IMD Weather Alert: రాష్ట్ర వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. కర్నాటక, కేరళ, గోవా, తమిళనాడు, పాండిచ్చేరి, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, నాగాలాండ్, మనిపూర్, మిజోరం, తిరుపతి, ఒరిస్సా, తెలంగాణ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులురా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఈ రెండు రోజులు తెలంగాణలోని 16 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ.
శనివారం రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ , కామారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందంటోంది ఐఎండీ. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ.
మరోవైపు ఆదివారం కూడా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
Also Read: మళ్లీ కరోనా.. ఆ నెలలోనే భూమి అంతం! వణుకు పుట్టిస్తున్న బాబా వంగా జోస్యం
వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసేలా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీలు పొంగకూడా ఎప్పటికప్పుడు సిల్ట్ తీస్తూ, వాటిని క్లీన్ చేయాలన్నారు. అయితే తక్కువ సమయంలో.. ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది.