E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు నిజం చెప్పిన నీలవేణి 

Brahmamudi Serial Today January 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు నిజం చెప్పిన నీలవేణి 
Advertisement

Brahmamudi serial today Episode:

డాక్టర్‌ చక్రవర్తిని పట్టుకుంటే తన బిడ్డ విషయంలో నిజానిజాలు బయటకు వస్తాయని కావ్య డాక్టర్‌ అనురాధకు చెప్తుంది. దీంతో అనురాధ ఆయన విషయాలు హెడ్‌ నర్స్‌ నీలవేణికి తెలిసి ఉంటాయి. ఆయన ఇల్లు ఎక్కడుందనేది తెలుసుకుని అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది మేడం అంటూ కావ్య చెప్పగానే.. అయితే నీలవేణిని అడ్రస్‌ అడుగుదాం అని చెప్తుంది అనురాధ. ఇద్దరూ కలిసి బయటకు వస్తారు. అప్పటికే నీలవేణి మరో నర్సుతో నేను పది లక్షలు పెట్టి గోల్డ్‌ చైన్‌ కొన్నాను. చూడు ఎలా ఉంది అని అడగుతుంది. దీంతో ఆ నర్స్‌ నీకు అంత డబ్బు ఎక్కడిది నీలవేణిగారు అని అడగ్గానే..  ఎవరైనా పెద్దవాళ్లు చిన్న హెల్ప్ అడిగితే సాయం చేస్తే మనకి ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తారు.. అలాంటిదే నేను ఈ మధ్య ఒక హెల్ప్‌ చేశాను వాళ్లు డబ్బు ఇచ్చారు ఆ డబ్బుతోనే ఈ చైన్‌ కొన్నాను చూడు ఎలా ఉంది అని చెప్తుండగానే.. అక్కడికి డాక్టర్‌ అనురాద వస్తుంది. ఆమెను చూసిన నీలవేణి షాక్‌ అవుతుంది.

కావ్య కోపంగా నీలవేణిని చూస్తూ.. ఎవరి బిడ్డను ఎవరికిస్తే నీకు బాగా గిట్టుబాటు అవుతుందనేది మాత్రం నీకు బాగా తెలుసన్న మాట అనగానే.. నర్స్‌ కోపంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా…? అంటుంది. దీంతో కావ్య కోపంగా నీలవేణిని కొడుతుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది. మినిస్టర్‌ దర్మేంద్ర దగ్గర ఉన్నది ఎవరి పాప..? అంటూ కావ్య నిలదీయడంతో నీలవేణి భయపడుతూనే నాకేం తెలియదు మేడం.. నిజంగా నాకు తెలియదు అని చెప్తుంది. దీంతో డాక్టర్‌ అనురాధ కోపంగా ఇది చాలా సీరియస్ మేటర్.. నిజం చెప్ప లేదంటే నువ్వు ఇరుక్కుంటావు చివరకు జైలుకు వెళ్లాల్సి వస్తుంది అంటూ  వార్నింగ్ ఇస్తుంది. డాక్టర్‌ వార్నింగ్‌కు భయపడిన నీలవేణి జరిగింది మొత్తం చెప్తుంది. మినిస్టర్‌ దర్మేంద్ర బిడ్డను మార్చి కావ్య బిడ్డను తనకు ఇవ్వమన్నాడు అలాగే చేశాను. అందుకోసం నాకు పది లక్షల చెక్‌ ఇచ్చారు అని చెప్తుంది.

Advertisement

నీలవేణి మాటలకు కావ్య, డాక్టర్ అనూరాధ షాక్ అవుతారు. డబ్బు కోసం అమ్మతనాన్ని అమ్మేస్తావా? నిన్ను చంపేస్తాను. దీని వల్ల నేను ఇన్నిరోజులు నరకయాతన అనుభవించాను. నాకు నా బిడ్డను దూరం చేస్తావా..? అంటూ అంటూ కొడుతుంది కావ్య.. దీంతో డాక్టర్‌ అనురాధ కావ్యను ఆపేసి మినిస్టర్ దగ్గరి నుంచి మీ పాపని తెచ్చుకోవడం ఎలా అనేది ఆలోచించాలి అనగానే.. ఇప్పుడే ఈ నర్స్‌ని మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్లి అందరి ముందు నిజాలు చెప్పించి నా బిడ్డను నేను తెచ్చుకుంటానని అంటుంది కావ్య.

దాంతో నీలవేణి భయంగా  నన్ను ఇందులోకి లాగొద్దు మేడం.. .. నిజం తెలిస్తే ఆ మినిస్టర్ నన్ను బతకనివ్వడు.. మినిస్టర్ గారిని ఎదురించేంత శక్తి, స్థాయి నాకు లేవు మినిస్టర్ గారిని వ్యతిరేకించిన చక్రవర్తి గారు కనిపించకుండా పోయారు.. ఇప్పుడు నేను నిజం చెప్పానని తెలిస్తే మినిస్టర్ నన్ను బతకనివ్వడు.. నాకు ఇద్దరు బిడ్డలు.. ఇద్దరూ చిన్నవాళ్లే.. వాళ్లకు నేను తప్ప ఎవరూ లేరు, మీకు నిజం చెప్పగలను కానీ… మినిస్టర్ ముందు నిలబడలేను అంటూ  కావ్య కాళ్లు పట్టుకుంటుంది నీలవేణి. దీంతో కావ్య బిడ్డకు తల్లి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు… అందుకే వదిలేస్తున్నాను వెళ్లు ఇక అంటూ కావ్య చెప్పగానే.. నీలవేణి వెళ్లిపోతుంది. కావ్య నీకు ఉన్నది నీలవేణి సాక్ష్యం ఒక్కటే.. ఇప్పుడే ఏ ప్రూఫ్‌తో నీ బిడ్డను తెచ్చుకుంటావు అని అడగ్గానే.. నా పాపకి అరచేతిలో పుట్టుమచ్చ ఉంది మేడం..  ఆ లిస్ట్ ఇస్తే నేను చూసుకుంటాను అని చెప్తుంది.

Advertisement

మరోవైపు ఇంట్లో బిడ్డ ఏడుస్తుంటే రాజ్‌ను వెంటనే కావ్యకు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని చెప్తారు. రాజ్‌ ఫోన్‌ చేస్తే కావ్య కట్‌ చేస్తుంది. అప్పుడే రేఖ వచ్చి కావ్య రోడ్ల మీద పిచ్చిదానిలా తిరుగుతుందని.. కనిపించిన ప్రతి బిడ్డను నా బిడ్డ అంటూ కార్ల వెనకాల పరుగెడతుందని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. మరోవైపు హాస్పిటల్ రికార్డుల్లో కూడా మినిస్టర్‌ పాప చేతికి పుట్టుమచ్చ ఉన్నట్టు రాశారని డాక్టర్‌ చెప్పి బాధపడుతుంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా హెల్ప్ చేస్తానని చెప్తుంది. ఇక మినిస్టర్‌ ఇంట్లో రుద్రాణి, మినిస్టర్‌ మాట్లాడుకుంటుంటే.. కావ్య వెళ్తుంది. కావ్యను చూసిన రుద్రాణి చాటుకు వెళ్తుంది. కావ్య వెళ్లి మినిస్టర్‌ తిట్టి నా బిడ్డను ఎందుకు మార్చేశావని అన్ని డీటెయిల్స్‌ చెప్పగానే.. దర్మేంద్ర షాక్‌ అవుతాడు. నేను మార్చేసిన రిపోర్ట్స్‌ గురించి కూడా తెలుసుకున్నావంటే చాలా దూరం వచ్చేశావు అని మనసులో అనుకుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

Big Stories

Advertisement
×