BigTV English
Advertisement

Brahmamudi Serial Today March 18th : ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యకు పిచ్చి పట్టిందన్న ఇందిరాదేవి – ఇంకా రెచ్చిపోయిన రుద్రాణి

Brahmamudi Serial Today March 18th : ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యకు పిచ్చి పట్టిందన్న ఇందిరాదేవి – ఇంకా రెచ్చిపోయిన రుద్రాణి

Brahmamudi serial today Episode: యామిని ఏవేవో పేపర్లు చూస్తుంటే వైదేహి వాళ్లు వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. దీంతో రాజ్‌ ఐడెంటీటీలు మార్చేస్తున్నానని చెప్తుంది యామిని. దీంతో ఏదో ఒక రోజు అంతా గుర్తుకు వస్తే నిన్ను అసలు క్షమించడు అని వాళ్ల నాన్న హెచ్చరిస్తే.. అవేమీ జరగకూడదనే కదా రాజ్‌ను తీసుకుని ఫారిన్‌ వెళ్లాలని డిసైడ్‌ అయ్యాను అంటుంది. దీంతో వైదేహి కోపంగా అంతా నీ ఇష్టమేనా..? ఇన్నాళ్లు ఆరోగ్యం బాగాలేదని మాకు దూరంగా ఉన్నావు. మ అదృష్టం బాగుండి మళ్లీ తిరిగొచ్చావు. మాకు నచ్చకపోయినా.. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానిక ఒప్పుకున్నాం. ఇప్పుడేమో మళ్లీ ఫారిన్‌ వెళ్తా అంటున్నావు. అంతా నీ ఇష్టమేనా అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో యామిని ఇక్కడే ఉంటే రాజ్‌కు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌ ఎదురుపడొచ్చు. ఎవరొచ్చినా నేను మాత్రం రాజ్‌ను వదులుకునే ప్రసక్తే లేదు. అది వేరే సంగతి కానీ అనవసరంగా గొడవలు జరిగితే మా పెళ్లి లేట్‌ అవుతుంది. అందుకే ఫ్యారిన్‌ తీసుకెళ్లి అక్కడే పెళ్లి చేసుకుంటాను. గతం గుర్తు రాకుండా జాగ్రత్త పడతాను. మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా రావొచ్చు మమ్మల్ని చూడొచ్చు అని చెప్తుంది.


దీంతో వాళ్ల నాన్న నాకు ఇష్టం లేదు. ఇప్పటికే నువ్వు నా నోరు నొక్కి చాలా దూరం తీసుకొచ్చావు. సరే నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి పాపం అని తెలిసినా మౌనంగా ఊరుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వు ఫారిన్‌ వెళ్లిపోతే పర్మినెంట్‌గా మాకు దూరం అయిపోతావు. మాకేం నలుగురు పిల్లలు లేరు. నువ్వు ఒక్క దానివే.. అనగానే.. డాడీ ఫ్లీజ్‌ అర్థం చేసుకో నా పరిస్థితి నీకు తెలుసు కదా అంటుంటే.. ఇంతలో రాజ్‌ ఏమైంది అంటూ వస్తాడు. అందరూ షాక్‌ అవుతారు. రాజ్‌ మొత్తం విన్నాడేమో అని యామిని బయటపడుతుంది. రాజ్‌ దగ్గరకు వచ్చి ఏమైంది అంకుల్‌ అని అడగ్గానే.. ఆ తల్లి కూతుళ్లనే అడగండి అంటాడు. దీంతో రాజ్‌ ఏమైంది యామిని అని అడగ్గానే.. ఫ్యారిన్‌ వెళ్లి మనం సెటిల్‌ అవుదామంటే మమ్మీ డాడీ ఒప్పుకోవడం లేదు అంటుంది. అదంతా తర్వాత బాబు మీ పెళ్లి ఇక్కడే జరిపించాలని నా కోరిక అని వైదేహి చెప్తుంది. దీంతో రాజ్‌ నేను ఇంకా జరిగిన దాన్ని డైజెస్ట్‌ చేసుకోలేకపోతున్నాను. అప్పుడే ఫ్యారిన్‌ దాకా ఎందుకు.. పెళ్లి ఎందుకు ఫ్లీజ్‌ కొద్ది రోజులు ఆగండి అని చెప్పి రాజ్‌ వెళ్లిపోతాడు.

బెడ్‌రూంలో బాధగా ఆలోచిస్తూ అటూ ఇటూ నడుస్తున్న కావ్య చేయి టేబుల్‌కు తగిలి చేతికి ఉన్న గాజులు పగిలిపోతాయి. దీంతో కావ్య ప్లాష్‌బాక్‌ లోకి వెళ్తుంది. రాజ్‌ తనకు గాజులు వేసిన విషయం గుర్తు చేసుకుంటుంది. నిజంగానే రాజ్‌ తన చేతులు పట్టుకున్న కలగంటూ పలవరిస్తుంది. అప్పుడే అటు వైపు వచ్చిన ఇందిరాదేవి కావ్యను చూసి షాక్‌ అవుతుంది. కావ్యకు నిజంగానే పిచ్చి పట్టిందేమోనని బాధగా వెళ్లిపోతుంది. కిందకు వెళ్లిన ఇందిరాదేవి ఓరేయ్‌ సుభాష్‌ కావ్యను చూస్తే భయమేస్తుందిరా అని చెప్తుంది. దీంతో రుద్రాణి ఏం చీకటి గదిలో కూర్చుని చంద్రుడికి నాట్యం చేస్తుందా ఏంటి అంటుంది. దీంతో అపర్ణ కోపంగా ఒక్కమాట కూడా మంచి మాట మాట్లాడలేవా..? అంటూ తిడుతుంది. స్వప్న కూడా మానుఫాశ్చరింగ్‌ డిఫెక్ట్‌ ఆంటీ కొన్ని జీవితాలు అంటే అంటూ తిడుతుంది.


దీంతో రుద్రాణి భయమేస్తుంది అంటే అలాంటిదేమైనా చేస్తుందేమోనని డౌటు వచ్చి బయటకు అనేశాను. వాక్‌ స్వాతంత్రం కూడా లేదా మాకు ఈ ఇంట్లో అంటుంది. దీంతో ప్రకాష్‌ సందు దొరికినప్పుడల్లా కుక్కలా మొరుగుతూ వాక్‌ స్వాతంత్రం లేదా అంటున్నావా..? అసలు సిగ్గు లేకపోతే సరి నీకు అంటూ తిడతాడు. సుభాష్‌ మాత్రం అవేమీ పట్టించుకోకుండా అమ్మా అసలు ఏమైందో చెప్పు అని అడుగుతాడు. దీంతో ఇందిరాదేవి బాధగా రాజ్‌ ఇంకా బతికి వస్తాడనే భ్రమలోనే తను ఇంకా బతుకుతుందిరా.. అని చెప్పగానే.. ధాన్యలక్ష్మీ తనంత గుడ్డిగా నమ్ముతుంది. మనం చెప్పినా వినే పరిస్తితిలో లేదు కదా అంటుంది. దీంతో ఇందిరాదేవి అవునురా రాజ్‌ తన పక్కనే ఉన్నట్టు.. తనతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ తనలో తానే మురిసిపోతుంది. రాజ్‌ ఇంకా వస్తాడని  వాడికోసం ఎదురుచూస్తుంది. ఈ రుద్రాణి చెప్పినట్టు అని ఆగిపోతుంది. దీంతో రుద్రాణి.. ఆపారేం చెప్పండి అనగానే.. ఇందిరాదేవి తన మానసిక పరిస్థితి మారిపోతుందేమో అనిపిస్తుందిరా అనగానే.. ఏం చెప్తున్నావు అమ్మా అని సుభాష్ అడగ్గానే.. అవునురా ఇప్పుడే తనను లోపల చూసి వచ్చానురా అని చెప్పగానే.. ఒక్కొక్కరు అదే అనుమానం వ్యక్తం చేస్తారు. కావ్యను మంచి డాక్టర్‌ కు చూపించాలని డిసైడ్‌ అవుతారు. పనిలో పనిగా పురోహితుణ్ని పిలిపించండి అని రాజ్‌ కర్మలు జరిపించాలని చెప్తుంది. దీంతో అపర్ణ కోపంగా రుద్రాణిని తిడుతుంది.

ఓంటరిగా ఆలోచిస్తున్న రాజ్‌ కావ్య రోడ్డు మీద కళ్లు తిరిగి కిందపడిపోయిన విషయం గుర్తు చేసుకుంటుంటాడు. కావ్య ఎత్తుకుని హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడ కావ్యకు ట్రీట్‌మెంట్ చేయించింది గుర్తు చేసుకుంటుంటాడు. మరోవైపు కావ్య కూడా ఇంట్లో ఏడుస్తూ కూర్చుని రాజ్‌ గురించే ఆలోచిస్తుంది. ఇంకోవైపు రాజ్‌ దగ్గరకు వచ్చిన యామిని ఏమైంది బావ అంటూ పలకరిస్తూ భుజం మీద చేయి వేస్తుంది. వెంటనే యామిని చేయిని తీసేస్తాడు రాజ్‌. నీ చేయి స్పర్శ నాకు పరిచయం అయిన స్పర్శలా లేదు. కానీ ఆ అమ్మాయిని టచ్ చేస్తే మాత్రం నాకు బాగా తెలిసిన స్పర్శలాగా అనిపించింది అని చెప్తాడు. ఏ అమ్మాయి అని యామిని అడగ్గానే.. ఇవాళ రోడ్డు మీద ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పాను కదా.. ఆమె ముఖం చూస్తే నాకు బాగా తెలిసిన అమ్మాయిలా అనిపించింది. నా మెదడుకు నా మనసుకు మధ్య ఏదో జ్ఞాపకం ఊగిసలాడుతుంది. నా మనసుకు మాత్రం ఆమె నాకు బాగా తెలిసిన అమ్మాయిలా అనిపించింది అని చెప్పగానే.. యామిని భయంగా మనసులో వీలైనంత త్వరగా రాజ్ ఫారిన్‌ తీసుకెళ్లాలి అని మనసులో అనుకుంటుంది. మరోవైపు రాజ్‌కు ఇంట్లో కర్మకాండలు జరిపిస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Gundeninda Gudigantalu Prabhavathi : ప్రభావతిలో ఈ టాలెంట్ కూడా ఉందా..? కూతురు, కొడుకుతో కలిసే ఆ పని..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. వాటిని మిస్ అవ్వకండి..

Big tv Kissik Talks: రాజు జీవితంలో రాణి లేదు.. బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన రాజు!

Big tv Kissik Talks: డ్యాన్సర్లు అంటే అంత చులకనా… ఎమోషనల్ అయిన రాజు!

Illu Illalu Pillalu Today Episode: సేనకు నర్మద వార్నింగ్.. భాగ్యంకు దిమ్మతిరిగే షాక్.. రామా రాజు ఇంట పెద్ద గొడవ..

Nindu Noorella Saavasam Serial Today November 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి ప్లాన్ సక్సెస్ 

Brahmamudi Serial Today November 5th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణి ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌

Intinti Ramayanam Today Episode: మీనాక్షి పై శ్రీయ సీరియస్..తల్లి రాకతో అవని హ్యాపీ.. ఫ్రెండ్ ను కలిసిన పల్లవి..

Big Stories

×