించి డాక్యుమెంట్స్‌ తీసుకొచ్చి ధాన్యలక్ష్మీకి ఇస్తారు. దీంతో దుగ్గిరాల ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. అందరూ కలిసి ధాన్యలక్ష్మీని తిడతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Big Stories

Advertisement
×