BigTV English

Illu Illalu Pillalu Today Episode: ప్రేమను అడ్డంగా ఇరికించిన శ్రీవల్లి.. నర్మదపై రామరాజు సీరియస్..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమను అడ్డంగా ఇరికించిన శ్రీవల్లి.. నర్మదపై రామరాజు సీరియస్..

Illu Illalu Pillalu Today Episode june 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ, నర్మద ఇద్దరూ కూడా ఈ హనీమూన్ కు నర్మద ప్రేమ ఇద్దరూ మాకు కుదరదు అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్తే ముగ్గురు వెళ్లండి లేకపోతే అస్సలు ఎవరూ వెళ్ళకండి అని రామరాజు అంటాడు. అయితే, చందు మేము ఆలోచించుకొని చెప్తామని అంటాడు. కానీ ధీరజ్ మాత్రం ప్రేమ ఏదో తేడాగా ఆలోచిస్తుంది అని అనుకుంటాడు. ప్రేమకు ఏదో జరిగిందని అనుకుంటూ ఉండగానే ప్రేమ ఆల్ ది బెస్ట్ చెప్పించుకొని వెళ్ళిపోతుంది.. తోడికోడళ్ళు తనకి శత్రువుగా మారుతున్నారని అడుగడునా అడ్డుపడుతున్నారని శ్రీవల్లి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంట్లో నా మాటకు విలువ లేకుండా పోయిందని తెగ ఫీల్ అవుతుంది.. అయితే శ్రీవల్లి కోపం ఇంట్లోని వస్తువుల పై చూపిస్తుంది. వేదవతి షాక్ అవుతుంది. భాగ్యం చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ చాలా అద్భుతంగా పిల్లలకి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తుంది. పక్కనే ఉన్న నర్మదా ప్రేమ డాన్స్ ని చూసి మురిసిపోతూ అద్భుతంగా ఉంది అంటూ కామెంట్ చేస్తుంది. అయితే ప్రేమ కోసం ఆ పిల్లల తల్లి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. ధీరజ్ రావడం చూసి నర్మదా ప్రేమ ఇద్దరు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ధీరజ్ ఫుడ్ ఆర్డర్ చేశారు కానీ ఎవరు కనిపించలేదు ఇంతకీ మీ టీచర్ అమ్మ ఎక్కడ అని అడుగుతాడు. పిల్లలు ఇప్పుడే టీచర్ లోపలికి వెళ్లిందని చెప్తారు. ధీరజ్ లోపలికి వెళ్తుంటే ప్రేమ గొంతు మార్చి ఆగండి అని అరుస్తుంది. అక్కడున్న అద్దంలో ప్రేమను ధీరజ్ చూసేస్తాడు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ ని ఎలాగైనా పంపించాలని అనుకుంటుంది.

అక్కడే ఉన్నా మిర్రర్ లో ధీరజ్ చూసిన విషయం ప్రేమకు తెలియదు.. ఇక ప్రేమ గురించి ఇండైరెక్టుగా తిడుతూ ఉంటాడు.. నా పాలిట ఒక రాక్షసుల అండి దెయ్యం ఒకటి ఉంది సేమ్ అచ్చం మీరు అలానే మాట్లాడుతున్నారు ఏంటి అని ప్రేమను ఇండైరెక్టుగా తిడతాడు.. ప్రేమని ఇండైరెక్టుగా నానా మాటలు అంటాడు ధీరజ్. ఆ పిల్లలాగా టార్చర్ చేస్తున్నారు ఏంటండీ మీరు కూడా వచ్చి పార్సల్ తీసుకోండి మేడం అనేసి అంటాడు. ప్రేమ సహనాన్ని ధీరజ్ పరీక్షిస్తాడు. ఆ మాటలు తట్టుకోలేక ప్రేమ సచ్చినోడా అంటూ బయటికి వచ్చేస్తుంది..


నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావని ప్రేమను ధీరజ్ అడుగుతాడు.. నువ్వు దాకున్న సంగతి. నాకెలా తెలిసిందనుకున్నావా ఎదురుగా ఉన్న అద్దం పట్టించింది. నువ్వు తలుపు చాటున దాక్కొని పరాయి పురుషులని చూడను అని అబద్ధం చెప్పినా కూడా అర్థం అబద్ధం చెప్పదు కదా అని ధీరజ్ అంటాడు. మొత్తానికి ధీరజ్ కు ప్రేమ అడ్డంగా దొరికిపోతుంది. అక్కడున్న పిల్లలు ఆ అక్కే మాకు డాన్స్ టీచర్ అని అనగానే ధీరజ్ నువ్వు వాళ్లకు డాన్స్ టీచర్ ఇక్కడ ఏం చేస్తున్నావు నిజం చెప్పు అని ప్రేమని ధీరజ్ అడుగుతాడు. ఇక ప్రేమ అవును నేను ఇక్కడ డాన్స్ టీచర్ నేను ఒప్పేసుకుంటుంది. నువ్వు ఏమి చెయ్యొద్దు ఇంట్లో కూర్చోమని చెప్పాను కదా మరి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావని ప్రేమను అరుస్తాడు ధీరజ్.

దానికి ప్రేమ నువ్వేమో కష్టపడుతున్నావ్.. నేను చూస్తూ తిని ఎలా కూర్చుంటున్నాను అనుకుంటున్నావు అని ప్రేమ ధీరజ్ తో అంటుంది. ఇక్కడ ఏం మాట్లాడడానికి వీల్లేదు ఇంటికెళ్లిన తర్వాత అన్ని మాట్లాడుకుందామని ప్రేమ ధీరజ్ తో అంటుంది.. మొన్న ట్యూషన్ చెప్పే విషయమే ఇంట్లో పెద్ద రచ్చయింది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నేను ఊరుకుంటారా అని ధీరజ్ అంటాడు. కానీ ధీరజ్ మాత్రం ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు కదా నీకు అసలు బుద్ధి రావడం లేదు కదా అనేసి అంటాడు. ఈసారి మీ నాన్న తిట్టాడు మీ నాన్న అరిచాడు అంటూ తిట్టడం ఏడవడం చేసావంటే బాగోదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు..

చెట్టు చాటున దాక్కున్న నర్మదా ప్రేమ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు మీ ఆయన గారు అని అడుగుతుంది. దానికి నర్మదా ఎక్కడికి వెళ్లలేదు ఆ చెట్టు చాటున దాక్కొని ఇదంతా వింటున్నాను అని నర్మదా అంటుంది. అదేంటక్కా నన్ను ఇరికిచ్చేసి నువ్వు చెట్టు చాటున దాక్కున్నావా అనీ ప్రేమ అడుగుతుంది.. మీ ఆయన నన్ను కూడా చూసి వదిన నువ్వు కూడా ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదని నన్ను అడిగితే నేనేమని సమాధానం చెప్పాలా అని నర్మదా అంటుంది. చూసాడు కాబట్టి సరిపోయింది అదే అవన్నీ చూసినంటే మాత్రం ఇక ఇంట్లో నరకమే నీకు అని నర్మదా అంటుంది.

అప్పుడే అటుగా వెళుతున్న నర్మదా వీళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది. ప్రేమ భయపడినట్లుగానే నర్మద ప్రేమలను శ్రీవల్లి చూస్తుంది.. మొదట శ్రీవల్లి చూసి ఇదంతా నిజమే అని అనుకుంటుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరికీ ఏం పని అని శ్రీవల్లి ఆలోచిస్తుంది. ప్రేమ డాన్సింగ్ చేస్తుంటే నర్మదా తోడుగా ఉందన్నమాట వీళ్ళ డ్రామాలు అని ఎలాగైనా సరే మావయ్యకి చెప్పాల్సిందే అని అనుకుంటుంది.. నన్ను మా ఆయనను హనీమూన్ కు వెళ్లనివ్వకుండా మీరిద్దరూ అడ్డుపడతారా.. చెప్తాను మీ ఇద్దరి సంగతి ఒకేసారి చెప్తాను అని శ్రీవల్లి అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×