E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంట్లోకి వెళ్లిన రాజు  

Brahmamudi Serial Today march 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంట్లోకి వెళ్లిన రాజు  
Advertisement

Brahmamudi serial today Episode: రేఖ, భ్రమరాంబ, ఐశ్వర్య, శేషు, భూషణం అందరూ ఇందు కోసం హాల్లో ఎదురుచూస్తుంటారు. ఇంతోల భ్రమరాంబ కోపంగా రేఖ ఇంకా ఎంతసేపని మనం దాని కోసం ఎదురుచూడాలి ఫోన్‌ చేసి ఎక్కడుందో అడుగు అని చెప్పగానే.. శేషు కోపంగా మనసులో అబ్బా ఏం ఫర్మామెన్స్‌ చేస్తున్నావే.. దొంగిలించిన సొమ్మును నీ దగ్గర పెట్టుకుని భలే నటిస్తున్నావు కదా..? కదా అనుకుంటాడు. ఇంతలో ఇందు భయం భయంగా ఇంట్లోకి వస్తుంది. భ్రమరాంబ కోపంగా అయిందా అమ్మ నీ తిరుగుళ్లు అనగానే.. ఇందు భయంగా తిరగడం ఏంటి పిన్ని నేను వంట పని చేయడానికి వెళ్లాను కదా అనగానే.. భ్రమరాంబ అబ్బా ఏం నటిస్తున్నావే అనగానే.. రేఖ వదిన నువ్వు ఆగు అంటూ ఇందు దగ్గరకు వెళ్లి ఎందుకు చేశావు ఈ పని అనగానే.. ఇందు భయంగా ఆంటీ మీరు ఏం మాట్లాడతున్నారో నాకు అర్థం కావడం లేదు అనగానే.. నా రెండు నెక్లెస్‌ లు ఎందుకు దొంగిలించావు.. అని అడగ్గానే..

ఇందు ఏడుస్తూ.. ఆంటీ నేను ఉదయం మీకు చెప్పే కదా శివరాం ఇంటికి వెళ్లాను మళ్లీ ఇప్పుడే వచ్చాను అని చెప్పగానే.. అందరూ కలిసి ఇందును తిడతారు. దీంతో ఇందు ఆంటీ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు నా గురించి మీకు తెలియదా ఆంటీ అనగానే.. ఎందుకు తెలియదు.. నీకోసం నువ్వు ఏమీ చేసుకోకపోయినా.. ఆ ముసలోడి కోసం దొంగతనం చేసుంటావని నాకు తెలుసు.. అయినా నువ్వు దొంగతనం చేసిన విషయం ఆ ముసలోడికి తెలిస్తే ప్రాణాలతో ఉంటాడా.? అయినా నేను ఎన్ని చేసినా నీలో ధైర్యం ఇంకా పుట్టగొడుగులా పుట్టుకొస్తుందేంటి..? నువ్వు చేసిన పనికి వాళ్లకు శిక్ష వేస్తాను.. అంటూ వార్నింగ్‌ ఇస్తుంటే.. స్వాతి మనసులో భయపడుతుంది. రేఖ మాత్రం నువ్వు నిజం చెప్పి నగలు నా చేతిలో పెడితే ఈ గొడవను ఇంతటితో ఆపేస్తాను.. లేదంటే ఆ రెండు ప్రాణాలు తీసేస్తాను అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే.. ఇందు ఏం చేయాలో అర్థం కాకా చూస్తుండిపోతుంది.

Advertisement

కట్‌ చేస్తే రూంలో సుభాష్‌, అపర్ణ ఇందు గురించి బాధపడుతుంటారు. చిన్న వయసులోనే ఇందు ఎన్నో కష్టాలు పడుతుంది అనుకుంటూ రేవతి కొడుకు రాజ్‌ బతికే ఉన్నాడేమో అని అనుమానిస్తారు.. రాజ్‌ బతికే ఉంటే బాగుండు అనిపిస్తుంది అని ఇద్దరూ ఆనుకుంటుండగానే.. రాజ్‌, లక్కీ కలిసి దుగ్గిరాల ఇంటికి వస్తారు. ఇంట్లోకి వస్తున్న రాజ్‌కు ఏవేవో జ్ఞాపకాలు వస్తుంటాయి. అయోమయంగా చూస్తుంటాడు రాజ్‌. లక్కీ ఏంటి మావా అలా చూస్తున్నావు అని అడగ్గానే.. ఈ ఇంటిని ఇంతకముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అనుకుంటూ ఇంట్లోకి వెళ్తారు. లక్కీ హాయ్‌ ఐశ్వర్య అని పిలవగానే.. అందరూ అటువైపు చూస్తారు.. రాజ్‌ను చూసిన రేఖ షాక్‌ అవుతుంది. అచ్చం రాజు బావ లాగే ఉన్నాడేంటి వీడు అని భయపడుతుంది. తడబడుతూనే రాజ్‌ అంటుంది. నా పేరు బాగానే గెస్‌ చేశారు.. కానీ నా పేరు రాజ్‌ కాదు.. రాజు అంటాడు.

భ్రమరాంబ ఎందుకొచ్చారు అని అడగ్గానే.. ఐశ్వర్య కోసం వచ్చామని చెప్తారు. ఐశ్వర్య కారులో నెక్లెస్‌ మర్చిపోయిందని అది తీసుకొచ్చామని చూపిస్తారు. ఐశ్వర్య, రేఖ భ్రమరాంబ అందరూ షాక్‌ అవుతారు.. భ్రమరాంబ మాత్రం కోపంగా ఐశ్వర్యను నిలదీస్తుంది. ఇంతలో రేఖ ఇంకో నెక్లెస్‌ ఎక్కడ అంటూ కోపంగా అడుగుతుంటే.. స్వాతి నేను చెప్తాను అంటూ వచ్చి నెక్లెస్‌ చూపిస్తుంది. అందరూ షాక్‌ అవుతారు.. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Big Stories

Advertisement
×