OTT Movie : సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటిటి ప్లాట్ ఫామ్ ఒక వేదికగా మారిపోయింది. ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ప్లాట్ ఫామ్ ని ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు మూవీ లవర్స్. రొమాంటిక్ సీన్స్ తో ఈ వెబ్ సిరీస్ లు పిచ్చెక్కిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ఒక క్రైమ్ చుట్టూ తిరుగుతుంది. ఒక పదమూడు సంవత్సరాల టీనేజ్ కుర్రాడి పై ఈ ఆరోపణలు ఉంటాయి. అంత చిన్న పిల్లాడు ఈ హత్య ఎలా చేశాడు అనే అనుమమనం వస్తుంది ఆఫీసర్స్ కు. ఆ తరువాత జరిగే ఇన్వెస్టిగేషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘అడోలెసెన్స్’ (Adolescence). యుక్తవయస్సు లో ఉన్న జాన్ చేసిన ఒక హత్య చుట్టూ స్టోరీ తిరుగురుంది. 2025 రిలీజ్ అయిన ఈ బ్రిటీష్ క్రైమ్ డ్రామా టెలివిజన్ మినిసిరీస్ కు ఫిలిప్ బరాంటిని దర్శకత్వం వహించారు. నాలుగు ఎపిసోడ్లతో ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
జాన్ అనే ఒక టీనేజ్ కుర్రాడిని పోలీసులు హడావిడిగా అరెస్ట్ చేస్తారు. అతన్ని ఒక హత్య కేసులో ఇంటరాగేషన్ చేస్తారు పోలీసులు. పదమూడు ఏళ్ల వయసులో ఇలా ఎందుకు చేశాడో తెలియక ఆలోచనలో పడతారు పోలీసులు. అయితే అతను తాను మొదటి నుంచి ఏ తప్పు చేయలేదని బుకాయిస్తాడు. పోలీసులు హత్య చేసినప్పుడు రికార్డ్ అయిన వీడియోని ఆ అబ్బాయికి చూపిస్తారు. అందులో ఒక అమ్మాయిని జాన్ ఏడుసార్లు కత్తితో పొడుస్తూ ఉంటాడు. ఈ ఘటన తరువాత ఆ తర్వాత అమ్మాయి కూడా చనిపోతుంది. ఇది చూసి కూడా అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఈ విషయం తెలుసుకొని జాన్ తండ్రి అక్కడికి వచ్చి చాలా దిగులు పడతాడు. నా పెంపకంలో ఏం తప్పు చేశానని నాకు ఈ శిక్ష అంటూ బాధపడతాడు. ఆ తర్వాత ఒక సైకాలజిస్ట్ ఈ కుర్రాడి దగ్గరికి వచ్చి వివరాలు తెలుసుకుంటుంది. ఆమెకు కూడా జాన్ సరైన సమాధానం చెప్పకుండా ఉంటాడు. కొంతమంది పిల్లల విపరీత ప్రవర్తనతో విసిగిపోయి జాన్ ఈ హత్య చేస్తాడని అనుకుంటారు. ఆ తరువాత విచారణలో పోలీసులకి దిమ్మ తిరిగే విషయాలు తెలుస్తాయి. చివరికి జాన్ ఎందుకు ఈ హత్య చేస్తాడు? పోలీసులు జాన్ నుంచి వివరాలు సేకరిస్తారా? మరేదైనా కోణం ఉందా ? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అడోలెసెన్స్’ (Adolescence) అనే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.