Brahmamudi serial today Episode: పెళ్ళిలో పంతులును చూసిన కనకం తనకు తెలుసని.. ఆయన వీక్ పాయింట్ కూడా తెలుసని ఆ వీక్ పాయింట్ మీద కొడితే ఆటోమేటిక్ గా ఆ శాస్త్రి వీక్ అయిపోతాడు. అప్పుడు చచ్చినట్టు మనం చెప్పినట్టు వింటాడు అని చెప్తుంది కనకం. ఇంతకీ ఏంటా వీక్‌నెస్ అంటూ అపర్ణ అడుగుతుంది. దీంతో మెల్లగా సిగ్గుగా కనకాంబరం అని చెప్తుంది కనకం. అర్థం కాక ఇంద్రాదేవి నీ పేరు కనకం కదే అంటుంది. అయ్యో నా పేరు కనకమే అమ్మా కానీ తన వీక్‌నెస్ పేరు కనకాంబరం అంటున్నాను. మీరు తన దగ్గరకు వెళ్లి మీకోసం కనకాంబరం వెయిట్ చేస్తుందని గదిలోకి తీసుకురండి అక్కడ ఆడిద్దాం అని చెప్పి కనకం గదిలోకి వెళ్తుంది. అపర్ణ, ఇంద్రాదేవి పంతులు దగ్గరకు వెళ్లి గుర్రుగా చూస్తుంటారు.
దీంతో పంతులు అనుమానంగా ఎంటండీ నా వంక అలా చూస్తున్నారు. కొంప దీసి నన్ను తినేస్తారా ఏంటి..? అని అడుగుతాడు. దీంతో ఇంద్రాదేవి అంత అదృష్టం మాకు వద్దులేండి శాస్త్రిగారు అని చెప్తుంది. మరి ఎందుకు అలా చూస్తున్నారు అని పంతులు అడగ్గానే.. ఎందుకంటే మీకోసం ఒకరు ఎదురుచూస్తున్నారు కాబట్టి అని అపర్ణ చెప్తుంది. దీంతో పంతులు ఏమిటీ నాకోసం ఒకరు ఎదురుచూస్తున్నారా..? ఎవరు వాళ్లు అని అడుగుతాడు. దీంతో ఇద్రాదేవి కనకాంబరం అని చెప్తుది. అపర్ణేమో పైన గదిలో ఉంది వెళ్లండి అని చెప్తుంది. దీంతో చాలా థాంక్స్ అమ్మా దీర్ఘాయుష్మాన్‌భవ.. ఓరేయ్ శిష్యా చూస్తూ ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి పంతులు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. గదిలోకి వెళ్లి ఓసేయ్ కనకాంబరం అంటూ పిలవగానే అక్కడ కనకం కనిపిస్తుంది. ఎవరు మీరు కనకాంబరం ఎక్కడ అని అడుగుతాడు. ఇక్కడ లేదు ఇంట్లో ఉండొచ్చని చెప్తుంది.
ఇంతలో అపర్ణ, ఇంద్రాదేవి వస్తారు. మాటలతో పంతులును రెచ్చగొట్టి కోపంగా అరిచేలా చేస్తారు. పంతులు అరుస్తుంటే కనకం ఫోటోలు తీస్తుంది. ఆ ఫోటోలు చూపించి పంతులును బ్లాక్ మెయిల్ చేస్తారు. దీంతో పెళ్లి ఆపడానికి పంతులు ఒప్పుకుంటాడు. ఎలా పెళ్లి ఆపాలో కూడా పంతులే ప్లాన్ చెప్తాడు. మరోవైపు రాజ్, కావ్యను పక్కకు తీసుకెళ్లి మీరు అనుకుంటున్నట్టు యామిని పెళ్లి చేసుకుందామంటే నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదండి. యామిని ఈ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే నాకు ఈ పెళ్లే ఇష్టం లేదు. ఈ విషయం గురించి మీకు చెబుదామనుకుంటే మీరేమో వినిపించుకోవడం లేదు. ఇప్పుడు చెప్పండి కళావతి గారు నేను ఈ పెళ్లికి ఒప్పుకోవడంలో తప్పు ఏమైనా ఉందా..? అని అడగ్గానే..
చనిపోతాను అని బెదిరిస్తే పెళ్లి చేసుకుంటారా రామ్ గారు. ఈరోజు యామిని బెదిరిస్తే పెళ్లి చేసుకుంటున్నారు. రేపు ఇంకో అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటే అప్పుడేం చేస్తారు అంటూ కావ్య ప్రశ్నిస్తుంది. మనిషి బయపడితే పెళ్లి చేసుకోవడం కాదండి.. మనసుకు అనిపిస్తే చేసుకోవాలి. ఆ మనిషి కళ్ల ముందు లేకపోతే మనం బతకలేము అనిపిస్తే చేసుకోవాలి.. రామ్ గారు మీకు అలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా..? అని అడగ్గానే.. రాజ్ ఉన్నారండి అని చెప్పబోతుంటే.. కావ్య అది నాకు చెప్పవలసిన అవసరం లేదు. మీ మనసును అడిగి తెలుసుకోండి అంటూ చెప్పి వెళ్లిపోతుంది.
మరోవైపు రూంలో ఉన్న రాహుల్, రుద్రాణి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటారు. రాహుల్ ఆకలి వేస్తుందని డోర్ తీయమని అడుక్కుంటుంటాడు. ఇంతలో రుద్రాణికి యామిని ఫోన్ చేస్తుంది. లేట్‌గా లిఫ్ట్ చేస్తుంది రుద్రాణి. హలో చెప్పు యామిని అని అడగ్గానే.. ఏంటి ఫోన్ లిప్ట్ చేయడానికి ఇంత లేటు అని అడుగుతుంది. దీంతో రుద్రాణి ఫోన్ సైలెంట్‌లో ఉంది అని చెప్తుంది. ఫోన్ మాత్రమే సైలెంట్‌లో ఉందా..? లేకపోతే నీ ప్లాన్ కూడా సైలెంట్‌లో ఉందా..? అని అడుగుతుంది యామిని ఇంత టైం అయినా ఇంకా కనిపించడం లేదేంటి..? అసలు పెళ్లికి వచ్చావా..? లేదా..? అని అడుగుతుంది. వచ్చాను యామిని ఇదిగో ఇక్కడే పక్కన ఉన్నాను టైం చూసి ఎంట్రీ ఇద్దామని ఆగిపోయాను అని చెప్పగానే సరే అంటూ యామిని కాల్ కట్ చేస్తుంది.
పంతులును బ్లాక్ మెయిల్ చేసి అందరూ కలిసి కిందకు వస్తుంటే కావ్య చూస్తుంది. మీరందరూ ఏం చేస్తున్నారో నాకు అర్థం అయిపోయింది అంటుంది. దీంతో పంతులు భయంగా అమ్మా ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా.. ఇదిగో ఈ ముగ్గురు గడుసు పిండాలే నాకు పిండం పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అసలు అంటూ పంతులు చెప్పబోతుంటే.. కనకం వెనక నుంచి పంతులును గిల్లి తనకేం తెలియదు బయటపెట్టొద్దు అంటుంది. దీంతో కావ్య ఏంటి సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు. మీరు ముగ్గురు శాస్త్రి గారిని భయపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదూ అంటుంది.
దీంతో ఇంద్రాదేవి ఊరుకుంటున్నాం కదాని ఇందాకటి నుంచి ప్రతి దాంట్లో అనుమానిస్తున్నావేంటే ఈ శాస్త్రిని బ్లాక్ మెయిల్ చేస్తే మాకేంటి అంటుంది. దీంతో కావ్య శాస్త్రి గారు మీరైనా నిజం చెప్పండి అని అడుగుతుంది. పంతులు చెప్పబోతుంటే ముగ్గురు కలిసి తమ మాటలతో కన్పీజ్ చేస్తారు. తర్వాత అందరూ పూజ దగ్గరకు వెళ్తారు. పంతులు పూజకు అంతా సిద్దంగా ఉంది. అమ్మాయిని తీసుకురండి అని చెప్పగానే కనకం కూడా మేము కూడా సిద్దంగా ఉన్నాము తీసుకురండి అంటుంది. కనకం మాటలకు అందరూ షాక్ అవుతారు. ఇంతలో యామిని వస్తుంది. పంతులు పూజ మొదలుపెడతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?