E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్:   కొత్త కళను సంతరించుకున్న దుగ్గిరాల ఇల్లు – ఇంట్లో బాంబు పేల్చడానికి రెడీ అయిన అనామిక

Brahmamudi Serial Today November 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్:   కొత్త కళను సంతరించుకున్న దుగ్గిరాల ఇల్లు – ఇంట్లో బాంబు పేల్చడానికి రెడీ అయిన అనామిక
Advertisement

Brahmamudi serial today Episode:   పండుగ రోజు కంపెనీ వర్కర్స్‌ కు పంచాల్సిన చెక్స్‌ తీసుకొచ్చి కావ్యకు ఇస్తుంది ఇందిరాదేవి. అవి నా కెందుకు అని కావ్య తీసుకోకుండా.. మీ మనవడి చేతనే ఆ చెక్స్‌ పంపిణీ చేయిస్తే బాగుంటుంది అంటుంది కావ్య. ఎవరు పంచాలో తాతయ్యకు తెలియదా..? అంటూ చెక్స్‌ కావ్య చెతిలో పెట్టి ఇందిరాదేవి వెళ్లిపోతుంది. ఆ చెక్స్‌ తీసుకుని కావ్య, రాజ్‌ రూం దగ్గరకు వెళ్తుంది. కావ్య చేతిలో చెక్స్ చూసిన రాజ్‌.. కవర్స్‌ తీసుకొచ్చావు. కొత్తగా పోస్ట్‌ మెన్‌ జాబ్‌ చేస్తున్నావా..? అని అడుగుతాడు.

మీకు పోస్ట్‌ వస్తే పనిమనిషితో పంపించేదాన్ని ఇలా నేను తీసుకొచ్చే దాన్ని కాదు అంటుంది కావ్య. అయితే మరి ఎందుకు వచ్చావు అంటాడు రాజ్‌. మీతో మాట్లాడాలి అంటూ రూంలోకి వెళ్తుంది కావ్య. దీంతో రాజ్‌ ఇరిటేటింగ్‌ గా  ఏయ్‌ ఎందుకు లోపలికి వచ్చావు. ఏమున్నా గది బయటే ఉండి మాట్లాడు.. బయటకు వెళ్లు అంటాడు. బయట ఉండి మాట్లాడాల్సిన విషయం కాదు. లోపల మాట్లాడాల్సింది అంటూ కావ్య సీతారామయ్య ఇచ్చిన చెక్స్‌ గురించి చెప్తూ.. తాతయ్య గారు ఈ చెక్స్‌ నా చేతుల మీదుగా వర్కర్స్‌ కు ఇవ్వమన్నారు కానీ మీరు చెక్స్‌ ఇస్తేనే బాగుంటుందని మీ దగ్గరకు తీసుకొచ్చాను అంటుంది కావ్య.

Advertisement

రాజ్‌ కోపంగా నీకు వచ్చిన అవకాశాన్ని నాకు దానం చేస్తున్నావా..?  అంటూ కోపంగా అక్కర్లేదని తాతయ్య ఏదో ఒకరోజు మళ్లీ నన్ను కంపెనీ సీఈవోను చేస్తారు. అప్పుడు మళ్లీ నేనే చెక్స్‌ ఇస్తాను అంటూ రాజ్‌ బయటకు వెళ్లిపోతాడు. మరోవైపు ధాన్యలక్ష్మీ, రుద్రాణి మాట్లాడుకుంటుంటే కళ్యాణ్‌, అప్పు వస్తారు. ధాన్యలక్ష్మీ చూస్తూ ఆగిపోతుంది. ఏంటి ధాన్యలక్ష్మీ  ఇక్కడే ఆగిపోయావు. వెళ్లి లోపలికి తీసుకురా..? పాపం అప్పుకు అలవాటు లేకపోయినా లాస్ట్‌ టైం నువ్వు చెప్పావని చీర కట్టుకుని వచ్చింది. పద అయినా నువ్వేంటి కళ్యాణ్‌ ఏదో పరాయి ఇంటికి వచ్చినట్టు భయం భయంగా వస్తున్నావు. ఇందాక నుంచి నువ్వెందుకు చిరాకుగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్తం అయింది. ఏంటి ధాన్యలక్ష్మీ ఇంకా అలా ఉన్నావు. అప్పును క్షమించవచ్చు కదా..? అంటుంది రుద్రాణి.

ఇంతలో అక్కడకు వచ్చిన స్వప్న ఆశ్చర్యంగా వామ్మో నువ్వు అందరు కలిసి ఉండటం గురించి ఆలోచిస్తున్నావా..? నీ స్టైల్‌ ఎప్పుడు అందర్ని విడగొట్టడమే కదా..?  అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతలో ప్రకాష్‌ కరెక్టుగా చెప్పావమ్మా స్వప్న. మీ అత్తయ్య గురించి చాలా బాగా అర్థం చేసుకున్నావు అంటూ అక్కడకు వచ్చి నువ్వేంట్రా కళ్యాణ్‌ పరాయివాడిలా అలా భయం భయంగా లోపలికి వస్తున్నావు అంటాడు. ఇంతలో రుద్రాణి మంచిగా మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు. మాట్లాడితే ఇలా దెప్పి పొడుస్తారు. మీరే  మాట్లాడుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక కళ్యాణ్‌, అప్పులను స్వప్న లోపలికి తీసుకెళ్తుంది. ధాన్యలక్ష్మీ అలాగే చూస్తుండిపోతుంది. అప్పుడు ధాన్యలక్ష్మీని ప్రకాష్‌ తిడతాడు. కనీసం వాడు వచ్చినందుకైనా కాస్త సంతోషంగా ఉండు నీ ఏడుపు ముఖం చూడలేకపోతున్నాను అంటూ వెళ్లిపోతాడు.

Advertisement

ఒంటరిగా రూంలో కూర్చున్న కళ్యాణ్‌ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. ఇంతలో బట్టలు తీసుకుని రూంలోకి వస్తుంది అప్పు. ఏంట్రా భాయ్ ఇంకా అలాగే కూర్చున్నావు. నీవు కష్టపడి సంపాదించిన డబ్బులతో మీ అమ్మానాన్నలకు బట్టలు కొన్నావు. అవి వాళ్లకు ఇవ్వవా..? అని గుర్తు చేస్తుంది. ఇవ్వవా అంటే నువ్వు రావా..? ఇవ్వడానికి అని కళ్యాణ్‌ అడుగుతాడు. నేను వస్తే మళ్లీ మీ అమ్మ బాధపడుతుంది. ఈరోజు ఆమెను బాధపెట్టడం ఎందుకు అందుకే నేనేం రాను నువ్వు వెళ్లి బట్టలు ఇవ్వు అని అప్పు చెప్పగానే అదేం లేదు. మనం ఇద్దరం కలిసే వెళ్తున్నాం బట్టలు ఇస్తున్నాం అనుకుంటూ అప్పును కూడా తనతో తీసుకుని కిందకు వెళ్తాడు కళ్యాణ్‌.

కింద హాల్లో కూర్చున్న ధాన్యలక్ష్మీకి కళ్యాణ్‌ బట్టలు తీసుకొచ్చానని చెప్తాడు. ధాన్యలక్ష్మీ మనసులో హ్యాపీగా ఫీలవుతుంది. కానీ బట్టలు తీసుకోకుండా అలాగే చూస్తుండి పోతుంది. ఇంతలో అక్కడకు ఇందిరాదేవి, అపర్ణ వస్తారు. ఏంటి ఆలోచిస్తున్నావు ధాన్యలక్ష్మీ.. కొడుకు తన సంపాదనతో బట్టలు కొని తీసుకొస్తే సంతోషంగా తీసుకోక చూస్తావేంటి..? అని ఇందిరాదేవి చెప్తుంది. అపర్ణ కూడా ఇలాంటి అవకాశం అందరికీ దక్కదు ధాన్యలక్ష్మీ. కోట్ల ఆస్థులు ఉన్నా.. ఇలాంటి ఆనందం మాత్రం పొందలేము. అంతెందుకు నా కొడుకు విషయం తీసుకో.. తన చదువు పూర్తి కాగానే మన కంపెనీ బాధ్యతలు తీసుకున్నాడు. కానీ కళ్యాన్‌ తన సొంత సంపాదనతో నీకు బట్టలు తీసుకొచ్చాడు తీసుకో.. అంటుంది.

వాళ్ల మాటలకు కన్వీన్స్‌ అయిన ధాన్యలక్ష్మీ.. కళ్యాణ్‌ ఇచ్చిన చీరను తీసుకుంటుంది. అప్పు కూడా ప్రకాష్‌కు బట్టలు ఇస్తుంది. కళ్యాణ్‌, అప్పులు వారి వద్ద ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంతలో ఇందిరాదేవి పిల్లలు ఇచ్చిన కొత్త బట్టలు తీసుకున్నారు. మరి మీరు వారి కోసం కొన్న బట్టలు వారికి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్తుంది. అయితే కళ్యాణ్‌ ఒక్కడికే బట్టలు కొన్నానని ధాన్యలక్ష్మీ చెప్తుంది. అప్పు బాధపడుతుంది. ఎందుకు ఇద్దరికి కొనలేదని ఇందిరాదేవి అడిగితే ఆవిడ గారు ఫ్యాంటు షర్ట్‌ వేస్తారు నాకు వాటి గురించి తెలియదు అని అప్పును అవమానిస్తున్నటు మాట్లాడుతుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో నువ్వు ఇలా చేస్తావని నాకు ముందే తెలుసు అందుకే అప్పు కోసం మంచి చీర కొన్నాను ప్రకాష్‌ లోపలికి వెళ్లి చీరను తీసుకొస్తాడు. అందరూ సంతోషంగా ఉంటారు.

వాళ్ల సంతోషాన్ని చూడలేకపోయిన రుద్రాణి, అనామికకు ఫోన్‌ చేసి నువ్వేదో చేస్తానని చెప్పావు. నువ్వు చేసే లోపు ఇక్కడ శత్రువులు మిత్రులు అయిపోతున్నారు అని చెప్తుంది. దీంతో కొంచెం వెయిట్ చేయండి ఆంటీ.. ఈ పండుగనైనా వాళ్లను సంతోషంగా చేసుకోనిద్దాం తర్వాత వాళ్లు ఎలాగూ హ్యాపీగా ఉండలేరు కదా… అని ఫోన్‌ కట్‌ చేస్తుంది. తర్వాత ఇంట్లో పూజ చేసిన తర్వాత సీతారామయ్య ఇక కావ్య చేతుల మీదుగా చెక్స్‌ ఇచ్చే కార్యక్రమం ప్రారంభిద్దాం అంటాడు. కావ్య ఆలోచనలో పడిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×