E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రిపోర్ట్స్‌ చూసి షాకైన కావ్య

Brahmamudi Serial Today January 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రిపోర్ట్స్‌ చూసి షాకైన కావ్య
Advertisement

Brahmamudi serial today Episode:

కావ్యకు చేసిన డీఎన్‌ఎ టెస్ట్ రిపోర్ట్‌ కోసం దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఆతృతగా ఎదురుచూస్తుంది. అందరూ బాగా టెన్షన్‌ పడుతుంటారు. టెన్షన్‌ తట్టుకోలేక ఇంద్రాదేవి రాజ్‌ను పిలిచి రిపోర్ట్‌ తొందరగా వచ్చేలా చేయమని చెప్తుంది. రిపోర్ట్‌ కోసం ఎదురుచూసి మాకు పిచ్చెక్కేలా ఉంది అని చెప్తుంది. దీంతో రాజ్‌ నేను కూడా ఆ రిపోర్ట్‌ కోసమే ఎదురుచూస్తున్నాను కదా నాన్నమ్మ అని చెప్తాడు. అందరూ అంత టెన్షన్‌గా ఉంటే కావ్య మాత్రం చాలా కూల్‌గా పాపను ఆడిస్తూ.. వస్తుంటుంది. కావ్య అంత కూల్‌గా రావడం చూసి అందరూ షాక్‌ అవుతారు. ఇంద్రాదేవి అసహనంగా మేము రిపోర్ట్స్ లో ఏమి వస్తుందా అని అంత టెన్షన్ గా ఉంటే నువ్వు మాత్రం ఏమీ పట్టనట్టు అంత ఉల్లాసంగా సంతోషంగా ఎలా ఉన్నావు కావ్య అని అడుగుతుంది. అవును కావ్య నీకు టెన్షన్‌గా లేదా…? అని అపర్ణ అడగ్గానే.. ధాన్యలక్ష్మీ కూడా కావ్యను చూస్తుంటే అసలు టెన్షన్‌ పడుతున్నటే కనబడటం లేదు అంటుంది.

దీంతో కావ్య మీరందరూ టెన్షన్ పడుతున్నారు నేను పడట్లేదు. మీకు నిజం తెలియాలి నాకు ఆల్రెడీ నిజం తెలుసు అని కావ్య చెప్తుండగానే.. రాజ్‌ రిపోర్ట్స్‌ వచ్చాయి అనుకుంటూ వస్తాడు. ఓపెన్‌ చేసి చూసి రాజ్‌ షాకింగ్‌గా ఉండిపోతాడు. రాజ్‌ను అలా చూసి అందరూ రిపోర్ట్‌ ఏమని వచ్చింది చెప్పు అని అడుగుతుంటారు. కావ్య కూడా ఏవండి ఎందుకు అలా ఉండిపోయారు.. రిపోర్ట్‌ ఏమని వచ్చింది. ఆ పాప మన పాప కాదని వచ్చింది కదా..? అందుకే షాక్‌ అయ్యారా..? మీరు అంటూ అడుగుతుంది. దీంతో రాజ్‌ అంతలేదు.. ఆ పాప మన పాపే అని వచ్చింది. కళావతి ఇకనైనా నీ అనుమానం వీడి పాపను బాగా చూసుకో అని చెప్తాడు రాజ్‌. రాజ్‌ మాటలకు కావ్య షాక్‌ అవుతుంది. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. అక్కడే ఉన్న రాహుల్‌, రేఖ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇంతలో కావ్య గట్టిగా అరుస్తూ.. నో ఆ రిపోర్ట్స్‌ అబద్దం టెస్టులు అబద్ధం ఎవరో కావాలని నా మీద నా పాప మీద కుట్ర చేస్తున్నారు అంటూ అరుస్తుంది కావ్య.

Advertisement

దీంతో రాజ్‌ ఏంటి కావ్య డాక్టర్లు చేసిన టెస్టులు చూసి కూడా నువ్వు అబద్దం అంటున్నావు అని అడగడంతో అవును ఇదంతా నిజంగానే అబద్ధం ఎవరో కావాలనే చేస్తున్నారు అంటుంది కావ్య. ఈ బిడ్డ నా బిడ్డ కాదని ఎంత అరిచి చెప్పినా కూడా ఎందుకు ఎవరూ వినిపించుకోవడం లేదు.  ఈ బిడ్డ నా బిడ్డ కాదు.. ఈ బిడ్డ నా బిడ్డ కాదు.. ఈ బిడ్డ నా బిడ్డ కాదు అంటూ అరుస్తుంది కావ్య… రాజ్‌ కూడా కోపంగా ఇక ఆపు కళావతి అంటూ గట్టిగా అరుస్తాడు.. దీంతో కావ్య, రాజ్‌ మధ్య గొడవ జరుగుతుంది. ఏం చేయాలో తెలియక ఇంట్లో వాళ్లు అయోమయంగా చూస్తుంటారు. ఇక ఇంద్రాదేవి కావ్యను బతిమాలుతూ.. ఇప్పటికైనా మా మాట విను కావ్య ఈ బిడ్డ నీకు దేవుడు ఇచ్చిన వరం నీ బిడ్డగా ఒప్పుకో అని చెప్తుంది.

అపర్ణ కూడా కావ్య రిపోర్ట్స్‌ వచ్చాక ఈ బిడ్డ నీ బిడ్డే అని ఒప్పుకుంటాను అన్నావు ఇప్పుడు మళ్లీ ఈ మెలిక పెడుతున్నావేంటే అని ప్రశ్నిస్తుంది. తర్వాత ఒక్కోక్కరు ఒక్కోమాట అంటూ కావ్యను కన్వీన్స్‌ చేయాలని చూస్తారు. రాజ్‌ కూడా కావ్య ఇప్పటి వరకు నువ్వు ఏం చెప్పినా విన్నాను.. ఇప్పటి నుంచి నేను చెప్పేది వినాలి. ఈ పాపను మన పాపగా ఒప్పుకోవాలి.. అని చెప్పగానే.. కావ్య మాత్రం కరాకండిగా నేను ఎప్పటికీ అలా ఒప్పుకోను… నేను ఎప్పటికీ ఈ బిడ్డను నా బిడ్డగా ఒప్పుకోను నన్ను పిచ్చిదాన్ని అనుకున్న సరే కానీ నేను మాత్రం ఒప్పుకోనున  అని చెప్తుంది కావ్య. కావ్య మాటలకు అందరూ షాక్‌ అవుతారు.

Advertisement

మరోవైపు రుద్రాణి మినిస్టర్‌ దర్మేంద్ర దగ్గరకు వెళ్లి మినిస్టర్‌ గారు మీరు డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ మార్పించి చాలా మంచి పని చేశారు అంటుంది . దీంతో దర్మేంద్ర మీరు చేసిన సాయం కూడా చాలా పెద్దది రుద్రాణి గారు.. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అంటాడు. ఏదో ఒక రోజు నేను వచ్చి మిమ్మల్ని సహాయం అడుగుతాను ఆరోజు తప్పకుండా మీరు నాకు సాయం చేయాలి మినిస్టర్‌ గారు అంటుంది రుద్రాణి. తప్పకుండా నీకు సాయం చేస్తాను రుద్రాణి గారు అని ధర్మేంద్ర చెప్పగానే.. రుద్రాణి వెళ్లిపోతుంది. అయితే రుద్రాణి వెళ్లిపోవడం చూసిన దర్మేంద్ర భార్య తులసి అనుమానంగా ఎవరు ఆవిడి పదే పదే మన ఇంటికి వస్తుంది అని అడుగుతుంది.

దీంతో షాక్‌ అయిన మినిస్టర్‌ ఏదో చెప్పి తులసిని డైవర్ట్‌ చేయాలనుకుని ఆవిడ పార్టీ  విషయాల గురించి మాట్లాడటానికి వచ్చారు అని చెప్పి తులసిని లోపలికి తీసుకెళ్తాడు ధర్మేంద్ర. తర్వాత పాపను చూస్తూ బాధపడుతున్న కావ్యను రాజ్‌ ఓదారుస్తుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×